IPL 2022 RED TURNS BLUE FOR TODAY ROYAL CHALLENGERS BANGALORE SUPPORTS MUMBAI INDIANS AND FUNNY MEMES GOES VIRAL SRD
IPL 2022 Red Turns Blue: ఇదెక్కడి అరాచకం రా మామ.. మెల్లగా ముంబైలా మారిపోతున్న ఆర్సీబీ.. ఎన్ని కష్టాలో..!
Photo Credit : IPL Twitter
IPL 2022 : ఆర్సీబీ జట్టు ముంబై చేతుల్లో ఉంది. ఇంకేముంది.. ఆర్సీబీ మెల్లగా ముంబైలా మారిపోతుంది. ప్లే ఆఫ్ రేసులో నిలబడటానికి పాపం ఆర్సీబీ ఎన్ని కష్టాలు పడుతుందో..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) ఆఖరి దశకు చేరుకుంది. లీగ్ స్టేజ్ లో ఇంకో రెండు మ్యాచ్ లే మిగిలి ఉండగా.. ఆదివారం పంజాబ్ కింగ్స్ (Punjab Kings), సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)తో జరిగే మ్యాచ్ తో లీగ్ దశ ఎండ్ కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకోగా.. ఒక ప్లేస్ కోసం మాజీ ఫైనలిస్టులో రేసులో ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ ఏడాది అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints) జట్లు అదరగొట్టాయి. వీటితో పాటు తొలి ఐపీఎల్ ఎడిషన్ (2008) విన్నర్ రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) కూడా లీగ్ స్టేజ్ లో సత్తా చాటి ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి.
అయితే చివరి స్థానం కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Bangalore), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్లు పోటీ పడుతున్నాయి. గురువారం జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ పై నెగ్గిన ఆర్సీబీ 16 పాయింట్లతో ప్రస్తుతానికి నాలుగో స్తానంలో కూర్చొని ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 14 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
— Royal Challengers Bangalore (@RCBTweets) May 21, 2022
అయితే ఢిల్లీ జట్టుకు మరో మ్యాచ్ మిగిలి ఉండగా.. ఆర్సీబీ తన లీగ్ మ్యాచ్ లను పూర్తి చేసింది. దాంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరేది లేనిది నేటితో తేలనుంది. నేడు ఢిల్లీ జట్టు ముంబై ఇండియన్స్ తో డూ ఆర్ డై మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచినా ఓడినా ముంబైకి ప్రత్యేకంగా పోయేదేమీ లేదు. కానీ ముంబై గెలవాలనే బెంగళూరు అభిమానులు ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నారు. ఇక, ఆర్సీబీ ఫ్యాన్స్ తో పాటు ఆ జట్టు ఫ్రాంచైజీ మరియు ఆటగాళ్లు కూడా ముంబై గెలవాలని కోరుకుంటున్నారు.
— Mumbai Indians TN FC 👑 (@MipaltanTN) May 21, 2022
ఈ నేపథ్యంలో తన అఫీషియల్ లోగోను ముంబై కలర్ బ్లూలోకి మార్చేసింది. నిజానికి ఆర్సీబీ లోగో కలర్ ఎరుపు రంగులో ఉంటుంది. కానీ.. ముంబై గెలవడంతోనే తమ ప్లే ఆఫ్ ఆశలు ముడిపడి ఉండటంతో.. రోహిత్ సేనకు సపోర్ట్ చేస్తోంది ఆర్సీబీ ఫ్రాంచైజీ. అటు ఆర్సీబీ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కాదు రాయల్ ఛాలెంజర్స్ బాంబే అని మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ జోక్ చేశాడు.
నెట్టింట బాగా వైరలవుతున్న ట్వీట్లలో పైన కనిపిస్తున్న ట్వీట్ ఒకటి. ఆర్సీబీ కీ ప్లేయర్లు గా ఉన్న విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ లకు ముంబై ఇండియన్స్ జెర్సీ వేసి ఆ జట్టుకు సపోర్ట్ చేస్తున్నట్టుగా మీమ్ క్రియేట్ చేశారు. దీంతో పాటు దినేశ్ కార్తీక్ కూడా తన ట్విట్టర్ ఖాతా వేదికగా.. ముంబై ఇండియన్స్ తరఫున తాను ఆడినప్పుడు వేసుకున్న జెర్సీని ధరించి.. ‘ఇది నా పాత జ్ఞాపకాలలో దొరికింది..’ అని ఫన్నీగా రాసుకొచ్చాడు. దీంతో.. ఆర్సీబీకి ఎన్ని కష్టాలో వచ్చాయో అని నెటిజన్లు బాధపడుతున్నారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.