హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022: ట్రిపుల్ సెంచరీ ప్లేయర్ ని తప్పించింది.. డ్యాన్సర్ ను మాత్రం జట్టుతోనే.. రాజస్తాన్ టీం మనకు అర్థం కాదయ్యా..

IPL 2022: ట్రిపుల్ సెంచరీ ప్లేయర్ ని తప్పించింది.. డ్యాన్సర్ ను మాత్రం జట్టుతోనే.. రాజస్తాన్ టీం మనకు అర్థం కాదయ్యా..

Ravichandran Ashwin ( IPL Twitter)

Ravichandran Ashwin ( IPL Twitter)

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) దంచి కొడుతున్న సంగతి తెలిసిందే. ఓపెనర్ జాస్ బట్లర్ (Jos Buttler) సూపర్ ఫామ్ లో ఉండటం.. అదే సమయలో బౌలింగ్ దళం కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో రాజస్తాన్ రాయల్స్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా కనబడుతోంది.

ఇంకా చదవండి ...

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) దంచి కొడుతున్న సంగతి తెలిసిందే. ఓపెనర్ జాస్ బట్లర్ (Jos Buttler) సూపర్ ఫామ్ లో ఉండటం.. అదే సమయలో బౌలింగ్ దళం కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో రాజస్తాన్ రాయల్స్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా కనబడుతోంది. ఇప్పటికే ఆడిన  మ్యాచ్ ల్లో ఐదింటిలో విజయం సాధించిన ఆ జట్టు రెండంటిలో మాత్రమే ఓడింది. జట్టు ఎంపిక అంతా బాగానే ఉన్న ఒక ప్లేయర్ విషయంలో మాత్రం ఆ జట్టు స్ట్రాటజీ అస్సలు అర్థం కావడం లేదు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)తో జరిగే మ్యాచ్ లో ఆ ప్లేయర్ పై వేటు ఖాయం అని అంతా భావించారు. అయితే వారి ఊహలకు అందకుండా భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన ప్లేయర్ ను తప్పించి చెత్త ప్లేయర్ ను మాత్రం తనతోనే ఉంచుకుంది.

ఇది కూడా చదవండి : వామ్మో రస్సెల్.. ఈ విండీస్ వీరుడు కొడితే ఏదైనా సరే విరగాల్సిందే.. వీడియో వైరల్

రియాన్ పరాగ్.. భారీ సిక్సర్లు కొట్టకపోయినా.. బౌలింగ్ లో వికెట్లు తీయకపోయినా.. ఇతడో ఆల్ రౌండర్.. ఇంకా ఫినిషర్. ఇంకా చెప్పాలంటే.. ఫ్యూచర్ లో ఇతడు భారత్ కు గొప్ప ఫినిషర్ గా మారతాడట. ఇవన్నీ.. రియాన్ పరాగ్ నుంచి జాలువారిని ఆణిముత్యాల్లాంటి మాటలు. ఈ సీజన్ లో రియాన్ పరాగ్ రాజస్తాన్ తరఫున అన్ని మ్యాచ్ లు అంటే ఏడు మ్యాచ్ లు ఆడాడు. కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు. జట్టుకు విజయం అందించాల్సిన స్థితిలో బరిలోకి దిగిన అతడు చెత్త ప్రదర్శనతో నిరాశ పరిచాడు. అయినా కూడా ఇతడిని రాజస్తాన్ రాయల్స్ బ్యాకప్ చేస్తూనే ఉంది. ఆటతో అంటే కూడా రియాన్ తన ఓవరాక్షన్ తో  వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నాడు. ఆడాల్సిన చోట డ్యాన్స్ చేస్తూ ఫ్యాన్స్ కు కంపరం పుట్టిస్తున్నాడు.

ఇక ఆర్సీబీతో మ్యాచ్ లో రియాన్ పరాగ్ పై వేటు ఖాయం అని అంతా భావించారు. అయితే అతడిని అలానే జట్టుతోనే ఉంచిన రాజస్తాన్ మేనేజ్ మెంట్.. భారత్ తరఫున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ ను తప్పించింది. ఇప్పుడు దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. ఇక ఆర్సీబీతో ప్రస్తుతం జరుగుతోన్న మ్యాచ్ లో రెండో ఓవర్ లోనే రాజస్తాన్ రాయల్స్ పడిక్కల్ వికెట్ ను కోల్పోయింది. అయితే అనూహ్యంగా అశ్విన్ ను వన్ డౌన్ లో పంపింది. పరాగ్ ను ఎందుకు పంపలేదో చెప్పాలంటూ ఫ్యాన్స్ రాజస్తాన్ మేనేజ్ మెంట్ ను క్వశ్చన్ చేస్తున్నారు. అదే సమయంలో అండర్ 19 ప్రపంచకప్ లో అదరగొట్టిన యశస్వీ జైస్వాల్ లాంటి ప్లేయర్ ను రెండు మ్యాచ్ ల్లో విఫలమైయ్యాడని పక్కన పెట్టిన రాజస్తాన్ పరాగ్ ను మాత్రం ఎలా కొనసాగిస్తుందంటూ విమర్శలు చేస్తున్నారు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Faf duplessis, Glenn Maxwell, IPL, IPL 2022, Mohammed Siraj, Rajasthan Royals, Royal Challengers Bangalore, Sanju Samson, Virat kohli

ఉత్తమ కథలు