హోమ్ /వార్తలు /క్రీడలు /

RCB vs RR : మళ్లీ టాస్ ఓడిన రాజస్తాన్ కెప్టెన్.. ఇరు జట్లలోనూ భారీ మార్పులు.. ఓపెనర్ గా విరాట్ కోహ్లీ

RCB vs RR : మళ్లీ టాస్ ఓడిన రాజస్తాన్ కెప్టెన్.. ఇరు జట్లలోనూ భారీ మార్పులు.. ఓపెనర్ గా విరాట్ కోహ్లీ

డు ప్లెసిస్ వర్సెస్ సామ్సన్ (PC: IPL)

డు ప్లెసిస్ వర్సెస్ సామ్సన్ (PC: IPL)

RCB vs RR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భాగంగా నేడు రాయల్స్ మధ్య పోరు జరగనుంది. పుణేలోని ఎంసీఏ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) తో జరిగే ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (Faf du plessis) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఇంకా చదవండి ...

RCB vs RR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భాగంగా నేడు రాయల్స్ మధ్య పోరు జరగనుంది. పుణేలోని ఎంసీఏ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) తో జరిగే ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (Faf du plessis) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక టాస్ విషయంలో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ సామ్సన్ (sanju samson) టాస్ ఓడిపోతూనే ఉన్నాడు. ఆర్సీబీ జట్టు ఒక మార్పు చేసింది. అనుజ్ రావత్ స్థానంలో రజత్ పటిదార్ ను తుది జట్టులోకి తీసుకుంది. ఇక రాజస్తాన్ రాయల్స్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. గత రెండు మ్యాచ్ ల్లోనూ ఆఖరి ఓవర్ వేసి జట్టుకు విజయాన్ని అందించినా మెకాయ్ ని తప్పించి అతడి స్థానంలో కుల్దీప్ సేన్ ను తీసుకుంది. అదే సమయంలో కరుణ్ నాయర్ స్థానంలో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ ను తీసుకుంది.

ఇది కూడా చదవండి : వామ్మో రస్సెల్.. ఈ విండీస్ వీరుడు కొడితే ఏదైనా సరే విరగాల్సిందే.. వీడియో వైరల్

ఓపెనర్ గా విరాట్ కోహ్లీ

గత రెండు మ్యాచ్ ల్లోనూ గోల్డెన్ డక్ గా వెనుదిరిగిన ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఈ సీజన్ లో కోహ్లీ చాలా చెత్త ప్రదర్శనను కనబరుస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీ ఓపెనర్ గా రానున్నాడు.  అనుజ్ రావత్ ను తప్పించిన ఆర్సీబీ.. అతడి స్థానంలో ఫాప్ డు ప్లెసిస్ తో కలిసి కోహ్లీ ఓపెనింగ్ చేయనున్నాడు. ఇక ఈ మ్యాచ్ లోనైనా అతడు భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 68 పరుగులకే ఆలౌటైంది. దాంతో పాటు సీజన్ లోనే ఘోర ఓటమిని ఎదుర్కొంది. అయితే ఈ మ్యాచ్ లో నెగ్గి మళ్లీ గెలుపు బాట పట్టాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది.

ఇది కూడా చదవండి :’ఆ ఫ్రాంచైజీలు నాకు నమ్మక ద్రోహం చేశాయి..‘ ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ సంచలన కామెంట్స్

సూపర్ ఫామ్ లో బట్లర్

ఇక రాజస్తాన్ రాయల్స్ విషయానికి వస్తే ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ భీకరంగా ఉంది. బట్లర్ ఎన్నడూ లేనంతగా సెంచరీలతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఈ సీజన్ లో సింగిల్స్ తీసినంత సులభంగా బట్లర్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. బట్లర్ ఈ సీజన్ లో 3 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలతో 491 పరుగులు చేశాడు. ఇతడు మరోసారి చెలరేగితో రాజస్తాన్ భారీ స్కోరు చేయడం ఖాయం. ఇతడిని ఎంత త్వరగా అవుట్ చేస్తే ఆర్సీబీకి అంత మంచింది. పడిక్కల్, సామ్సన్ కూడా ఫామ్ లో ఉన్నారు. ఇక బౌలింగ్ లో బౌల్ట్, అశ్విన్, యుజువేంద్ర చహల్, ప్రసిధ్ మరోసారి కీలకం కానున్నాడు.

ఇది కూడా చదవండి : ఏప్రిల్ 25కి చెన్నై సూపర్ కింగ్స్ కి మధ్య రిలేషన్ తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే.. కానీ తొలిసారి..

తుది జట్లు

రాయల్ చాలెంజ్స్ బెంగళూరు

ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్),  విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, ప్రభుదేశాయ్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హర్షల్ పటేల్, హసరంగా, హేజల్ వుడ్, సిరాజ్

రాజస్తాన్ రాయల్స్

జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్‌మయర్,  రియాన్ పరాగ్ , డారెల్ మిచెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ సేన్, ప్రసిద్ధ్ కృష్ణ,  చాహల్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Faf duplessis, Glenn Maxwell, IPL, IPL 2022, Rajasthan Royals, Ravichandran Ashwin, Royal Challengers Bangalore, Sanju Samson, Virat kohli

ఉత్తమ కథలు