IPL 2022 ఛాంపియన్ ఎవరనదే 2 మ్యాచ్‌ల తర్వాత నిర్ణయించబడుతుంది. ఈ సంవత్సరం ఐపీఎల్ (IPL 2022) 15వ సీజన్‌లో 10 జట్లు పాల్గొన్నాయి. 72 మ్యాచ్‌ల తర్వాత, గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మూడు జట్లు మాత్రమే మిగిలి ఉన్నాయ్. ఇక, ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం (మే 25) ఆఖరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. కీలక మ్యాచ్‌లో గెలుపు వాకిట బొక్కాబోర్లా పడిన లక్నో.. 15వ సీజన్ నుంచి నిష్క్రమించింది. మరోవైపు గెలిచిన బెంగళూరు క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
ఇక, ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. రజత్ పాటీదార్ (112 నాటౌట్; 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) సూపర్ సెంచరీతో చెలరేగాడు. ఇన్నింగ్స్ చివరలో దినేశ్ కార్తీక్ (37 నాటౌట్; 23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.
లక్నో బౌలర్లు మోసిన్‌ఖాన్, కృనాల్ పాండ్యా, అవేశ్‌ఖాన్, రవి బిష్ణోయ్‌కు ఒక్కో వికెట్ దక్కింది. బెంగళూరు నిర్దేశించిన 208 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో 6 వికెట్లకు 193 స్కోరుకే పరిమితం అయింది. కేఎల్ రాహుల్ (79), దీపక్ హుడా (45) రాణించారు. జోష్ హాజిల్‌వుడ్ (3/43) మూడు కీలక వికెట్లు పడగొట్టాడు.
అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వ్యూస్ పరంగా ఓ అరుదైన రికార్డు సృష్టించింది. ఐపీఎల్ 2022లో ఎక్కువ మంది హాట్‌స్టార్‌గాలో చుసిన మ్యాచుగా నిలిచింది.
ఇది కూడా చదవండి : రాహుల్ టాప్.. జట్టు ఔట్.. వరుసగా ఐదేళ్ల నుంచి అదే సంప్రదాయం..!
ఈ మ్యాచ్ మొత్తం 8.7 మిలియన్ల క్రికెట్ ఫాన్స్ వీక్షించారు. ఇదివరకు ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచును అత్యధికంగా 8.3 మిలియన్ల మంది వీక్షించారు. ఆ రికార్డును బెంగళూరు, లక్నో మ్యాచ్ బద్దలు కొట్టింది.
ఇక, ఫైనల్ కు చేరిన గుజరాత్ జట్టు రాజస్థాన్, ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో తలపడనుంది. IPL టైటిల్ రేసులో ఇంకా రెండు జట్టు ఉన్నప్పటికీ.. కప్ గెలవడం ఆర్సీబీకి ఎంతో కీలకం. 15 ఏళ్ల చరిత్రలో ఆర్సీబీ ఇంతవరకు కప్ నెగ్గలేదు.
ఇది కూడా చదవండి : గబ్బర్ ని చితకబాదిన అభిమాని..పక్కన పోలీస్ ఉన్నా లెక్క చేయలేదు.. పాపం శిఖర్..
ఈ సారి నాలుగో స్థానంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించింది. ఇప్పుడు, పాయింట్ల పట్టికలో రెండో ర్యాంక్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ మరియు మొదటి ర్యాంక్ గుజరాత్ టైటాన్స్‌లను అధిగమించి కప్ గెలవాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai Super Kings, Cricket, Faf duplessis, Hotstar, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, Mumbai Indians, Royal Challengers Bangalore