హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 : పరాగ్ ను రెచ్చ గొట్టిన హర్షల్ పటేల్.. ఇన్నింగ్స్ పూర్తయ్యాక ఇద్దరి మధ్య బిగ్ ఫైట్.. వీడియో వైరల్

IPL 2022 : పరాగ్ ను రెచ్చ గొట్టిన హర్షల్ పటేల్.. ఇన్నింగ్స్ పూర్తయ్యాక ఇద్దరి మధ్య బిగ్ ఫైట్.. వీడియో వైరల్

పరాగ్ వర్సెస్ హర్షల్ (PC: TWITTER)

పరాగ్ వర్సెస్ హర్షల్ (PC: TWITTER)

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భాగంగా మంగళవారం రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Bangalore) జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ముంబై లోని వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టు 29 పరుగుల తేడాతో బెంగళూరు జట్టుపై గెలుపొంది లీగ్ టేబుల్లో టాప్ ప్లేస్ కు చేరుకుంది.

ఇంకా చదవండి ...

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భాగంగా మంగళవారం రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Bangalore) జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ముంబై లోని వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టు 29 పరుగుల తేడాతో బెంగళూరు జట్టుపై గెలుపొంది లీగ్ టేబుల్లో టాప్ ప్లేస్ కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్ లో ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరిగిన బిగ్ ఫైట్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైదానంలో ఈ ఇద్దరు ఆటగాళ్లు సై అంటే సై అన్నట్లు గొడవ పడ్డారు. ఒకానొక సమయంలో ఇద్దరు కూడా కొట్టుకునేంత పని చేశారు.

ఇది కూడా చదవండి : ట్రిపుల్ సెంచరీ ప్లేయర్ ని తప్పించింది.. డ్యాన్సర్ ను మాత్రం జట్టుతోనే.. రాజస్తాన్ టీం మనకు అర్థం కాదయ్యా..

పూర్ ఫామ్ తో గత కొన్ని మ్యాచ్ ల్లో సతమతమవుతూ అందరి చేత విమర్శలు ఎదుర్కొన్న రియాన్ పరగా.. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో అద్భుత ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. కష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన అతడు 31 బంతుల్లో 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో మూడు ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం. అయితే రాజస్తాన్ రాయల్స్ ఆఖరి ఓవర్ ను హర్షల్ పటేల్ వేయడానికి రాగా ఆ ఓవర్ లో పరాగ్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ ఆఖరి బంతిని సిక్సర్ తో ముగించాడు. 20 ఏళ్ల కుర్రాడు తన బౌలింగ్ లో అలా ఆడటాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేని హర్షల్ పటేల్.. కామ్ గా వెళ్లిపోతున్న రియాన్ పై దుర్బాషలాడాడు. ఇక రియాన్ ఊరికే ఉంటాడా.. ఏంటంటూ హర్షల్ వైపు దూసుకెళ్లాడు. రియాన్ కూడా మాటకు మాట బదులివ్వడంతో ఇగో హర్ట్ అయిన హర్షల్ అతడి వైపు దూసుకెళ్లాడు. కొట్టుకోవడమే తరువాయి అన్న తరుణంలో రాజస్తాన్ ప్లేయర్స్ దూసుకొచ్చి గొడవను ఆపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతోంది

ఇక మ్యాచ్ విషయానికి వస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఏ విధంగా అయితే చెత్త బ్యాటింగ్ చేసిందో అదే విధంగా మంగళవారం రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ బెంగళూరు ఆటతీరు కనబరిచింది. 145 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు 19.3 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా రాజస్తాన్ రాయల్స్ 29 పరుగులతో బెంగళూరుపై ఘనవిజయం సాధించింది. బెంగళూరు టీంలో ఫాఫ్ డు ప్లెసిస్ (21 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ గా నిలువడం గమనార్హం. కుల్దీప్ సేన్ నాలుగు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీశాడు. ప్రసిధ్ కు 2 వికెట్లు దక్కాయి. ఈ సీజన్ లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి లీగ్ మ్యాచ్ లో బెంగళూరు జట్టు గెలువగా.. రెండో మ్యాచ్ లో రాజస్తాన్ విజయం సాధించింది. దాంతో లెక్క సరైంది. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో రాజస్తాన్ రాయల్స్ 8 మ్యాచ్ ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Faf duplessis, Glenn Maxwell, IPL, IPL 2022, Mohammed Siraj, Rajasthan Royals, Ravichandran Ashwin, Royal Challengers Bangalore, Sanju Samson, Virat kohli

ఉత్తమ కథలు