IPL 2022 RCB VS GT LIVE SCORES VIRAT KOHLI HITS FIRST HALF CENTURY IN IPL 2022 SEASON RCB PUT GOOD TOTAL AGAINST GUJARAT TITANS SJN
RCB vs GT : కోహ్లీ అర్ధ సెంచరీ.. పటిదార్ ధనాధన్.. గుజరాత్ ముందు ఫైటింగ్ టోటల్ సెట్ చేసిన ఆర్సీబీ
విరాట్ కోహ్లీ, పటిదార్ (PC: IPL)
RCB vs GT : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తో జరుగుతోన్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Bangalore) జట్టు భారీ స్కోరును సాధించింది.
RCB vs GT : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తో జరుగుతోన్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Bangalore) జట్టు భారీ స్కోరును సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ (53 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్) సీజన్ లో తొలి అర్ధ సెంచరీ సాధించాడు. రజత్ పటిదార్ (32 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ తో రాణించాడు. చివర్లో మ్యాక్స్ వెల్ (18 బంతుల్లో 33; 3 ఫోర్లు ,2 సిక్సర్లు), మహిపాల్ లొమ్రోర్ (8 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడారు. దాంతో ఆర్సీబీ గుజరాత్ ముందు టఫ్ టార్గెట్ ను సెట్ చేయగలిగింది.
టాస్ గెలిచి ఆర్సీబీ బ్యాటింగ్ కు రాగా.. తొలి ఓవర్లో విరాట్ కోహ్లీ రెండు ఫోర్లు బాదాడు. అయితే ఆ తర్వాతి ఓవర్లోనే కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (0)ను తొలి మ్యాచ్ ఆడుతున్న ప్రదీప్ సంగ్వాన్ పెవిలియన్ కు చేర్చాడు. అయితే క్రీజులోకి వచ్చిన రజత్ పటిదార్ కోహ్లీతో కలిసి జట్టును ముందుకు నడిపాడు. ఫామ్ లో లేని కోహ్లీ నెమ్మదిగా బ్యాటింగ్ చేయగా.. మరో ఎండ్ లో ఉన్న పటిదార్ మాత్రం దూకుడుగా ఆడాడు. దాంతో కోహ్లీపై ఒత్తిడి తగ్గింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ అర్ధ సెంచరీ చేసినా.. స్ట్రయిక్ రేట్ అనుకున్నంత రేంజ్ లో లేదు. అయితే పటిదార్ దూకుడుగా ఆడటంతో స్కోరు బోర్డు వేగంగానే కదిలింది. చివర్లో మ్యాక్స్ వెల్ కూడా తన బ్యాట్ తో రెచ్చిపోయాడు. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో వేగంగా పరుగులు సాధించాడు. దాంతో ఆర్సీబీ మంచి స్కోరును సాధించగలిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.