హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - RCB vs SRH : విరాట్ కోహ్లీ వర్సెస్ ఉమ్రాన్ మాలిక్.. టాస్ గెలిచిన SRH..

IPL 2022 - RCB vs SRH : విరాట్ కోహ్లీ వర్సెస్ ఉమ్రాన్ మాలిక్.. టాస్ గెలిచిన SRH..

IPL 2022 - KKR vs GT

IPL 2022 - KKR vs GT

IPL 2022 - KKR vs GT : ఈ సీజన్ లో గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తన ఫామ్ కంటిన్యూ చేశాడు. మరో హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, మరే బ్యాటర్ మెరవకపోవడంతో సాధారణ స్కోరుకే పరిమితమైంది గుజరాత్.

  ఐపీఎల్ 2022 సీజన్ సూపర్ శాటర్ డే లో భాగంగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. దక్షిణాది జట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయ్. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది సన్ రైజర్స్. ఇక, ఆరెంజ్ ఆర్మీ ఎటువంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది. ఇక, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా సేమ్ టీమ్ తోనే బరిలోకి దిగుతోంది.ఈ ఐపీఎల్లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన సన్ రైజర్స్ తరువాత వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి మంచి ఊపు మీద ఉంది ఆరెంజ్ ఆర్మీ. అదే దూకుడును ఈ మ్యాచులో కూడా కంటిన్యూ చేయాలని భావిస్తోంది. అభిషేక్ శర్మ ఓ మోస్తరుగా రాణిస్తుంటే.. కేన్ విలియమన్స్ బ్యాట్ నుంచి ఓ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. అయితే, రాహుల్ త్రిపాఠి, మార్కరమ్, నికోలస్ పూరన్ మంచి టచ్ లో ఉన్నారు. గత మూడు మ్యాచుల్లో అద్భుతంగా రాణించారు.

  ఈ ముగ్గురు అదే ఫామ్ కంటిన్యూ చేస్తే సన్ రైజర్స్ కు తిరుగుండదు. శశాంక్ సింగ్, సుచిత్, మార్కో జాన్సెస్ ఆల్ రౌండర్ల బాధ్యతల్ని మోయనున్నారు. ఇక, సన్ రైజర్స్ బౌలింగ్ భీకరంగా ఉంది. భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, మార్కొ జాన్సెన్ వంటి టాప్ క్లాస్ బౌలర్లు ఆరెంజ్ ఆర్మీ సొంతం. సన్ రైజర్స్ పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడమే కాకుండా ప్రత్యర్థి జట్టు బ్యాటర్ల జోరుకు బ్రేకులు వేస్తున్నారు.

  మరోవైపు ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతుంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో రెండింట్లో ఓడి ఐదింట్లో గెలుపొందింది. పాయింట్ల పట్టికలో 10పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్‌ లాంటి స్టార్ బ్యాటర్లతో ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. అయితే, విరాట్ కోహ్లీ ఫామ్ లోకి లేకపోవడం ఆర్సీబీ మైనస్ పాయింట్. ఆడిన 7 మ్యాచుల్లో కోహ్లీ కేవలం 119 పరుగులు మాత్రమే చేశాడు.

  ఓపెనర్ అనూజ్ రావత్ కూడా సత్తా చాటాల్సిన అవసరం ఉంది. షాబాజ్ నదీమ్ కూడా రాణిస్తున్నాడు. కోహ్లీ మినహా గొప్ప ఫామ్‌లో ఉన్న ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేస్తే హైదరాబాద్ కు తిరుగుండదు.ఇక, జోష్ హేజిల్‌వుడ్.. ఆర్సీబీకి బౌలింగ్లో ప్రధాన అస్త్రం కానున్నాడు. ఇక డెత్ స్పెషలిస్టు హర్షల్ పటేల్, స్పిన్నర్ వనిందు హసరంగా, లైన్ అండ్ లెంత్ బౌలర్ సిరాజ్ లాంటి బౌలర్లను ఎదుర్కోవడం సన్ రైజర్ బ్యాటర్లకు అగ్ని పరీక్షే అని చెప్పాలి.

  తుది జట్లు :

  సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, జె సుచిత్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, టి.నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, సుయాష్ ప్రభుదేసాయి, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్, వనిందు హసరంగా, జోష్ హేజిల్‌వుడ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Dinesh Karthik, Faf duplessis, Glenn Maxwell, Kane Williamson, Mohammed Siraj, Royal Challengers Bangalore, Sunrisers Hyderabad, Virat kohli

  ఉత్తమ కథలు