Home /News /sports /

Rashid Khan: రషీద్ ఖాన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వదిలేయడానికి డబ్బే కారణమా? అసలు విషయం చెప్పిన రషీద్ మేనేజర్..

Rashid Khan: రషీద్ ఖాన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వదిలేయడానికి డబ్బే కారణమా? అసలు విషయం చెప్పిన రషీద్ మేనేజర్..

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును రషీద్ ఖాన్ వదిలేయడానికి అసలు కారణం ఇదేనా? (PC: IPL)

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును రషీద్ ఖాన్ వదిలేయడానికి అసలు కారణం ఇదేనా? (PC: IPL)

Rashid Khan: ఐపీఎల్ 2022 రిటెన్షన్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ కీలక ఆటగాడు రషీద్ ఖాన్‌ను విడుదల చేసింది. యాజమాన్యానికి, రషీద్‌కు మధ్య రెమ్యునరేషన్‌లో వచ్చిన విభేదాల వల్లే అతడు జట్టును వదిలేసినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై రషీద్ ఖాన్ ఏజెంట్ స్పందించాడు.

ఇంకా చదవండి ...
    ఐపీఎల్ 2022 (IPL 2022) మెగా ఆక్షన్‌కు (Mega Auction) ముందు బీసీసీఐ (BCCI) ఇచ్చిన ప్లేయర్ రిటెన్షన్ (Player Retention) ఆప్షన్‌ను పాత 8 జట్లు వినియోగించుకున్నాయి. కొన్ని ఫ్రాంచైజీలు గరిష్టంగా నలుగురిని అట్టిపెట్టుకోగా.. పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మాత్రం ఇద్దరితో సరిపెట్టింది. మంగళవారం రాత్రి ఏ జట్టులో ఎవరు కొనసాగుతున్నారు? మెగా వేలం పాటలోకి ఎవరు వస్తున్నారనే విషయం స్పష్టంగా తెలిసి పోయింది. అయితే ఈ రిటెన్షన్స్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఒకటే. సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఎందుకు రషీద్ ఖాన్‌ను (Rashid Khan) రిటైన్ చేసుకోలేదు? కేవలం ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా క్రికెట్ లవర్స్ అందరినీ ఆ ప్రశ్న తొలి చేసింది. అయితే రిటైన్ ప్లేయర్ల వివరాలను వెల్లడించే సమయంలో సన్‌రైజర్స్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ దీనిపై కామెంట్ చేశారు. రషీద్‌తో రెమ్యునరేషన్ విషయంలోనే చర్చలు సఫలం కాలేదని.. అతడు మరింత భారీ ధర కోరుకుంటున్నాడని.. అతడిని వేలంలో తిరిగి కొనడానికి ప్రయత్నిస్తామని చెప్పాడు. అంటే రషీద్ డబ్బు కోసమే జట్టును వదిలేశాడా అని ఫ్యాన్స్ బాధపడుతున్నారు.

    అఫ్గానిస్తాన్ స్పిన్నర్ కెరీర్ గత ఐదేళ్లలో టాప్ పొజిషన్‌కు చేరుకున్నది. ఆఫ్గానిస్తాన్ వంటి చిన్న జట్టులోని ప్లేయర్‌ను తీసుకొని సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచింగ్ స్టాఫ్ బాగా గ్రూమ్ చేసింది. ఇండియాలో అతడికి లభించిన శిక్షణ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఉపయోగపడింది. అంతే కాకుండా గత 5 ఏళ్లలో జీతం రూపంలో రూ. 40 కోట్ల దాకా తీసుకున్నాడు. ప్రస్తుతం రూ. 8.9 కోట్ల వేతనం అతడికి సన్‌రైజర్స్ చెల్లిస్తున్నది. ఈ సారి జీతాన్న రూ. 12 కోట్లకు పెంచుతామని యాజమాన్యం స్పష్టం చేసింది. కానీ జట్టులో అతడిని తొలి ప్లేయర్‌గా రిటైన్ చేసుకోవాలని రషీద్ పట్టుబట్టినట్లు తెలుస్తున్నది. అలా చేస్తే రషీద్‌కు రూ. 14 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. అదే సమయంలో కెప్టెన్ కేన్‌విలియమ్‌సన్‌కు రూ. 10 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనకు యాజమాన్యం అంగీకరించలేదని.. అందుకే మరింత వేతనం కోసం జట్టును వదిలేశాని తెలుస్తున్నది. రషీద్ ఖాన్ వెళ్లిపోవడంతో ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లను రూ. 8 కోట్లకు అట్టిపెట్టుకున్నది.

    83 Movie: మీకు తెలుసా? 83 సినిమాలో నటించిన క్రికెటర్ల కొడుకులు.. ఆనాడు వరల్డ్ కప్ టీమ్‌లో ఉన్న క్రికెటర్ల వారసులే నటులు


    అయితే ఈ విషయంపై రషీద్ ఖాన్ మేనేజర్ స్పందించాడు. 'అతడికి రూ. 12 కోట్లు ఇస్తామన్నారు. వేలానికి పోతే మరో మూడు నాలుగు కోట్లు ఎక్కువ వస్తాయేమో. కానీ రషీద్‌కు ఆ మొత్తంపై పెద్దగా ఆసక్తి లేదు. 5 ఏళ్ల పాటు ఉన్న జట్టును వదులుకోవాలని ఎవరూ అనుకోరు. రషీద్ చాలా భావోద్వేగాలు ఉన్న మనిషి. అతడు మంచి బ్యాగ్రౌండ్ నుంచి వచ్చాడు. తన జట్టు కోసం ఏమైనా చేయాలని అనుకుంటాడు. అయితే ఈ సారి డబ్బు కోసం కాకుండా.. కొత్త ప్రారంభాన్ని కోరుకున్నాడు. ఏదైనా కొత్త జట్టులోకి వెళ్లి మళ్లీ ఫ్రెష్‌గా తన కెరీర్‌ను స్టార్ట్ చేయాలని భావించాడు. అందుకే జట్టును వదిలేశాడు' అని ఆ మేనేజర్ సన్నిహితులు చెప్పారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:John Kora
    First published:

    Tags: IPL 2022, Rashid Khan, Sunrisers Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు