హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - RCB vs CSK : టాస్ గెలిచిన చెన్నై.. CSK ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. జట్టులోకి రూ.8 కోట్ల స్టార్ ప్లేయర్..

IPL 2022 - RCB vs CSK : టాస్ గెలిచిన చెన్నై.. CSK ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. జట్టులోకి రూ.8 కోట్ల స్టార్ ప్లేయర్..

IPL 2022 - RCB vs CSK

IPL 2022 - RCB vs CSK

IPL 2022 - RCB vs CSK : ఇక, ముఖాముఖి పోరులో చెన్నై సూపర్ కింగ్స్ కు తిరుగులేదు. ఇరు జట్ల మధ్య 29 మ్యాచులు జరగగా.. చెన్నై సూపర్ కింగ్స్ 19 గేమ్స్ లో విజయ దుందుభి మోగించింది. ఆర్సీబీ కేవలం 9 మ్యాచుల్లో మాత్రమే నెగ్గింది. మరో.. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు.

ఇంకా చదవండి ...

ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్‌లో ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా సాగుతోంది. ఒక ముంబై ఇండియన్స్ కి తప్ప మిగతా అన్ని జట్లకు ఫ్లే ఆఫ్ బెర్తులు దక్కే అవకాశాలు ఉన్నాయ్. దీంతో.. ఈ సీజన్ లో మరో ఆసక్తికరపోరుకు కాసేపట్లో తెరలేవనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్- ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అమీతుమీ తేల్చుకోనుంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఇక, ఈ మ్యాచులో ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది ధోని సేన. గాయంతో గత మ్యాచులకు దూరమైన రూ.8 కోట్ల ఆటగాడు మొయిన్ అలీ తిరిగి జట్టులో చేరాడు. దీంతో, మిచెల్ శాంట్నర్ పై వేటు పడింది. ఇక, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సేమ్ టీమ్ తో బరిలోకి దిగుతోంది. ఆ జట్టు ఎటువంటి మార్పులు చేయలేదు.

రెండు జట్లకూ కీలకమైన మ్యాచ్ ఇది. పాయింట్ల పట్టికలో 6,9 స్థానాల్లో కొనసాగుతున్నాయి ఆర్సీబీ, సీఎస్కే జట్లు. ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్‌కు అగ్నిపరీక్ష. టోర్నమెంట్ కీలక దశకు చేరుకున్న సమయంలో తనకు అలవాటైన రితీలో మరోసారి విఫలమవుతోంది ఆర్సీబీ. వరుసగా మూడు మ్యాచ్‌లల్లో ఓటమి పాలైంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లల్లో అయిదింట్లో ఓడింది. 10 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. మొదట్లో దూకుడుగా ఆడుతూ వచ్చిన రాయల్ ఛాలెంజర్స్.. వరుసగా మూడింట్లో ఓడటం పిడుగుపాటులా మారింది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలనుకుంటే చెన్నైపై గెలవడం అసవరం.

బౌలర్లు, బ్యాటర్లు విఫలమౌతుండటం ఆర్సీబీని వేధిస్తోంది. ఓపెనర్లు భారీ భాగస్వామ్యాన్ని అందించట్లేదు. గత మ్యాచులో విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావడం ఆర్సీబీకి సానుకూలాంశం. ఈ మ్యాచులో కూడా కోహ్లీ చెలరేగితే ఆర్సీబీకి తిరుగుండదు. ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్ వెల్ స్థాయికి తగ్గ ప్రదర్శనం చేయాల్సి ఉంది. ఆఖర్లో దినేశ్ కార్తీక్, మహీపాల్ లోమ్రర్, షాబాజ్ అహ్మద్ కీలకం కానున్నారు. బౌలింగ్ లో కూడా గత మూడు మ్యాచుల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. వానిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్‌ బౌలింగ్ లో కీలకం కానున్నారు.

మరోవైపు మహేంద్రసింగ్ ధోనీ చేతుల్లోకి చెన్నై సూపర్ కింగ్స్ వెళ్లిన తరువాత ఆ జట్టు స్వరూపమే మారిపోయినట్టు ఉంది. ప్రత్యర్థి ప్లేఆఫ్స్ ఆశలను గండి కొడుతోంది. ధోనీ కేప్టెన్సీ పగ్గాలను అందుకున్న తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది.ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే ఫామ్‌లోకి రావడం చెన్నై సూపర్ కింగ్స్‌ బ్యాటింగ్ కష్టాలను సగం దూరం చేసింది. ఊతప్ప, రాయుడు, శివం దూబే, రవీంద్ర జడేజా, ధోనిలు బ్యాటింగ్ లో కీలకం కానున్నారు. డ్వైన్ ప్రిటోరియస్, మహీష్ తీక్షణ, సిమర్‌జిత్ సింగ్, ముఖేష్ చౌదరిలతో బౌలింగ్ విభాగంలో కీలకం కానున్నారు.

హెడ్ టు హెడ్ రికార్డులు :

ఇక, ముఖాముఖి పోరులో చెన్నై సూపర్ కింగ్స్ కు తిరుగులేదు. ఇరు జట్ల మధ్య 29 మ్యాచులు జరగగా.. చెన్నై సూపర్ కింగ్స్ 19 గేమ్స్ లో విజయ దుందుభి మోగించింది. ఆర్సీబీ కేవలం 9 మ్యాచుల్లో మాత్రమే నెగ్గింది. మరో.. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు.

తుది జట్లు :

చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్-వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, డ్వైన్ ప్రిటోరియస్, మహీష్ తీక్షణ, సిమర్‌జిత్ సింగ్, ముఖేష్ చౌదరి

రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు : ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రార్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వానిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్‌

First published:

Tags: Chennai Super Kings, Cricket, Faf duplessis, Glenn Maxwell, IPL 2022, Mohammed Siraj, MS Dhoni, Ravindra Jadeja, Royal Challengers Bangalore, Virat kohli

ఉత్తమ కథలు