IPL 2022 RCB VS DC LIVE SCORES ROYAL CHALLENGERS BANGALORE VS DELHI CAPITALS MATCH PREVIEW HEAD TO HEAD AND PREDICTED PLAYING XI SJN
IPL 2022: ఢిల్లీతో సై అంటోన్న ఆర్సీబీ.. రికార్డులు ఎవరి వైపు ఉన్నాయంటే..?
రిషభ్ పంత్, డు ప్లెసిస్ (ఫైల్ ఫోటోస్)
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ల ో నేడు డబుల్ హెడర్ మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) తలపడనుండగా.. రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi capitals)తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) సై అంటోంది.
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ల ో నేడు డబుల్ హెడర్ మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) తలపడనుండగా.. రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi capitals)తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) సై అంటోంది. ఈ మ్యాచ్ రాత్రి గం. 7.30 నుంచి వాంఖడే స్టేడియంలో జరగనుంది. గత మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)పై గెలిచిన ఉత్సాహంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings) చేతిలో అనూహ్యంగా ఓడిన బెంగళూరు టీం డీలా పడింది. అయితే ఈ మ్యాచ్ లో ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న బెంగళూరు జట్టు విజయం సాధించాలని పట్టుదలగా ఉంది.
రెండు జట్లను పరిశీలిస్తే.. ఇరు జట్లలోనూ భారీ హిట్టర్లు ఉన్నారు. ఓపెనింగ్ లో ఢిల్లీ జట్టు బలంగా కనిపిస్తుంది. వార్నర్, పృథ్వీ షా జోడీ సూపర్ ఫామ్ లో ఉంది. అయితే మిడిలార్డర్ ఆ జట్టును వేధిస్తోంది. ఇక బౌలింగ్ కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్ లు మరోసారి కీలకం కానున్నారు. కోట్లు పెట్టి తెచ్చుకున్న శార్దుల్ ఠాకూర్ భారీగా పరుగులు ఇస్తున్నాడు. ఇక బెంగళూరు విషయానికి వస్తే ఆ జట్టును నిలకడలేమి కలవర పెడుతోంది. ఓపెనర్లుగా డు ప్లెసిస్, అనుజ్ రావత్ లు ఒక మ్యాచ్ లో ఆడితే మరో మ్యాచ్ లో తేలిపోతున్నారు. అదే సమయంలో కోహ్లీ నుంచి భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. మ్యాక్స్ వెల్, దినేశ్ కార్తీక్ లు ఫామ్ లో ఉన్నారు. అయితే బౌలింగ్ లో మాత్రం ఆ జట్టు బాగా లేదు. చెన్నై తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా సిరాజ్ తేలిపోతున్నాడు. హర్షల్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ అంశం ఆ జట్టుకు ఊరటనిచేదిగా ఉంది.
ముఖాముఖి పోరులో
ముఖాముఖి పోరులో ఆర్సీబీ జట్టుకు అడ్వాంటేజ్ ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 27 మ్యాచ్ లు జరగ్గా అందులో ఆర్సీబీ 16 సార్లు విజయం సాధించింది. ఢిల్లీ 10 సార్లు నెగ్గింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది.. గత సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు సార్లు కూడా ఆర్సీబీనే విజయం వరించింది. ఇక నేటి మ్యాచ్లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగవచ్చు. ఫామ్ లో లేని రోవ్ మన్ పావెల్ స్థానంలో మిచెల్ మార్ష్ ఢిల్లీ జట్టులోకి రావొచ్చు. ఇక సోదరి మరణంతో ఇంటికి వెళ్లిన హర్షల్ పటేల్ ఆకాశ్ దీప్ స్థానంలో తిరిగి ఆర్సీబీ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.