RCB vs PBKS : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా బ్రబోర్న్ స్టేడియంలో శుక్రవారం రాత్రి పంజాబ్ కింగ్స్ (Punjab KIngs), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో సిక్సర్ల వర్షం కురస్తోంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్ లో ఏకంగా 14 సిక్సర్లు నమోదు కావడం విశేషం. అనంతరం 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టార్గెట్ ను ఛేదించేందుకు పోరాడుతోంది. ఈ మ్యాచ్ లో రజత్ పటిదార్ 9వ ఓవర్ నాలుగో బంతిని భారీ సిక్సర్ బాదాడు. 102 మీటర్ల దూరం వెళ్లిన ఈ బంతి మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడటానికి వచ్చిన ఓల్డ్ మ్యాన్ ను తలను తాకింది. దాంతో అతడు కాసేపు నొప్పితో విలవిల్లాడాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాల్ల ో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి : 36 బంతుల్లో 100.. ఐపీఎల్ లో పరమ చెత్త రికార్డు నమోదు చేసిన ఆర్సీబీ బౌలింగ్ ద్వయం
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఓపెనర్ జానీ బెయిర్ స్టో (29 బంతుల్లో 66; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇస్తే ఆ తర్వాత లియామ్ లివింగ్ స్టోన్ (42 బంతుల్లో 70; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆర్సీబీ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ఈ సీజన్ లో పొదుపుగా బౌలింగ్ చేస్తూ వచ్చిన ఆర్సీబీ బౌలర్ హేజల్ వుడ్ ఈ మ్యాచ్ లో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. తన నాలుగు ఓవర్ల స్పెల్ లో ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. హసరంగ రెండు వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్ 4 వికెట్లు తీశాడు.
Six hit by Rajat patidar injured one uncle in the stands #RCB pic.twitter.com/EbZw04YM5R
— All About Cricket (@allaboutcric_) May 13, 2022
టాస్ గెలిచిన ఫాఫ్ డు ప్లెసిస్ పంజాబ్ కింగ్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. అయితే ఆ నిర్ణయం తప్పని తేలడానికి అతడికి ఎంతో సమయం పట్టలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడినట్లు పంజాబ్ కింగ్స్ తరఫున ఇప్పటి వరకు ఆడన జానీ బెయిర్ స్టో ఈ మ్యాచ్ లో విశ్వరూపం ప్రదర్శించాడు. హేజల్ వుడ్ వేసిన రెండో ఓవర్లో ఏకంగా 23 పరుగులు రాబట్టిన అతడు పంజాబ్ కు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఒక ఎండ్ లో శిఖర్ ధావన్ (21) తడబడినా.. బెయిర్ స్టో మాత్రం 200లకు పైగా స్ట్రయిక్ రేట్ తో బ్యాటింగ్ కొనసాగించాడు. ఇతడి దెబ్బకు పవర్ ప్లేలో పంజాబ్ కింగ్స్ ఏకంగా 83 పరుగులు సాధించింది. అయితే సెంచరీ చేసేలా కనిపించిన బెయిర్ స్టోను షాబాజ్ అహ్మద్ పెవిలియన్ కు చేర్చాడు. హసరంగ కూడా పొదుపుగా బౌలింగ్ చేస్తూ పంజాబ్ ను కట్టడి చేశాడు. దాంతో మిడిల్ ఓవర్స్ లో పంజాబ్ దూకుడు తగ్గింది. అయితే చివర్లో లివింగ్ స్టోన్ దంచి కొట్టడంతో పంజాబ్ 200 మార్కును దాటగలిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dinesh Karthik, Faf duplessis, Glenn Maxwell, IPL, IPL 2022, Mohammed Siraj, Preity zinta, Punjab kings, RCB, Royal Challengers Bangalore, Shikhar Dhawan, Virat kohli