Home /News /sports /

IPL 2022 RCB VS PBKS LIVE SCORES RCB CAPTAIN FAF DU PLESSIS MASSIVE KNOCK HELPS ROYAL CHALLENGERS BANGLORE TO SET HUGE TARGET TO PUNJAB KINGS SJN

IPL 2022: ఆ కొట్టుడేంది సామీ... పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోసిన డు ప్లెసిస్

ఫాఫ్ డు ప్లెసిస్ (PC: IPL)

ఫాఫ్ డు ప్లెసిస్ (PC: IPL)

IPL 2022: డీవై పాటిల్ స్టేడియంలో భారీ వర్షం కురిసింది. అయితే ఇది మీరు అనుకన్న వాన కాదు... డు ప్లెసిస్ (faf duplessis) బ్యాట్ నుంచి జాలు వారిన సిక్సర్ల వర్షం. మెల్లగా ఆరంభమైన అతడి ఇన్నింగ్స్... ఆ తర్వాత విధ్వంసానికి నాంది పలికింది. బౌలర్ ఎవరని చూడకుండా దొరికిన బంతిని దొరికినట్లు స్టేడియం అవతలికి పంపాడు.

ఇంకా చదవండి ...
IPL 2022: డీవై పాటిల్ స్టేడియంలో భారీ వర్షం కురిసింది. అయితే ఇది మీరు అనుకన్న వాన కాదు... డు ప్లెసిస్ (faf duplessis) బ్యాట్ నుంచి జాలు వారిన సిక్సర్ల వర్షం. మెల్లగా ఆరంభమైన అతడి ఇన్నింగ్స్... ఆ తర్వాత విధ్వంసానికి నాంది పలికింది. బౌలర్ ఎవరని చూడకుండా దొరికిన బంతిని దొరికినట్లు స్టేడియం అవతలికి పంపాడు. తొలి 30 బంతుల్లో కేవలం 17 పరగులు మాత్రమే చేసిన డు ప్లెసిస్... ఆ తర్వాతి 27 బంతుల్లో ఏకంగా 71 పరుగులు సాధించాడు. మ్యాచ్ లో డు ప్లెసిస్ 57 బంతుల్లో 88 పరుగులు చేశాడు. ఇందులో 7 సిక్సర్లు, 3 ఫోర్లు ఉండటం విశేషం. ఇతడికి విరాట్ కోహ్లీ (Virat Kohli) (29 బంతుల్లో 41 నాటౌట్; 1 ఫోర్, సిక్సర్లు) ఇన్నింగ్స్ కూడా తోడవ్వడంతో పంజాబ్ కింగ్స్ (Punjab kings)తో జరుగుతోన్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers banglore) భారీ స్కోరును సాధించింది. 20 ఓవర్లలో బెంగళూరు  2 వికెట్లకు 205 పరుగులు చేసింది. డు ప్లెసిస్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా మెరుపులు మెరిపించడంతో బెంగళూరు భారీ స్కోెరును అందుకుంది.

టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ సారథి మయాంక్ అగర్వాల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ నిర్ణయం ఎంత తప్పో అతడికి తెలిసేందుకు ఎంతో సమయం పట్టలేదు. ఓపెనర్లుగా డు ప్లెసిస్, అనుజ్ రావత్ (20 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) వచ్చారు. తొలుత వీరు ఆచి తూచి ఆడారు. దాంతో స్కోరు బోర్డు నెమ్మదిగానే పరుగెత్తింది. అనుజ్ రావత్ కుదురుకున్నాడనే సమయంలో రాహుల్ చహర్ అద్భుత బంతికి బౌల్డ్ అయ్యాడు. దాంతో 50 పరుగుల వద్ద బెంగళూరు తొలి వికెట్ ను కోల్పోయింది.

ఈ దశలో జత కలిసిన విరాట్ కోహ్లీ, డు ప్లెసిస్ లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అప్పటి వరకు టెస్టు మ్యాచ్ లెవల్లో 30 బంతుల్లో కేవలం 17 పరుగులు మాత్రమే చేసిన డు ప్లెసిస్... ఇక్కడి నుంచి చెలరేగిపోయాడు. దొరికిన బంతిని దొరికినట్లు స్టాండ్స్ లోకి పంపించేశాడు. ఇక్కడి నుంచి అతడు అవుటయ్యేంతవరకు కూడా 27 బంతులను ఎదుర్కొన్న డు ప్లెసిస్... ఏకంగా 71 పరుగుల చేశాడు. అయితే సెంచరీ ముంగిట భారీ షాట్ కు ప్రయత్నించి అవుటయ్యాడు. మరో ఎండ్ లో ఉన్న కోహ్లీ డు ప్లెసిస్ కు చక్కగా సహకరించాడు. అడపాదడపా బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డు వేగం తగ్గకుండా చూసుకున్నాడు. వీరు రెండో వికెట్ కు 118 పరుగులు జోడించడం విశేషం.

ఇక డు ప్లెసిస్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ కూడా చెలరేగిపోయాడు. సూపర్ షాట్లతో అదిరిపోయే ఫినిషింగ్ ఇచ్చాడు. వీరి ధాటికి పంజాబ్ బౌలర్లలో ఒక్క రాహుల్ చహర్ మినహా మిగిలిన వారంతా భారీగా పరుగులు సమర్పించుకన్నారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: IPL, IPL 2022, Punjab kings, Royal Challengers Bangalore

తదుపరి వార్తలు