హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 RCB vs LSG: మరీ ఇంత చెత్త అంపైర్లా.. మరోసారి నాటౌట్ ను అవుట్ గా ప్రకటించిన థర్డ్ అంపైర్..

IPL 2022 RCB vs LSG: మరీ ఇంత చెత్త అంపైర్లా.. మరోసారి నాటౌట్ ను అవుట్ గా ప్రకటించిన థర్డ్ అంపైర్..

కేఎల్ రాహుల్ క్యాచ్ (PC: TWITTER)

కేఎల్ రాహుల్ క్యాచ్ (PC: TWITTER)

IPL 2022 RCB vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో అంపైర్ల చెత్త అంపైరింగ్ కొనసాగుతూనే ఉంది. ఈసారి ఐపీఎల్ లో ఫీల్డ్ అంపైర్ల కంటే కూడా థర్డ్ అంపైర్లు చెత్త నిర్ణయాలతో ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు.

IPL 2022 RCB vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో అంపైర్ల చెత్త అంపైరింగ్ కొనసాగుతూనే ఉంది. ఈసారి ఐపీఎల్ లో ఫీల్డ్ అంపైర్ల కంటే కూడా థర్డ్ అంపైర్లు చెత్త నిర్ణయాలతో ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ (Kane Williamson) క్యాచ్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయం, ఆ తర్వాత మరోసారి విలియమ్సన్ అవుటయ్యే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ముగ్గరు ఫీల్డర్లు సర్కిల్ బయట ఉన్నా అంపైర్లు గుర్తించకపోవడం వంటి నిర్ణయాలతో ఫ్యాన్స్ చివాట్లు పెడుతున్నా థర్డ్ అంపైర్లలో ఎటువంటి చలనం రావడం లేదు. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) మ్యాచ్ లోనూ థర్డ్ అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం వివాదానికి దారి తీసింది.

ఇది కూడా చదవండి : సూర్యకుమార్ యాదవ్ కు SKY అని పేరు పెట్టింది ఎవరో తెలుసా?

దుష్మంత చమీర వేసిన తొలి ఓవర్ నాలుగో బంతిని బెంగళూరు ఓపెనర్ అనుజ్ రావత్ (4) మిడాఫ్ దిశగా ఆడాడు. బంతి గాల్లోకి లేవగా అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ క్యాచ్ ను అందుకున్నాడు. అయితే బంతి నేలకు తాకుతుందన్న సమయంలో రాహుల్ క్యాచ్ అందుకున్నాడు. దాంతో ఫీల్డ్ అంపైర్లు క్యాచ్ విషయంలో మరింత స్పష్టత కోసం థర్డ్ అంపైర్ కు నివేదించారు. రీప్లేలో కేఎల్ రాహుల్ బంతిని అందుకోవడం కంటే కూడా ముందే నేలకు తాకినట్లు క్లియర్ గా కనిపించింది. అయితే అంపైర్ మాత్రం దానిని అవుట్ గా ప్రకటించాడు.

ఆ తర్వాత బంతికే విరాట్ కోహ్లీ (0) గోల్డెన్ డక్ గా పెవిలియన్ కు చేరి తన ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశ పరిచాడు. ప్రస్తుతం మ్యాక్స్ వెల్, డు ప్లెసిస్ క్రీజులో ఉన్నారు. ప్రపంచ ఖ్యాతి పొందిన లీగ్ లో మరీ ఇంత చెత్త అంపైరింగా అంటూ విమర్శలు వస్తున్నాయి. అంతకుముందు టాస్ నెగ్గిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) మరో మాట లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లు కూడా తమ ఆఖరి మ్యాచ్ ల్లో విజయాలు సాధించడంతో ఆత్మ విశ్వాసంతో కనిపిస్తున్నాయి. రెండు జట్లు కూడా ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ మ్యాచ్ లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ కు మరింత చేరువ కావాలనే ఉద్దేశంలో రెండు జట్లు కూడా ఉన్నాయి. రెండు జట్లలోనూ భారీ హిట్టర్లు ఉండటంతో మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.

First published:

Tags: Glenn Maxwell, IPL, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, Royal Challengers Bangalore, Virat kohli

ఉత్తమ కథలు