IPL 2022 ROYAL CHALLENGERS BANGALORE YOUNG BATTER RAJAT PATIDAR BAGS SOME RECORDS WITH HIS BRILLIANT KNOCK SRD
IPL 2022 - Rajat Patidar : KGF విఫలమైన చోట.. రికార్డులతో చెడుగుడు.. ఆర్సీబీ చరిత్రలో కోహ్లీ వల్ల కూడా కాలేదు..!
Rajat Patidar (IPL Twitter)
IPL 2022 - Rajat Patidar : కీలక మ్యాచ్‌లో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆర్సీబీ కేజీఎఫ్ (కోహ్లీ(25), గ్లేన్ మ్యాక్స్‌వెల్(9), ఫాఫ్ డుప్లెసిస్(0)) విఫలమైన వేళ.. పాటిదార్ జట్టుకు ఊపిరయ్యాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ సెంచరీ హీరోను మెగా వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయలేదు.
ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో మరో ఆణిముత్యం వెలుగులోకి వచ్చింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) యువ ప్లేయర్ రజత్ పాటీదార్ (Rajat Patidar)(54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 112 నాటౌట్) అజేయ శతకంతో క్రికెట్ అభిమానులతో పాటు దిగ్గజ క్రికెటర్లను ఆకట్టుకున్నాడు. అయితే ఈ శతకంతో రజత్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 15 ఐపీఎల్ చరిత్రలో ప్లే ఆఫ్స్‌లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన బ్యాటర్‌గా పాటీదార్ గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో వృద్దిమాన్ సాహా రికార్డును సమం చేశాడు. సాహా 49 బంతుల్లో సెంచరీ సాధించగా.. పాటీదార్ కూడా 49 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఐపీఎల్లో సెంచరీ సాధించిన నాలుగో అన్ క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. ఇంతకుముందు పాల్ వాల్తాటి(120*పరుగులు, పంజాబ్ కింగ్స్, 2011లో సీఎస్కేపై), మనీష్ పాండే(114*పరుగులు, ఆర్సీబీ, 2009లో డెక్కన్ చార్జర్స్‌పై), దేవదత్ పడిక్కల్(101*పరుగులు, ఆర్సీబీ, 2021లో రాజస్తాన్ రాయల్స్‌పై) ఈ ఫీట్ అందుకున్నారు.
అన్ క్యాప్డ్ ప్లేయర్గాఅత్యధిక స్కోరు సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు మనీష్ పాండే 94 పరుగులు( కేకేఆర్, 2014లో పంజాబ్ కింగ్స్‌పై ), మన్విందర్ బిస్లా 89 పరుగులు(కేకేఆర్, 2012లో సీఎస్కేపై) ఉన్నారు. అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ప్లేఆఫ్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రజత్ పాటిదార్ నిలిచాడు.
ఓవరాల్‌గా ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లో సెంచరీ అందుకున్న ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు సెహ్వాగ్, షేన్ వాట్సన్, వృద్దిమాన సాహా, మురళీ విజయ్‌లు ఈ ఫీట్ సాధించారు. ఇక, ఆర్సీబీ తరపున నాకౌట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా రజత్ పాటిదార్ నిలిచాడు.
ఇక, కీలక మ్యాచ్‌లో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆర్సీబీ కేజీఎఫ్ (కోహ్లీ(25), గ్లేన్ మ్యాక్స్‌వెల్(9), ఫాఫ్ డుప్లెసిస్(0)) విఫలమైన వేళ.. పాటిదార్ జట్టుకు ఊపిరయ్యాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ సెంచరీ హీరోను మెగా వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయలేదు.
రూ.20 లక్షల కనీస ధరకు అందుబాటులో ఉన్న అతన్ని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. గత సీజన్లో ఆర్సీబీకే ఆడిన పాటీదార్.. పెద్దగా రాణించలేదు. దాంతో అతన్ని వదిలేసిన ఆర్సీబీ.. మళ్లీ కొనుగోలు చేయలేదు. కనీసం ఎక్స్ట్రా ప్లేయర్‌గా జట్టులో ఉంచుకునేందుకు కూడా ఆసక్తి చూపలేదు.
అయితే జట్టులోని యువ ప్లేయర్ లువ్నీత్ సిసోడియా గాయపడటంతో అతని ప్లేస్‌లో రీప్లేస్‌మెంట్‌గా తీసుకుంది. అయితే ఆరంభ మ్యాచ్‌ల్లో అనూజ్ రావత్‌కు అవకాశం ఇచ్చిన ఆర్సీబీ.. అతను విఫలమవడంతో కోహ్లీని ఓపెనర్‌గా ప్రమోట్ చేసి.. రజత్ ను ఫస్ట్ డౌన్లో ఆడించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నరజత్ నిలకడగా పరుగులు చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన పటీదార్.. 275 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ ఉంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.