IPL 2022 RCB VS GT GLENN MAXWELL LUCKY ESCAPE FROM RASHID KHAN BOWLING AND FANS DEMANDS TO CHANGE THAT RULE SRD
IPL 2022 : ఇంతకన్నా దారుణం మరొకటి ఉందా..? ఆ దిక్కుమాలిన రూల్ మార్చండ్రా బాబు..!
Photo Credit : Twitter
IPL 2022 : తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీకి అదృష్టం కూడా బాగానే మేలు చేసింది. కింగ్ కోహ్లీ (Virat Kohli) రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పుకోగా.. మాక్స్వెల్ గోల్డెన్ డక్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
ఐపీఎల్ 2022 సీజన్ (IPL 2022) లీగ్ స్టేజీ తుది అంకానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్ రేసు కూడా తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది. ఇప్పటికే మూడు స్థానాల్ని ఖరారు అవ్వగా.. మిగిలిన ఒక్క స్థానం కోసం రెండు జట్లు తలపడుతున్నాయ్. ఇక, ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జూలు విదిల్చింది. గుజరాత్ టైటాన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టి ప్లే ఆఫ్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీకి అదృష్టం కూడా బాగానే మేలు చేసింది. కింగ్ కోహ్లీ (Virat Kohli) రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పుకోగా.. మ్యాక్స్‌వెల్(Glenn Maxwell) క్లీన్ బౌల్డ్ అయినా బెయిల్స్ కిందపడకపోవడంతో బతికిపోయాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఆర్సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా రషీద్ ఖాన్ (Rashid Khan) వేసిన 15వ ఓవర్ మూడో బంతికి భారీ షాట్ ఆడే క్రమంలో ఫాఫ్ డుప్లెసిస్ క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ అదృష్టం కొద్ది గోల్డెన్ డక్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.రషీద్ ఖాన్ విసిరిన గూగ్లీని అంచనా వేయడంలో విఫలమైన గ్లేన్ మాక్స్వెల్.. స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో బంతిని మిస్సయ్యాడు.
అది కాస్త నేరుగా వికెట్లను తాకింది. అయితే బెయిల్స్ ఎగిరినప్పటికి అవి కిందపడలేదు. రూల్స్ ప్రకారం బెయిల్స్ కింద పడితేనే బ్యాటర్ ఔట్ అయినట్లు. వరుసగా రెండో వికెట్ తీశానన్న ఆనందంలో ఉన్న రషీద్ అసలు విషయం తెలిసి తల పట్టుకున్నాడు. కీపర్ మాథ్యూ వెడ్ తలపై చేతులు పెట్టుకుని కూర్చోగా.. బంతి కాస్త బౌండరీకి దూసుకెళ్లింది. ఈ అవకాశంతో చెలరేగిన మ్యాక్సీ.. తనదైన స్విచ్ హిట్, రివర్స్ స్వీప్‌లతో గుజరాత్ బౌలర్లను చెడుగుడు ఆడాడు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటైనా.. దినేశ్ కార్తీక్‌తో కలిసి ఆర్సీబీని విజయతీరానికి చేర్చాడు. ఒకవేళ మాక్స్వెల్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగి ఉంటే? ఆర్సీబీ ఒత్తిడికి లోనయ్యేది. గుజరాత్ మళ్లీ రేసులోకి వచ్చి ఉండేది.అయితే.. ఈ సీజన్లో ఇలా జరగడం ఇది రెండోసారి. ఇంతకముందు రాజస్థాన్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో చాహల్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ కూడా ఇలాగే తప్పించుకున్నాడు. బంతి వికెట్లను తాకినప్పటికి బెయిల్స్ కిందపడకపోవడంతో వార్నర్ బతికిపోయాడు.
ఈ క్రమంలో నిబంధనలు మార్చాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బంతి వికెట్లను తాకి బెయిల్స్ కిందపడినా.. పడకపోయినా ఔట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కొన్నిసార్లు ఇవే మ్యాచ్‌ను మలుపుతిప్పుతున్నాయని, మ్యాక్స్‌వెల్ విషయంలో ఇదే జరిగిందని కామెంట్ చేస్తున్నారు. మ్యాక్సీ గోల్డెన్ డక్ నుంచి తప్పించుకొని మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి రూల్ వల్ల జట్ల ఫలితాలే తారుమారు అవుతున్నాయని.. ఇలాంటి సీన్ ఫైనల్ లో రిపీట్ అయితే.. అసలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.