IPL 2022 ROYAL CHALLENGERS BANGALORE WILL FACE BIG CHALLENGES IN ELIMNATOR MATCH AGAINST LUCKNOW SUPER GIANTS SRD
IPL 2022 - RCB : ముంబై మద్దతుతో ప్లే ఆఫ్స్ కి వెళ్లినా.. ముందుంది ముసళ్ల పండుగ..
Royal Challengers Bangalore
IPL 2022 - RCB : ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లి, ఆర్సీబీ ఫైనల్ ఫోర్‌కు చేరేలా చేసింది ముంబై ఇండియన్స్ (Mumbai Indians). శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (ముంబై ఇండియన్స్) ఢిల్లీ క్యాపిటల్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో.. RCB ప్లే ఆఫ్‌లోకి ప్రవేశించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ కు చేరుకునే నాలుగు జట్లు ఏవో తేలిపోయాయి. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints) జట్లు ఒకరిపై ఆధారపడకుండా నేరుగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటే.. నాలుగో స్థానంలో నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangaore) మాత్రం నాకౌట్ దశకు చేరుకోవడానికి ముంబై ఇండియన్స్ (Mumbai Indians)పై ఆధారపడాల్సి వచ్చింది. ఇక, ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లి, ఆర్సీబీ ఫైనల్ ఫోర్‌కు చేరేలా చేసింది ముంబై ఇండియన్స్ (Mumbai Indians). శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (ముంబై ఇండియన్స్) ఢిల్లీ క్యాపిటల్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో.. RCB ప్లే ఆఫ్‌లోకి ప్రవేశించింది. అయితే, ఐపీఎల్ కప్పు కల నెరవేరాలంటే మాత్రం ఆర్సీబీ కఠిన సవాళ్లను ఎదుర్కొవలసి ఉంది.
RCB గత 14 సీజన్లలో 7 సార్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ఇందులో 3 సార్లు ఫైనల్‌కు చేరుకుంది. RCB 2009, 2011 మరియు 2016లో ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ ఫైనల్స్‌లో ఒక్కటి కూడా గెలవలేదు. అప్పటి నుంచి, RCB రెండుసార్లు (2010 మరియు 2015) మూడవ స్థానం మరియు రెండుసార్లు (2020 మరియు 2021) నాల్గవ స్థానంలో నిలిచింది.
ఒకవేళ ఆర్సీబీ ఫైనల్ చేరాలంటే ముందు రెండు కఠిన సవాళ్లతో కూడిన మ్యాచులు ఆడాల్సి ఉంది. బుధవారం లక్నో సూపర్ జెయింట్‌తో RCB ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. లక్నో ఓపెనింగ్ జోడి కేఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్ లు ఈ సీజన్ లో బెస్ట్. వీరిద్దరూ సూపర్ టచ్ లో ఉన్నారు.
KKRపై పూర్తి 20 ఓవర్లు బ్యాటింగ్ చేసిన IPL రికార్డు ఈ జోడి పేరిట ఉంది. వారి బౌలింగ్ లైనప్ కూడా సూపర్ గా ఉంది. యంగ్ గన్స్ అవేష్ ఖాన్ మరియు మోహ్సిన్ ఖాన్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఈ ఇద్దరూ ఆర్సీబీ బ్యాటర్లకు కొరకరాని కొయ్యలుగా మారడం ఖాయం.
RCB లక్నో యొక్క అడ్డంకిని అధిగమిస్తే.., వారు క్వాలిఫైయర్ రెండులో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (GT vs RR) ఓడిపోయిన జట్టును ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ రెండు జట్లలో అనేక మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలతో ప్లే ఆఫ్‌కు చేరిన ఈ రెండు జట్లను ఓడించడం ఆర్సీబీకి పెద్ద సవాలే.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.