హోమ్ /వార్తలు /క్రీడలు /

RCB vs RR : ఆర్సీబీని ముంచేసిన ఆ రనౌట్.. తక్కువ స్కోరును కూడా ఛేదించలేకపోయిన బెంగళూరు

RCB vs RR : ఆర్సీబీని ముంచేసిన ఆ రనౌట్.. తక్కువ స్కోరును కూడా ఛేదించలేకపోయిన బెంగళూరు

రాజస్తాన్ రాయల్స్ విజయానందం (PC: IPL)

రాజస్తాన్ రాయల్స్ విజయానందం (PC: IPL)

RCB vs RR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Rajasthan Royals) మరోసారి తడబడింది. స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిల పడింది. సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)తో ఏ విధంగా అయితే చెత్త బ్యాటింగ్ చేసిందో అదే విధంగా మంగళవారం రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్ లోనూ బెంగళూరు ఆటతీరు కనబరిచింది.

ఇంకా చదవండి ...

RCB vs RR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Rajasthan Royals) మరోసారి తడబడింది. స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిల పడింది. సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)తో ఏ విధంగా అయితే చెత్త బ్యాటింగ్ చేసిందో అదే విధంగా మంగళవారం రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్ లోనూ బెంగళూరు ఆటతీరు కనబరిచింది. 145 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు 19.3 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా రాజస్తాన్ రాయల్స్ 29 పరుగులతో బెంగళూరుపై ఘనవిజయం సాధించింది. బెంగళూరు టీంలో ఫాఫ్ డు ప్లెసిస్ (21 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ గా నిలువడం గమనార్హం. కుల్దీప్ సేన్ నాలుగు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీశాడు. ప్రసిధ్ కు 2 వికెట్లు దక్కాయి. ఈ సీజన్ లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి లీగ్ మ్యాచ్ లో బెంగళూరు జట్టు గెలువగా.. రెండో మ్యాచ్ లో రాజస్తాన్ విజయం సాధించింది. దాంతో లెక్క సరైంది. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో రాజస్తాన్ రాయల్స్ 8 మ్యాచ్ ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

ఇది కూడా చదవండి : కోహ్లీ కథ ముగిసినట్లేనా.. ఇలానే ఆడితే టి20 ప్రపంచ కప్ జట్టులో చోటు కష్టమే మరీ..

కొంప ముంచిన రనౌట్

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ గా ప్రమోట్ అయిన విరాట్ కోహ్లీ (9) ప్రసిధ్ వేసిన క్విక్ బౌన్సర్ కు పెవిలియన్ కు చేరాడు. ఫాఫ్ డు ప్లెసిస్, రజత్ పటిదార్ (16) కాసేపు రాజస్తాన్ రాయల్స్ బౌలర్లను ప్రతిఘటించారు. అయితే బౌలింగ్ కు వచ్చిన కుల్దీప్ సేన్ వరుస బంతుల్లో డు ప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్ వెల్ (0) వికెట్లను అవుట్ చేశాడు. మరికాసేపటికే అశ్విన్ అద్బుత బంతికి రజత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఈ దశలో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ (6) జట్టును ఆదుకుంటాడని అంతా అనుకున్నారు. అయితే షాబాజ్ అహ్మద్ తో సమన్వయ లోపం కారణంగా దినేశ్ కార్తీక్ రనౌట్ అయ్యాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రనౌటే బెంగళూరు అపజాయాన్ని ఖాయం చేసింది. దినేశ్ కార్తీక్ అవుటయ్యాక బెంగళూరు ఓడిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన  రాజస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడని రియాన్ పరాగ్ ఈ మ్యాచ్ లో మాత్రం చెలరేగిపోయాడు. తనపై వస్తున్న విమర్శలు, మీమ్స్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. పరాగ్ (31 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్ల)తో కెరీర్ లోనే తొలి ఐపీఎల్ అర్ధ సెంచరీని అందుకున్నాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Faf duplessis, Glenn Maxwell, IPL, IPL 2022, Rajasthan Royals, Ravichandran Ashwin, RCB, Royal Challengers Bangalore, Sanju Samson, Sunrisers Hyderabad, Virat kohli

ఉత్తమ కథలు