హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - RCB vs SRH : తొక్కుకుంటూ పోతున్న SRH.. టార్గెట్ కేవలం 8 ఓవర్లలో ఫసక్..

IPL 2022 - RCB vs SRH : తొక్కుకుంటూ పోతున్న SRH.. టార్గెట్ కేవలం 8 ఓవర్లలో ఫసక్..

Sunrisers Hyderabad

Sunrisers Hyderabad

IPL 2022 - RCB vs SRH : బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో ఆర్సీబీపై సన్ రైజర్స్ హైదరాబాద్ అలవోకగా విజయాన్ని సొంతం చేసుకుంది. ఆర్సీబీపై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడింది హైదరాబాద్.

  మాటల్లేవ్.. మాట్లాడుకోవడాలు లేవ్.. వచ్చిన జట్టు వచ్చినట్టు తోక్కుకుంటాపోవడమే. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఇదే పనిచేస్తోంది. ఏ జట్టు అయినా సరే సన్ రైజర్స్ దెబ్బకి అల్లాడిపోవాల్సిందే. తాజాగా ఈ లిస్ట్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేరిపోయింది. ఆర్సీబీ విధించిన 69 పరుగుల లోయెస్ట్ టార్గెట్ ను సన్ రైజర్స్ ఓపెనర్లు ఆడుతూ పాడుతూ ఛేజ్ చేశారు. అభిషేక్, కేన్ విలియమ్సన్ దెబ్బకి ఆ టార్గెట్ 8 ఓవర్లలోనే ఫినిష్ చేసింది సన్ రైజర్స్. ఇంకా 12 ఓవర్లు మిగిలుండటం విశేషం. దీంతో, 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.అభిషేక్ శర్మ ( 28 బంతుల్లో 47 పరుగులు ; 8 ఫోర్లు, 1 సిక్సర్) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. , కేన్ విలియమ్సన్ (17 బంతుల్లో 16 పరుగులు; 2 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (3 బంతుల్లో 7 పరుగులు, 1 సిక్సర్) అజేయంగా నిలిచారు.

  69 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ ఆర్సీబీ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ముఖ్యంగా యంగ్ గన్ అభిషేక్ శర్మ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. క్లాస్, మాస్ బ్యాటింగ్ తో దుమ్మురేపాడు. అతనికి మరో ఎండ్ లో కేన్ మామ సహకరించాడు. ఈ క్రమంలో వీరిద్దరూ ఫస్ట్ వికెట్ 50 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఆ తర్వాత 47 పరుగులు చేసిన అభిషేక్.. హర్షల్ పటేల్ బౌలింగ్ లో రావత్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో.. 64 పరుగులకు ఫస్ట్ వికెట్ కోల్పోయింది.

  ఇక, అంతకుముందు.. ఆర్సీబీ బ్యాటర్లకు చుక్కలు చూపారు ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు. సన్ రైజర్స్ దెబ్బకి స్టార్ ఆటగాళ్లు సైతం గల్లీ ఆటగాళ్లు అయిపోయారు. నిజం చెప్పాలంటే ఆ జట్టు మేటి ఆటగాళ్లను చుచ్చు పోయించారు. ఆరెంజ్ ఆర్మీ దెబ్బకి కేవలం 16.1 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌట్ అయింది. కనీసం 100 పరుగులు కూడా చేయలేదు. సుయాష్ ప్రభుదేశాయ్ (20 బంతుల్లో 15 పరుగులు) అత్యధిక స్కోరు. దీన్ని బట్టే అర్ధమవుతోంది వాళ్లు ఎంతగా చెత్తాట ఆడారో. మార్కొ జాన్సెన్, నట్టూ చెరో మూడు వికెట్లతో ఆర్సీబీ పతనాన్ని శాసించారు.

  భువీ, సుచిత్, ఉమ్రాన్ మాలిక్ వాళ్లకు సహకరించారు.టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి సన్ రైజర్స్ బౌలర్లు చుక్కలు చూపారు. నిజం చెప్పాలంటే దడదడలాడించారు. ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు దెబ్బకి ఆర్‌సీబీ 8 ప‌రుగులకే డుప్లెసిస్‌ (5), విరాట్ కోహ్లి (0),అనుజ్ రావత్ (0) వికెట్లు కోల్పోయింది. జాన్సెన్ వేసిన రెండో ఓవ‌ర్‌లో ఆర్‌సీబీ మూడు వికెట్లు కోల్పోయింది. ఫాఫ్ డుప్లెసిస్ క్లీన్ బౌల్డ్ అవ్వగా.. కోహ్లీ మార్కరమ్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

  అనూజ్ రావత్ కూడా మార్కరమ్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే, ఈ సీజ‌న్‌లో వ‌రుస‌గా రెండో సారి గోల్డ‌న్ డ‌క్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత 20 ప‌రుగుల వ‌ద్ద ఆర్‌సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 12 ప‌రుగులు చేసిన మాక్స్‌వెల్.. న‌ట‌రాజ‌న్ బౌలింగ్‌లో విలియ‌మ్స‌న్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరాడు. దీంతో, పీకల్లోతు కష్టాల్లో పడింది ఆర్సీబీ. అస్సలు బెంగళూరు స్కోరు చేసే ఛాన్స్ ఇవ్వలేదు సన్ రైజర్స్ బౌలర్లు. వరుస క్రమంలో వికెట్లు తీస్తూ ఆ జట్టును ఓ ఆటాడుకున్నారు. ఇక, 47 ప‌రుగుల వ‌ద్ద‌ ఆర్‌సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 15 ప‌రుగులు చేసిన‌ ప్రభుదేశాయ్.. సుచిత్ బౌలింగ్‌లో స్టంపౌట‌య్యాడు.

  ఇక, ఆ తర్వాత అదే ఓవర్ లో సూపర్ ఫామ్ లో ఉన్న దినేశ్ కార్తీక్ కూడా డకౌటయ్యాడు. సుచిత్ బౌలింగ్ లో దినేశ్ కార్తీక్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 47 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఇక, ఏడు పరుగులు చేసిన షాబాజ్ అహ్మద్ ని ఉమ్రాన్ మాలిక్ పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో, 49 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది ఆర్సీబీ. ఆ తర్వాత 55 పరుగులకు ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన హర్షల్ పటేల్ నట్టూ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత 65 పరుగులకు తొమ్మిది వికెట్ కోల్పోయింది. నట్టూ బౌలింగ్ వానిందు హసరంగ (8) పరుగులకు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక, సిరాజ్ 68 పరుగుల వద్ద భువనేశ్వర్ బౌలింగ్ లో ఔటయ్యాడు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Faf duplessis, IPL 2022, Kane Williamson, Royal Challengers Bangalore, Sunrisers Hyderabad, Virat kohli

  ఉత్తమ కథలు