Home /News /sports /

IPL 2022 RCB VS LSG ROYAL CHALLENGERS BANGALORE BEAT LUCKNOW SUPERGIANTS BY 18 RUNS IN IPL 2022 SEASON SJN

IPL 2022 - RCB vs LSG: లక్నో సూపర్ జెయింట్స్ ను రఫ్పాడించిన హేజల్ వుడ్.. గెలుపు ఆర్సీబీదే..

ఆర్సీబీ విజయానందం (PC: IPL)

ఆర్సీబీ విజయానందం (PC: IPL)

IPL 2022 - RCB vs LSG: 15 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఊరిస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్ ను ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఆ దిశగా అడుగులు వేస్తోంది. కొత్త కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (Faf Duplessis) నాయకత్వంలోని ఆర్సీబీ లీగ్ లో ఐదో విజయాన్ని నమోదు చేసింది.

ఇంకా చదవండి ...
IPL 2022 - RCB vs LSG: 15 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఊరిస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్ ను ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఆ దిశగా అడుగులు వేస్తోంది. కొత్త కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (Faf Duplessis) నాయకత్వంలోని ఆర్సీబీ లీగ్ లో ఐదో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants)పై ఘనవిజయం సాధించింది. 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులు చేసి ఓడింది. బెంగళూరు బౌలర్ జాష్ హేజల్ వుడ్ 4 వికెట్లతో లక్నో నడ్డివిరిచాడు. హర్షల్ పటేల్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లక్నో తరఫున కృనాల్ పాండ్యా (28 బంతుల్లో 42; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (24 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. చివర్లో స్టొయినస్ (15 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్), హోల్డర్(9 బంతుల్లో 16; 2 సిక్సర్లు) జట్టు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

హడలెత్తించిన హేజల్ వుడ్

భారీ టార్గెట్ తో ఇన్నింగ్స్ ఆరంభించిన లక్నోను హేజల్ వుడ్ తన పదునైన బంతులతో హడలెత్తించాడు. క్రీజులో ఉన్నంత సేపు తడబడిన క్వింటన్ డికాక్ (3)తో పాటు మనీశ్ పాండే (6) వికెట్లను తన తొలి స్పెల్ లో దక్కించుకున్నాడు. అయితే లక్నో ఇన్నింగ్స్ ను రాహుల్, పాండ్యా గాడిలో పెట్టారు. ఒక్కో పరుగు చేరుస్తూ.. గాడి తప్పిన బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. దూకుడు మీద ఉన్న కేఎల్ రాహుల్ హర్షల్ పటేల్ బౌలింగ్ లో అవుటయ్యాడు. తొలుత అంపైర్ అవుట్ ఇవ్వకపోయినా డీఆర్ ఎస్ కు వెళ్లిన ఆర్సీబీ రాహుల్ వికెట్ ను పొందింది. మరికాసేపటికే పాండ్యా, దీపక్ హుడా, ఆయుశ్ బదోనిలు అవుటయ్యారు. చివర్లో స్టొయినస్, హోల్డర్ జట్టు విజయం కోసం తీవ్రంగా పోరాడినా అప్పటికే ఆలస్యం అయ్యింది.



టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 181 పరుగులు చేసింది. బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (64 బంతుల్లో 96; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) లక్నో బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. తొలి ఓవర్ లో రెండు వికెట్లు కోల్పోయినా బెంగళూరుకు భారీ స్కోరును అందిచండంతో కీలక పాత్ర పోషించాడు. అయితే చివరి ఓవర్ ఐదో బంతికి భారీ షాట్ కు ప్రయత్నించి అవుటయ్యాడు. దాంతో ఐపీఎల్ లో తొలి సెంచరీని చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. గ్లెన్ మ్యాక్స్ వెల్ (11 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్), దినేశ్ కార్తీక్ (8 బంతుల్లో 13 నాటౌట్; 1 సిక్స్) తమ వంతు పాత్ర పోషించారు. జేసన్ హోల్డర్, దుష్మంత చమీర చెరో రెండు వికెట్లు తీశారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Faf duplessis, Glenn Maxwell, IPL, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, Royal Challengers Bangalore, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు