Home /News /sports /

IPL 2022 ROYAL CHALLENGERS BANGALORE PREVIEW KEY STATS STRENGTHS WEAKNESS AND KEY PLAYERS PREDICTED PLAYING XI FOR UPCOMING SEASON SRD

IPL 2022 - Royal Challengers Bangalore : పైన పటారం లోన లొటారం.. ఈ ఏడాదైనా ఆర్సీబీ కప్పు కొట్టేనా.. తుది జట్టు అంచనా ఇదే..!

Royal Challengers Bangalore

Royal Challengers Bangalore

IPL 2022 - Royal Challengers Bangalore : పది జట్లతో జరగనున్న అప్‌కమింగ్ ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్‌లోనైనా ఆ 14 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలనుకుంటుంది. ఈ సీజన్ నేపథ్యంలో జరిగిన మెగా వేలంలో ఆర్‌సీబీ చురుకుగా కనిపించకున్నా.. ఇతర జట్ల కంటే ఓ మంచి టీమ్‌నే ఎంచుకుంది. పేపర్ మీద స్ట్రాంగ్ గా కన్పిస్తున్న.. బరిలోకి దిగితే కానీ తెలియదు ఆర్సీబీ సత్తా ఏంటో..

ఇంకా చదవండి ...
  'ఈ సాల కప్‌ నమ్దే(ఈ ఏడాది కప్ కొట్టాల్సిందే)' అంటూ.. ప్రతి సీజన్ ఐపీఎల్‌కు ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) పెట్టకునే అంచనా ఇది. కానీ పుష్కర కాలం ధాటిపోయింది.. అయినా ఆర్‌సీబీ కప్ కొట్టలే..! వరల్డ్ సూపర్ స్టార్లు ఉన్నా.. టాప్ మోస్ట్ స్కిల్డ్ ప్లేయర్లు ప్రయత్నించినా.. ప్రతి ఏడాది ఎక్కడో తేడో కొడుతూనే ఉంది. ముచ్చటగా మూడుసార్లు ఫైనల్‌కు చేరినా.. టైటిల్ ఒడిసిపట్టుకోలేని దురదృష్టం బెంగళూరుది..! గత రెండు సీజన్‌లలో ప్లే ఆఫ్స్ చేరి ఊరించినా.. ముందడగు వేయక ఊసురుమనిపించింది. పది జట్లతో జరగనున్న అప్‌కమింగ్ ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్‌లోనైనా ఆ 14 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలనుకుంటుంది. ఈ సీజన్ నేపథ్యంలో జరిగిన మెగా వేలంలో ఆర్‌సీబీ చురుకుగా కనిపించకున్నా.. ఇతర జట్ల కంటే ఓ మంచి టీమ్‌నే ఎంచుకుంది. పేపర్ మీద స్ట్రాంగ్ గా కన్పిస్తున్న.. బరిలోకి దిగితే కానీ తెలియదు ఆర్సీబీ సత్తా ఏంటో..

  ఐపీఎల్ వేలంలో హర్షల్ పటేల్, వానిందు హసరంగాలకు ఎక్కువ డబ్బులు తగలేయడం, విధ్వంసకర ఏబీడీని భర్తీ చేసే ఆటగాడిని తీసుకోకపోవడం తప్పితే మిగతా స్లాట్లను అద్భుతమైన ఆటగాళ్లతో నింపేసింది. దేశీయ స్టార్లపై ఎక్కువ నమ్మకం ఉంచింది. కాకపోతే అనుభవలేమి అభిమానులను కంగారుపెడుతుందే తప్పా జట్టు అన్ని విధాలుగానే బాగానే ఉంది. గత 13 సీజన్లుగా బలహీనమైన బౌలింగ్‌‌తో నెట్టుకొచ్చిన ఆర్‌సీబీ.. ఈ సారి మాత్రం ఆ విభాగాన్ని పటిష్టంగా మార్చింది. కానీ బ్యాటింగ్‌పై మరింత ఫోకస్ పెట్టలేకపోయింది. దాంతో మరోసారి మిడిలార్డర్, టాపార్డర్ బలహీనంగా కనిపిస్తోంది.

  మొత్తం 22 మంది స‌భ్యులు గ‌ల రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టులో తుది జ‌ట్టును ఎంపిక చేయ‌డ‌మంటే క‌త్తి మీద సామే అని చెప్పుకోవాలి. ఇక ఓపెన‌ర్లుగా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, అనుజ్‌ రావత్ దిగ‌డం ఖాయ‌మైంది. ఐపీఎల్‌లో ఓపెన‌ర్‌గా డుప్లెసిస్‌కు కావాల్సిన అనుభవం ఉంది. గ‌తేడాది ఓపెన‌ర్‌గానే ఆడిన డుప్లిసెస్ చెన్నైసూప‌ర్ కింగ్స్ టైటిల్ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఇక జ‌ట్టు అవ‌స‌రాల‌కు త‌గ్గట్టుగా డుప్లిసెస్ మిడిలార్డ‌ర్‌లో కూడా బ్యాటింగ్ చేయ‌గ‌ల‌డు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో స‌త్తా చాటిన అనుజ్‌ రావత్ ఐపీఎల్‌లో ఎలా ఆడ‌తాడ‌నేది చూడాల్సి ఉంది. గ‌తంలో ఐపీఎల్‌లో 2 మ్యాచ్‌లు ఆడిన‌ప్ప‌టికీ బ్యాటింగ్ చేసే అవ‌కాశం రాలేదు.

  ఇది కూడా చదవండి : ఐపీఎల్ లో డకౌట్ వీరులు వీళ్లే.. లిస్ట్ లో టాప్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

  ఇక వన్ డౌన్ లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రావడం ఖాయం. గ్లెయిన్ మాక్స్‌వెల్ నాల్గో స్థానంలో ఆడ‌నున్నాడు. ఐదో స్థానంలో మహిపాల్‌ లామ్రోర్ రానున్నారు. వికెట్ కీపింగ్ బాధ్య‌త‌ల‌ను దినేశ్ కార్తీక్ చేప‌ట్ట‌నుండ‌గా.. అత‌డు ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయ‌నున్నాడు. ఆల్‌రౌండ‌ర్‌ షాబాజ్‌ అహ్మద్ ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయ‌నున్నాడు.

  ఇది కూడా చదవండి : చెల్లా చెదురైన ముంబై.. బలహీనంగా రోహిత్ సేన.. బౌల్ట్, హార్దిక్ స్ధానాలు భర్తీ చేసేది ఎవరు..?

  బౌల‌ర్లుగా శ్రీ‌లంక స్పిన్న‌ర్ హ‌స‌రంగ‌తోపాటు హ‌ర్ష‌ల్ ప‌టేల్, మ‌హ్మ‌ద్ సిరాజ్ బ‌రిలోకి దిగ‌నున్నారు. అలాగే జోష్‌ హేజిల్ వుడ్, విల్లీ, బెహ్రెన్‌డార్ఫ్లో ఒక‌రు బ‌రిలోకి దిగ‌నున్నారు. అయితే అంతా బాగున్న ఆర్సీబీ మిడిలార్డ‌ర్ కాస్త బ‌ల‌హీనంగా క‌నిపిస్తోంది. అయితే, ధనాధన్ క్రికెట్ లో ఏం జరుగుతుందో ఊహించలేం. ఆర్సీబీ సరిగ్గా సత్తా చాటితే.. ఈ సారి ప్లే ఆఫ్స్ బరిలో చూడొచ్చు. అన్ని కుదిరితే కప్పు కూడా ఖాతాలో వేసుకోవచ్చు.

  పూర్తి జట్టు..

  ఫాఫ్ డుప్లెసిస్(రూ.7కోట్లు), అనూజ్ రావత్(రూ.3.4 కోట్లు), విరాట్ కోహ్లీ(రూ.15 కోట్లు), గ్లేన్ మ్యాక్స్‌వెల్(రూ.11 కోట్లు), దినేశ్ కార్తీక్(కీపర్)(రూ.5.5 కోట్లు), మహిపాల్ లోమ్‌రోర్(రూ.95 లక్షలు), వానిందు హసరంగా(రూ.10.75 కోట్లు), శబాజ్ అహ్మద్(రూ.2.4 కోట్లు), హర్షల్ పటేల్(రూ.10.75 కోట్లు), జోష్ హజెల్ వుడ్(రూ.7.75 కోట్లు), మహమ్మద్ సిరాజ్(రూ.7 కోట్లు), ఆకాశ్ దీప్(రూ.20 లక్షలు), సిద్దార్థ్ కౌల్(రూ.75 లక్షలు), కర్ణ్ శర్మ(రూ.50 లక్షలు), ఫిన్ అలెన్(రూ. కోటి), జాసన్ బెహ్రెన్‌డార్ఫ్(రూ.75 లక్షలు), డేవిడ్ విల్లే(రూ.2 కోట్లు), ప్రభుదేశాయ్(రూ.30 లక్షలు), లువిత్ సిసోడియా(రూ.20 లక్షలు), చామ మిలింద్(రూ.25 లక్షలు), అనీశ్వర్ గౌతమ్(రూ.20 లక్షలు).

  తుది జట్టు అంచనా :
  ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్‌), అనుజ్‌ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెయిన్‌ మాక్స్‌వెల్ , మహిపాల్‌ లోమ్రర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీప‌ర్‌), షాబాజ్‌ అహ్మద్, వానిందు హసరంగ, హర్షల్ ప‌టేల్, జోష్ హేజిల్‌వుడ్ / జాస‌న్, మ‌హ్మ‌ద్ సిరాజ్‌.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Dinesh Karthik, Glenn Maxwell, IPL 2022, Royal Challengers Bangalore, Virat kohli

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు