IPL 2022 RCB VS RR LIVE SCORE ROYAL CHALLENGERS BANGALORE BEAT RAJASTHAN ROYALS BY 4 WICKETS SJN
IPL 2022: ఇది కదా ఆటంటే... దినేశ్ కార్తీక్ మెరుపులు... షాబాజ్ శభాష్ ఇన్నింగ్స్.. రాజస్తాన్ పై బెంగళూరు సూపర్ విక్టరీ
షాబాజ్, దినేశ్ కార్తీక్ (PC: IPL)
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)కు తొలి పరాజయం ఎదురైంది. ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచిన సంజా సామ్సన్ (Sanju Samson) నాయకత్వంలోని రాజస్తాన్ రాయల్స్ కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) చెక్ పెట్టింది. వాంఖడే స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ పై 4 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం సాధించింది.
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)కు తొలి పరాజయం ఎదురైంది. ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచిన సంజా సామ్సన్ (Sanju Samson) నాయకత్వంలోని రాజస్తాన్ రాయల్స్ కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) చెక్ పెట్టింది. వాంఖడే స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ పై 4 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టు 19.1 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసి గెలుపొందింది. షాబాజ్ అహ్మద్ (26 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 44 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత పోరాటంతో జట్టుకు విజయాన్ని అందించారు.
టార్గెట్ ను బెంగళూరు జట్టు బాగానే ఆరంభించింది. ఓపెనర్లు ఫాఫ్ డు ప్లెసిస్ (29), అనుజ్ రావత్ (26) తొలి వికెట్ కు 55 పరుగులు జోడించారు. దాంతో ఆర్సీబీకి శుభారంభం లభించినట్లయింది. అయితే చహల్ వీరిని విడదీశాడు. డుప్లెసిస్ అను అవుట్ చేసిన చహల్ రాజస్తాన్ రాయల్స్ కు బ్రేక్ అందించాడు. కాసేపటికే లేని పరుగు కోసం పిచ్ మధ్యకు వచ్చిన విరాట్ కోహ్లీ (5) రనౌట్ అయ్యాడు. కాసేపటికే విల్లే (0)ను చహల్ అవుట్ చేశాడు. అనంతరం రావత్ ను సైనీ అవుట్ చేయడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ జట్టును ఆదుకున్నాడు. సూపర్ బ్యాటింగ్ తో కేక పెట్టించాడు. అశ్విన్ వేసిన ఓవర్ లో ఒక సిక్సర్ మూడు ఫోర్లు బాది మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాాడు. మరో ఎండ్ లో ఉన్న షాబాజ్ కూాడా బ్యాట్ ను ఝుళిపించడంతో ఆర్సీబీ విజయం ఖాయం అయ్యింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసింది. బట్లర్ (47 బంతుల్లో 70; 6 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా... దేవ్ దత్ పడిక్కల్ (29 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. చివర్లో హెట్ మైర్ (31 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. చివరి ఐదు ఓవర్లలో రాజస్తాన్ రాయల్స్ ఏకంగా 66 పరుగులు సాధించడం విశేషం.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.