హోమ్ /వార్తలు /క్రీడలు /

RCB : ఆ విషయంలో మాత్రం ఆర్సీబీని చూసి సన్ రైజర్స్ హైదరాబాద్ బుద్ది తెచ్చుకోవాల్సిందే.. అసలు విషయం ఏంటంటే?

RCB : ఆ విషయంలో మాత్రం ఆర్సీబీని చూసి సన్ రైజర్స్ హైదరాబాద్ బుద్ది తెచ్చుకోవాల్సిందే.. అసలు విషయం ఏంటంటే?

ఆర్సీబీ లోగో (ఫైల్ ఫోటో)

ఆర్సీబీ లోగో (ఫైల్ ఫోటో)

RCB : ఇండియన ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. లీగ్ స్టేజ్ లో ఇంకా ఆరు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉండగా.. మూడు ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం ఏడు జట్ల మధ్య పోటీ నెలకొని ఉంది. ఇక ఎప్పటిలానే సీజన్ ను గొప్పగా ఆరంభించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఆ తర్వాత గాడి తప్పి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

ఇంకా చదవండి ...

RCB : ఇండియన ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. లీగ్ స్టేజ్ లో ఇంకా ఆరు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉండగా.. మూడు ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం ఏడు జట్ల మధ్య పోటీ నెలకొని ఉంది. ఇక ఎప్పటిలానే సీజన్ ను గొప్పగా ఆరంభించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఆ తర్వాత గాడి తప్పి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. 14 పాయింట్లతో ప్రస్తుతం ఆ జట్టు ఐదో స్థానంలో కొనసాగుతోంది. గురువారం నాడు గుజరాత్  టైటాన్స్ (Gujarat Titans)తో జరిగే మ్యాచ్ ల ోభారీ విజయం సాధించి.. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఆ జట్టుకు దాపురించింది.

ఇది కూడా చదవండి : ఆర్సీబీ కథ కంచికేనా.? మరి ఆ ఐదు జట్ల సంగతేంటి.? ఢిల్లీ గెలుపుతో మారిన ప్లేఆఫ్స్ ఈక్వేషన్స్.. కొత్త లెక్కలు ఇవే..

అయితే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిన తర్వాత లభించిన విరామంలో ఆర్సీబీ ఆటగాళ్లు చిల్ అవుతున్నారు. ఈ క్రమంలో తమ జట్టుకు ఆడిన ఇద్దరు ఆటగాళ్లను హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుతో ఆర్సీబీ గౌరవించింది. ఏబీ డీవిలియర్స్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ గతంలో ఆర్సీబీ జట్టుకు ఆడిన సంగతి తెలిసిందే. డీవిలియర్స్ 11 ఏళ్ల పాటు ఆర్సీబీకి ఆడితే.. గేల్ 7 ఏళ్ల పాటు బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలో వీరు జట్టుకు అనేక సార్లు అద్భుత విజయాలను అందించారు. వీరిద్దరినీ ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుతో సత్కరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీవిలియర్స్, క్రిస్ గేల్ ఈ కార్యక్రమానికి అటెండ్ కాగా.. ముంబై నుంచి ఆర్సీబీ టీం మొత్తం అటెంట్ అయ్యింది. ఈ క్రమంలో కోహ్లీ విరిద్దరి సేవల గురించి మాట్లాడారు. అనంతరం హాల్ ఆఫ్ ఫేమ్ లోకి ఆహ్వానిస్తున్నట్లు కోహ్లీ తెలిపాడు. కోహ్లీ మాట్లాడుతుంటే డీవిలియర్స్, గేల్ భావోద్వేగానికి గురికావడం విశేషం. వచ్చే ఏడాది చిన్న స్వామి వేదికగా వీరిద్దరికీ హాల్ ఆఫ్ ఫేమ్ మెడల్స్ ను బహూకరిస్తామని ఆర్సీబీ పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మాజీ ఆటగాళ్ల పట్ల ఆర్సీబీ చాలా హుందాగా ప్రవర్తించిందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

2016లో జట్టును చాంపియన్ గా నిలబెట్టిన డేవిడ్ వార్నర్ ను అవమానకర రీతిలో సన్ రైజర్స్ సాగనంపిన విషయం తెలిసిందే. 2021 సీజన్ లో కొన్ని మ్యాచ్ లకు వార్నర్ ను బెంచ్ కే పరిమితం చేసింది. అనంతరం అతడిని వదిలించుకుంది. వార్నర్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అద్బుతంగా రాణిస్తున్నాడు. ఆ జట్టు తన చివరి మ్యాచ్ ల ో గెలిస్తే ప్లే ఆఫ్ప్ కు చేరుకునే వీలుంది. మాజీ ఆటగాళ్లను ఎలా గౌరవించాలో ఆర్సీబీని చూసి నేర్చుకోవాలంటూ కొందరు ఫ్యాన్స్ ఇన్ డైరెక్ట్ గా సన్ రైజర్స్ కు చురకలు అంటిస్తున్నారు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chris gayle, Faf duplessis, Glenn Maxwell, IPL, IPL 2022, RCB, Royal Challengers Bangalore, Virat kohli

ఉత్తమ కథలు