హోమ్ /వార్తలు /క్రీడలు /

RCB vs PBKS : బెయిర్ స్టో దంచుడు..లివింగ్ స్టోన్ ఉతుకుడు.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్ ను సెట్ చేసిన పంజాబ్ కింగ్స్

RCB vs PBKS : బెయిర్ స్టో దంచుడు..లివింగ్ స్టోన్ ఉతుకుడు.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్ ను సెట్ చేసిన పంజాబ్ కింగ్స్

బెయిర్ స్టో (PC : IPL)

బెయిర్ స్టో (PC : IPL)

RCB vs PBKS : కీలక మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జూలు విదిల్చింది. శుక్రవారం నాడు బ్రబోర్న్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)తో జరుగుతోన్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగారు.

ఇంకా చదవండి ...

RCB vs PBKS : కీలక మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జూలు విదిల్చింది. శుక్రవారం నాడు బ్రబోర్న్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)తో జరుగుతోన్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఓపెనర్ జానీ బెయిర్ స్టో (29 బంతుల్లో 66; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇస్తే ఆ తర్వాత లియామ్ లివింగ్ స్టోన్ (42 బంతుల్లో 70; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆర్సీబీ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ఈ సీజన్ లో పొదుపుగా బౌలింగ్ చేస్తూ వచ్చిన ఆర్సీబీ బౌలర్ హేజల్ వుడ్ ఈ మ్యాచ్ లో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. తన నాలుగు ఓవర్ల స్పెల్ లో ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. హసరంగ రెండు వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్ 4 వికెట్లు తీశాడు.

ఇది కూడా చదవండి  : శిఖర్ ధావన్ తో కలిసి జిమ్ లో రెచ్చిపోయిన సొట్ట బుగ్గుల సుందరి.. తగ్గేదేలా అంటూ వర్కౌట్స్.. వీడియో

టాస్ గెలిచిన ఫాఫ్ డు ప్లెసిస్ పంజాబ్ కింగ్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. అయితే ఆ నిర్ణయం తప్పని తేలడానికి అతడికి ఎంతో సమయం పట్టలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడినట్లు పంజాబ్ కింగ్స్ తరఫున ఇప్పటి వరకు ఆడన జానీ బెయిర్ స్టో ఈ మ్యాచ్ లో విశ్వరూపం ప్రదర్శించాడు. హేజల్ వుడ్ వేసిన రెండో ఓవర్లో ఏకంగా 23 పరుగులు రాబట్టిన అతడు పంజాబ్ కు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఒక ఎండ్ లో శిఖర్ ధావన్ (21) తడబడినా.. బెయిర్ స్టో మాత్రం 200లకు పైగా స్ట్రయిక్ రేట్ తో బ్యాటింగ్ కొనసాగించాడు. ఇతడి దెబ్బకు పవర్ ప్లేలో పంజాబ్ కింగ్స్ ఏకంగా 83 పరుగులు సాధించింది. అయితే సెంచరీ చేసేలా కనిపించిన బెయిర్ స్టోను షాబాజ్ అహ్మద్ పెవిలియన్ కు చేర్చాడు. హసరంగ కూడా పొదుపుగా బౌలింగ్ చేస్తూ పంజాబ్ ను కట్టడి చేశాడు. దాంతో మిడిల్ ఓవర్స్ లో పంజాబ్ దూకుడు తగ్గింది. అయితే చివర్లో లివింగ్ స్టోన్ దంచి కొట్టడంతో పంజాబ్ 200 మార్కును దాటగలిగింది.

తుది జట్లు

పంజాబ్ కింగ్స్

జానీ బెయిర్ స్టో, శిఖర్ ధావన్ ,మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), భానుక రాజపక్స, లియాం లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ, రిశి ధావన్, కగిసో రబడ, రాహుల్ చహర్, హర్ ప్రీత్ బ్రార్, అర్ష్ దీప్ సింగ్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్ వెల్, దినేశ్ కార్తీక్, మహిపాల్ లొమ్రోర్, షాబాజ్ అహ్మద్, హసరంగ, హేజల్ వుడ్, మొహమ్మద్ సిరాజ్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Faf duplessis, Glenn Maxwell, IPL, IPL 2022, Punjab kings, RCB, Royal Challengers Bangalore, Shikhar Dhawan, Virat kohli

ఉత్తమ కథలు