హోమ్ /వార్తలు /క్రీడలు /

RCB vs PBKS : అందరి కళ్లూ కింగ్ కోహ్లీపైనే.. టాస్ నెగ్గిన ఆర్సీబీ.. ఒక మార్పుతో పంజాబ్ కింగ్స్

RCB vs PBKS : అందరి కళ్లూ కింగ్ కోహ్లీపైనే.. టాస్ నెగ్గిన ఆర్సీబీ.. ఒక మార్పుతో పంజాబ్ కింగ్స్

డు ప్లెసిస్ వర్సెస్ మయాంక్ (PC : IPL)

డు ప్లెసిస్ వర్సెస్ మయాంక్ (PC : IPL)

RCB vs PBKS : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్లు మరో కీలక పోరుకు సిద్ధమయ్యాయి. ప్లేఆఫ్స్ కు చేరాలంటే ఈ రెండు జట్లకు కూడా ప్రతి మ్యాచ్ కీలకమే.

ఇంకా చదవండి ...

RCB vs PBKS : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్లు మరో కీలక పోరుకు సిద్ధమయ్యాయి. ప్లేఆఫ్స్ కు చేరాలంటే ఈ రెండు జట్లకు కూడా ప్రతి మ్యాచ్ కీలకమే. పంజాబ్ కింగ్స్ తో మరికొద్ది సేపట్లో ఆరంభమయ్యే మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గత కొన్ని మ్యాచ్ ల్లో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం చూస్తున్నాం. అయితే ఆర్సీబీ అందుకు విరుద్దంగా నిర్ణయం తీసుకుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ ఎటువంటి మార్పులు చేయలేదు. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ కోసం ఒక మార్పు చేసింది.

ఇది కూడా చదవండి : చెన్నై సూపర్ కింగ్స్ పరువు తీసిన చిన్న తలా సురేశ్ రైనా.. అసలేం జరిగిందంటే?

అందరి కళ్లూ కోహ్లీపైనే

టి20 ప్రపంచకప్ ఇదే ఏడాది ఉండటంతో విరాట్ కోహ్లీ ఎంత త్వరగా ఫామ్ లోకి వస్తే అంత మంచిది అన్నట్లు టీమిండియా అభిమానులు భావిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఐపీఎల్ లో కోహ్లీ పరుగులు సాధించేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఒక ఈ సీజన్లో అతడు మూడు సార్లు మొదటి బంతికే అవుటయ్యాడు. అర్ధ సెంచరీ చేసినా కూడా అది కోహ్లీ ఆటతీరుకు సరి తూగేది కాదు. దాంతో కోహ్లీ ఫామ్ పై అటు మాజీ ప్లేయర్ల నుంచి ఇటు అభిమానుల నుంచి విమర్శలు సలహాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ తన బ్యాట్ కు పనిచెప్తాడో లేదో చూడాలి. అదే సమయంలో ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఆర్సీబీ ప్రస్తుతం 14 పాయింట్లతో లీగ్ టేబులో నాలుగో స్థానంలో ఉంది. ఇక మిగిలి ఉన్న మూడు మ్యాచ్ ల్లోనూ గెలిస్తే టాప్ 2 లో నిలిచే అవకాశం ఉంది. దాంతో రూల్స్ ప్రకారం ఫైనల్ చేరేందుకు ఆర్సీబీకి రెండు అవకాశాలు ఉంటాయి. ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ పరిస్థితి కాస్త విచిత్రంగా ఉంది. పవర్ హిట్టర్లు, స్టార్ ప్లేయర్లతో ఆ జట్టు బలంగా ఉన్నా కూడా సమష్టిగా రాణించడంలో విఫలమవుతున్నారు. ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ లోనూ పంజాబ్ కింగ్స్ గెలవాల్సి ఉంది. సీజన్ లో ఇరు జట్ల మధ్య ఇప్పటికే ఒక మ్యాచ్ జరగ్గా అందులో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.


తుది జట్లు

పంజాబ్ కింగ్స్

జానీ బెయిర్ స్టో, శిఖర్ ధావన్ ,మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), భానుక రాజపక్స, లియాం లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ, రిశి ధావన్, కగిసో రబడ, రాహుల్ చహర్, హర్ ప్రీత్ బ్రార్, అర్ష్ దీప్ సింగ్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్ వెల్, దినేశ్ కార్తీక్, మహిపాల్ లొమ్రోర్, షాబాజ్ అహ్మద్, హసరంగ, హేజల్ వుడ్, మొహమ్మద్ సిరాజ్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Faf duplessis, Glenn Maxwell, IPL, IPL 2022, Royal Challengers Bangalore, Shikhar Dhawan, Virat kohli

ఉత్తమ కథలు