Home /News /sports /

IPL 2022 ROHIT SHARMA SIXER HITS TATA PUNCH CAR AND KAZIRANGA NATIONAL PARK GOT FIVE LAKHS SRD

Rohit Sharma Sixer : రోహిత్ శర్మ కొట్టిన సిక్సర్ ఎంత మంచి పనిచేసింది.. ఖడ్గమృగాలకు రూ.5 లక్షల విరాళం..

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma Sixer : సీజన్ ముగింపుకు వచ్చినా ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఒక్క అర్ధ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. కానీ, రోహిత్ శర్మ కొట్టిన ఓ సిక్సర్ మాత్రం ఓ మంచిపనికి కారణమైంది.

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) తన స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించలేకపోతున్నాడు. ఈ సీజన్ లో పేలవ ప్రదర్శనతో తన అభిమానులను నిరాశకు గురిచేశాడు. సీజన్ ముగింపుకు వచ్చినా ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఒక్క అర్ధ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. అయితే శుక్రవారం గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) తో జరిగిన మ్యాచ్ లో మాత్రం ఫర్వాలేదనపించాడు. తన దూకుడు ఆటతో ఫస్ట్ వికెట్ కు ఇషాన్ కిషన్ తో కలిసి ముంబైకి మంచి భాగస్వామ్యాన్ని అందించాడు. రోహిత్ 28 బంతుల్లో 153.57 స్ట్రైక్ రేట్‌తో 43 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. రోహిత్, ఇషాన్ కిషన్ ద్వయం ముంబైకి 74 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం అందించింది.

    అయితే.. రోహిత్ ఇన్నింగ్స్ లో కొట్టిన రెండు సిక్సర్లు హైలెట్ అని చెప్పాలి. అల్జారీ జోసెఫ్ వేసిన బంతిని అలవోకగా బౌండరీ దాటించాడు రోహిత్. అయితే.. రోహిత్ కొట్టిన ఈ సిక్సర్ మైదానంలోని టాటా పంచ్ కారుకు తగిలింది. దీంతో.. ఆ సిక్సర్ కు రూ. 5 లక్షలు వచ్చాయ్. అయితే, ఆ మొత్తం రోహిత్ శర్మకు రాలేదు. కారుకు తగిలితే రూ.5 లక్షలు రావమేంటి అనుకుంటున్నారా.

    వివరాల్లోకెళితే..టాటా మోటార్స్ IPL యొక్క అధికారిక స్పాన్సర్. దీంతో.. మైదానంలో ఉంచిన టాటా పంచ్ కారుకు సిక్సర్ కొడితే.. అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్ కి రూ.5 లక్షలు విరాళంగా ఇస్తానని ప్రకటించింది. కజిరంగా నేషనల్ పార్క్ ఖడ్గమృగాలకు అభయారణ్యం. ఖడ్గమృగాల పరిరక్షణకు రూ.5 లక్షలు వెచ్చించనుంది టాటా మోటార్స్. మొత్తానికి రోహిత్ కొట్టిన ఓ సిక్సర్ ఓ మంచి పనికి కారణమైంది.

    రోహిత్ కొట్టిన సిక్సర్ టాటా పంచ్ కారుకి తగిలింది.


    ఇక, ఈ మ్యాచజులో రోహిత్ శర్మ పలు రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అల్జారీ జోసెఫ్ వేసిన ఓవర్లో భారీ సిక్సర్ బాదిన రోహిత్ శర్మ.. ముంబై ఇండియన్స్ తరఫున 200వ సిక్సర్ కొట్టిన రెండో ప్లేయర్ గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఈ రికార్డును ఇది వరకే కీరన్ పొలార్డ్ సాధించాడు. అతడు ముంబై తరఫున 257 సిక్సర్లు బాదాడు.

    ఇది కూడా చదవండి : వారెవ్వా బట్లర్ నీలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా..! చహల్ తో కలిసి..

    ఐపీఎల్ లో ఒకే జట్టు తరఫున 200వ సిక్సర్ కొట్టిన ఐదో ప్లేయర్ గా రోహిత్ నిలిచాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో క్రిస్ గేల్ (263 సిక్సర్లు), కీరన్ పొలార్డ్ (257 సిక్సర్లు), ఏబీ డివిలియర్స్ (240 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (228 సిక్సర్లు), రోహిత్ శర్మ (200 సిక్సర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. క్రిస్ గేల్, డివిలియర్స్, కోహ్లీ లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఈ ఘనత సాధించడం విశేషం. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు సురేశ్ రైనా (220 సిక్సర్లు), ఎంఎస్ ధోనీ (218 సిక్సర్లు) ఉన్నా.. వీరు రెండు ఫ్రాంచైజీల తరఫున ఆడుతూ ఈ ఘనత సాధించారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: IPL 2022, Mumbai Indians, Rohit sharma, Tata Motors

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు