Home /News /sports /

IPL 2022 RCB VS RR LIVE SCORE JOS BUTTLER SHIMRON HETMYER AND DEVDUT PADIKKAL RESPONSIBLE INNINGS HELPS RR TO PUT FIGHTING TOTAL AGAINST RCB SJN

IPL 2022: మళ్లీ మెరిసిన బట్లర్... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందు ఫైటింగ్ టోటల్

బట్లర్, పడిక్కల్ (PC: IPL)

బట్లర్, పడిక్కల్ (PC: IPL)

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) ఓపెనర్ జాస్ బట్లర్ (Jos Buttler) హవా కొనసాగుతుంది. సీజన్ లో సూపర్ ఫామ్ లో ఉన్న బట్లర్ మరోసారి సూపర్ ఇన్నింగ్స్ తో మెరిశాడు.

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) ఓపెనర్ జాస్ బట్లర్ (Jos Buttler) హవా కొనసాగుతుంది. సీజన్ లో సూపర్ ఫామ్ లో ఉన్న బట్లర్ మరోసారి సూపర్ ఇన్నింగ్స్ తో మెరిశాడు. ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో జరిగిన మ్యాచ్ మాదిరి ధనాధన్ షాట్లతో కాకుండా ఈసారి బాధ్యతాయుత ఇన్నింగ్స్ తో మెరిశాడు. పిచ్ బౌలర్లకు ఏ మాత్రం సహకరించకున్నా బాధ్యతగా బ్యాటింగ్ చేసిన బట్లర్ రాజస్తాన్ రాయల్స్ కు మంచి స్కోరును అందించాడు. వాంఖడే వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bagalore)తో జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసింది. బట్లర్ (47 బంతుల్లో 70; 6 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా... దేవ్ దత్ పడిక్కల్ (29 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. చివర్లో హెట్ మైర్ (31 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. చివరి ఐదు ఓవర్లలో రాజస్తాన్ రాయల్స్ ఏకంగా 66 పరుగులు సాధించడం విశేషం.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్తాన్ రాయల్స్ కు శుభారంభం లభించలేదు. యశస్వీ జై స్వాల్ (4) విల్లీ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. అదే సమయంలో పిచ్ స్లోగా ఉండటంతో బంతి బ్యాట్ మీదకు సరిగ్గా రాలేదు. దాంతో రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయితే బట్లర్, దేవ్ దత్ పడిక్కల్ ఆచి తూచి ఆడారు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిన బట్లర్... ఈ మ్యాచ్ లో మాత్రం మొదట్లో చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. రెండో వికెట్ కు వీరు 70 పరుగులు జోడించారు. విరాట్ కోహ్లీ పట్టిన సూపర్ క్యాచ్ కు పడిక్కల్ పెవలియన్ కు చేరుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సంజూ సామ్సన్ (8) కూడా తొందరగానే అవుటయ్యాడు.

ఆఖర్లో దంచుడే దంచుడు

18వ ఓవర్ వరకు కూడా రాజస్తాన్ రాయల్స్ ఆట చాలా నెమ్మదిగా సాగింది. అయితే సిరాజ్ వేసిన 19వ ఓవర్ నుంచి ఆట స్వరూపాన్నే బట్లర్ మార్చేశాడు. డ్యూ వల్ల బంతి జారుడుగా ఉండటంతో సిరాజ్ ఫుల్ టాస్ లు వేశాడు. దీన్ని ఆసరాగా చేసుకున్న బట్లర్, హెట్ మైర్ సిక్సర్ల వర్షం కురిపించారు. బట్లర్ రెండు సిక్సర్లు బాదగా... హెట్ మైర్ ఒక ఫోర్ బాదాడు. దాంతో ఆ ఓవర్ లో మొత్తం 19 పరుగులు వచ్చాయి. ఇక ఆఖరి ఓవర్లో బట్లర్ మరో రెండు సిక్సర్లు బాదగా... ఆఖరి బంతిని హెట్ మైర్ సిక్సర్ గా మార్చాడు. దాంతో ఆ ఓవర్ లో 23 పరగులు వచ్చాయి. మొత్తం మీద చివరి రెండు ఓవర్లలో రాజస్తాన్ జట్టు 42 పరుగులు సాధించింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Faf duplessis, IPL, IPL 2022, Rajasthan Royals, Royal Challengers Bangalore, Sanju Samson, Virat kohli

తదుపరి వార్తలు