Home /News /sports /

IPL 2022 RCB VS PBKS LOVE SCORES PUNJAB KINGS CO OWNER PREITY ZINTA JOINS WITH SHIKHAR DHAWAN FOR WORK OUT SJN

preity zinta : శిఖర్ ధావన్ తో కలిసి జిమ్ లో రెచ్చిపోయిన సొట్ట బుగ్గుల సుందరి.. తగ్గేదేలా అంటూ వర్కౌట్స్.. వీడియో

జిమ్ లో చెమటోడుస్తున్న ప్రీతీ జింతా, ధావన్  (PC : TWITTER)

జిమ్ లో చెమటోడుస్తున్న ప్రీతీ జింతా, ధావన్ (PC : TWITTER)

preity zinta : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) పరస్థితి ఏ మాత్రం బాగాలేదు. గత సీజన్లలో మాదిరే ఎప్పుడు ఆడుతుంతో ఎప్పుడు చేతులెత్తేస్తోంది తెలియకుండా తమ ఆటను ప్రదర్శిస్తోంది. ఇక సీజన్ ఆఖరి ఘట్టానికి చేరుకోగా.. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) మాత్రమేఇప్పటి వరకు ప్లే ఆఫ్స్ కు చేరుకుంది.

ఇంకా చదవండి ...
preity zinta : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) పరస్థితి ఏ మాత్రం బాగాలేదు. గత సీజన్లలో మాదిరే ఎప్పుడు ఆడుతుంతో ఎప్పుడు చేతులెత్తేస్తోంది తెలియకుండా తమ ఆటను ప్రదర్శిస్తోంది. ఇక సీజన్ ఆఖరి ఘట్టానికి చేరుకోగా.. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) మాత్రమేఇప్పటి వరకు ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ముంబై ఇండియన్స్ (Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకున్నాయి. ఇక మిగిలిన మూడు ప్లే ఆఫ్స్ స్థానాల కోసం ఎన్నడూ లేని విధంగా ఏడు జట్లు పోటీ పడుతున్నాయి. ఇక పంజాబ్ కింగ్స్ లీగ్ లో ఇప్పటి వరకు 11 మ్యాచ్ ల్లో 5 విజయాలు 6 పరాజయాలతో 10 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతుంది. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే మిగిలిన మూడు మ్యాచ్ ల్లోనూ పంజాబ్ కింగ్స్ గెలవాల్సిన పరిస్థితి.

ఇది కూడా చదవండి : ఫామ్ విషయంలో కోహ్లీకి దిక్కుమాలిన సలహా ఇచ్చిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్.. అసలేం చెప్పాడంటే?

శుక్రవారం నాడు ఆర్సీబీ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ క్రమంలో జట్టుకు మోటివేషన్ ఇచ్చేందుకు పంజాబ్ కింగ్స్ సహ యజమాని, సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింతా నిర్ణయించుకుంది. టీంతో కలిసి జిమ్ లో చెమటలు కక్కేలా వర్కౌట్స్ చేసింది. ముఖ్యంగా జట్టు స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తో కలిసి పోటీ పడి మరీ వర్కౌట్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను పంజాబ్ కింగ్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.



బ్రబోర్న్ వేదికగా జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది. కీలక మ్యాచ్ లో ఓపెనర్లుగా వచ్చిన జానీ బెయిర్ స్టో, శిఖర్ ధావన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. హేజల్ వుడ్ వేసిన రెండో ఓవర్లో బెయిర్ స్టో 22 పరుగులు సాధించాడు.

తుది జట్లు

పంజాబ్ కింగ్స్

జానీ బెయిర్ స్టో, శిఖర్ ధావన్ ,మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), భానుక రాజపక్స, లియాం లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ, రిశి ధావన్, కగిసో రబడ, రాహుల్ చహర్, హర్ ప్రీత్ బ్రార్, అర్ష్ దీప్ సింగ్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్ వెల్, దినేశ్ కార్తీక్, మహిపాల్ లొమ్రోర్, షాబాజ్ అహ్మద్, హసరంగ, హేజల్ వుడ్, మొహమ్మద్ సిరాజ్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Faf duplessis, Glenn Maxwell, IPL, IPL 2022, Preity zinta, Punjab kings, Royal Challengers Bangalore, Shikhar Dhawan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు