IPL 2022 RCB VS GT LIVE SCORES GUJARAT TITANS BEAT ROYAL CHALLENGERS BANGALORE BY 6 WICKETS SJN
RCB vs GT : ఆర్సీబీని దంచి కొట్టిన తెవాటియా, మిల్లర్.. లీగ్ లో ఎనిమిదో విజయాన్ని నమోదు చేసిన గుజరాత్
మిల్లర్, తెవాటియా (PC : IPL)
RCB vs GT : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Bangalore) పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. శనివారం జరిగిన తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై 6 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం సాధించింది.
RCB vs GT : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Bangalore) పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. శనివారం జరిగిన తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై 6 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం సాధించింది. ఆర్సీబీ జట్టుకు ఇది హ్యాట్రిక్ ఓటమి కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) 19.3 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసి గెలుపొందింది. రాహుల్ తెవాటియా (25 బంతుల్లో 43 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు),, డేవిడ్ మిల్లర్ (24 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) గుజరాత్ టైటాన్స్ కు విజయాన్ని ఖాయం చేశారు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ లీగ్ లో 8వ విజయాన్నినమోదు చేసి 16 పాయింట్లతో దాదాపుగా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది.
మరోసారి దంచి కొట్టిన తెవాటియా
గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయాలు సాధించడానికి ముఖ్య కారణం రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్. ఒక మ్యాచ్ లో మిల్లర్ బాదితే మరో మ్యాచ్ లో తెవాటియా దంచి కొట్టాడు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో అయితే రషీద్ ఖాన్ హీరో అయ్యాడు. తాజాగా ఆర్సీబీ తో జరిగిన మ్యాచ్ లో తెవాటియా మరోసారి సూపర్ ఇన్నింగ్స్ తో జట్టుకు విజయాన్ని అందించాడు. చివరి 5 ఓవర్లలో ధాటిగా బ్యాటింగ్ చేసిన వీరు మరో మూడు బంతులు మిగిలి ఉండగానే గెలుపును సొంతం చేసుకున్నారు.
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ (53 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్) సీజన్ లో తొలి అర్ధ సెంచరీ సాధించాడు. రజత్ పటిదార్ (32 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ తో రాణించాడు. చివర్లో మ్యాక్స్ వెల్ (18 బంతుల్లో 33; 3 ఫోర్లు ,2 సిక్సర్లు), మహిపాల్ లొమ్రోర్ (8 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడారు. దాంతో ఆర్సీబీ గుజరాత్ ముందు టఫ్ టార్గెట్ ను సెట్ చేయగలిగింది.
టాస్ గెలిచి ఆర్సీబీ బ్యాటింగ్ కు రాగా.. తొలి ఓవర్లో విరాట్ కోహ్లీ రెండు ఫోర్లు బాదాడు. అయితే ఆ తర్వాతి ఓవర్లోనే కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (0)ను తొలి మ్యాచ్ ఆడుతున్న ప్రదీప్ సంగ్వాన్ పెవిలియన్ కు చేర్చాడు. అయితే క్రీజులోకి వచ్చిన రజత్ పటిదార్ కోహ్లీతో కలిసి జట్టును ముందుకు నడిపాడు. ఫామ్ లో లేని కోహ్లీ నెమ్మదిగా బ్యాటింగ్ చేయగా.. మరో ఎండ్ లో ఉన్న పటిదార్ మాత్రం దూకుడుగా ఆడాడు. దాంతో కోహ్లీపై ఒత్తిడి తగ్గింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ అర్ధ సెంచరీ చేసినా.. స్ట్రయిక్ రేట్ అనుకున్నంత రేంజ్ లో లేదు. అయితే పటిదార్ దూకుడుగా ఆడటంతో స్కోరు బోర్డు వేగంగానే కదిలింది. చివర్లో మ్యాక్స్ వెల్ కూడా తన బ్యాట్ తో రెచ్చిపోయాడు. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో వేగంగా పరుగులు సాధించాడు. దాంతో ఆర్సీబీ మంచి స్కోరును సాధించగలిగింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.