Home /News /sports /

IPL 2022 RCB VS PKBS LIVE SCORES PUNJAB KINGS CAPTAIN MAYANK AGARWAL WON THE TOSS AND ELECTED TO FIELD FIRST SJN

IPL 2022: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్... తొలిసారి మామూలు ప్లేయర్ గా విరాట్ కోహ్లీ

డు ప్లెసిస్, మయాంక్ అగర్వాల్ (ఫైల్ ఫోటోస్)

డు ప్లెసిస్, మయాంక్ అగర్వాల్ (ఫైల్ ఫోటోస్)

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భాగంగా నేడు రెండు మ్యాచ్ లు జరగనున్న సంగతి తెలిసిందే. డబుల్ ధమాకలో భాగంగా రెండో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings)తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers banglore) సై అంటోంది.

ఇంకా చదవండి ...
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భాగంగా నేడు రెండు మ్యాచ్ లు జరగనున్న సంగతి తెలిసిందే. డబుల్ ధమాకలో భాగంగా రెండో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings)తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers banglore) సై అంటోంది. విరాట్ కోహ్లీ (Virat kohli) కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో బెంగళూరు జట్టుకు ఫాఫ్ డు ప్లెసిస్ కొత్త సారథిగా నియమింపబడ్డాడు. అదే సమయంలో కేఎల్ రాహుల్ జట్టును వీడటంతో మయాంక్ అగర్వాల్ పంజాబ్ కింగ్స్ కు ఈ సీజన్ లో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. టాస్ గెలిచిన మయాంక్ అగర్వాల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

హెడ్ టు హెడ్ రికార్డ్

హెట్ టు హెడ్ రికార్డ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును భయపెడుతోంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 28 సార్లు తలపడగా... పంజాబ్ కింగ్స్ 15 సార్లు గెలిచింది. 13 సార్లు బెంగళూరు టీం గెలిచింది.

తుది జట్ల అంచనా

రాయల్ చాలెంజెర్స్ బెంగళూరు

డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, రూథర్ ఫర్డ్, దినేశ్ కార్తీక్, మహిపాల్ లొమ్రోర్, షాబాజ్ అహ్మద్, హసరంగ, హర్షల్ పటేల్, సిరాజ్, డేవిడ్ విల్లీ, అకాశ్ దీప్ సింగ్.

పంజాబ్ కింగ్స్

శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), భానుక రాజపక్స, లియామ్ లివింగ్ స్టోన్, షారుఖ్ ఖాన్, ప్రభ్ సిమ్రన్ సింగ్, ఓడెన్ స్మిత్, రాజ్ బవ,  అర్ష్ దీప్ సింగ్, హర్ ప్రీత్ బ్రార్,  సందీప్ శర్మ,  రాహుల్ చహర్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Faf duplessis, IPL, IPL 2022, Punjab kings, Royal Challengers Bangalore, Virat kohli

తదుపరి వార్తలు