హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 : ఐపీఎల్ లో సీన్ రివర్స్.. మోకరిల్లి అబ్బాయికి అమ్మాయి ప్రపోజ్.. ఆ తర్వాత..

IPL 2022 : ఐపీఎల్ లో సీన్ రివర్స్.. మోకరిల్లి అబ్బాయికి అమ్మాయి ప్రపోజ్.. ఆ తర్వాత..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

IPL 2022 : విదేశీ లీగుల్లో ఎక్కువగా కన్పించే ఈ సంప్రదాయం ఇప్పుడు ఐపీఎల్ కి కూడా పాకింది. అయితే.. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది.

ఐపీఎల్ 2022 (IPL 2022) లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Chennai Super Kings vs Royal Challengers Bangalore) మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఉత్కంఠగా జరుగుతున్న ఈ మ్యాచ్ సమయంలో స్టాండ్స్ లో ఐపీఎల్ లో ఇప్పటివరకు జరగని ఓ ఘటన చోటు చేసుకుంది. దీంతో, అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. సాధారణంగా స్టేడియంలో ఓ వైపు మ్యాచ్​లు జరుగుతుంటే.. మరోవైపు అక్కడే స్టాండ్స్​లో ఉన్న ప్రేమికులు ప్రపోజ్​ చేసుకోవడం వంటివి ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగానే చూస్తున్నాం. అయితే.. గతంలో ఎక్కువగా ఫుట్​బాల్​ లీగ్​లకే పరిమితమైన ఈ సంప్రదాయం ఇప్పుడు క్రికెట్​కూ పాకింది. అయితే, ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ల్లో చోటు చేసుకోవడం మనం చూశాం. కానీ, తొలిసారి ఐపీఎల్ ఇందుకు వేదికైంది. ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య బుధవారం మ్యాచ్​ జరుగుతుండగా ఓ జంట చేసిన పని.. సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

చెన్నై ఛేజింగ్ సమయంలో ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ RCB అభిమాన జంట చేసిన ప‌నిని చూసి.. అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఆ ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఆ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను వైర‌ల్ గా మారింది. ఇంత‌కీ ఏం జ‌రిగింది. నెట్టింట్లో ఎందుకు వైర‌ల్ మారింద‌ని అనుకుంటున్నారా..?

వివ‌రాల్లోకెళ్తే... CSK రన్ ఛేజ్ సమయంలో 11 వ ఓవర్ అప్పుడు కెమెరా కంటికి ఈ ఘటన చిక్కింది. బెంగళూరు అభిమానుల బృందం ఒక చోట గుమిగూడింది. ఇంత‌లో RCB టీషర్ట్ ధరించిన ఓ అమ్మాయి మోకాళ్లపై కూర్చొని తన ప్రియుడికి ప్రపోజ్ చేస్తోంది. ప్రియురాలి ఇచ్చిన స‌ర్ ప్రైజ్ కు కాసేపు ఆశ్చర్యపోతాడు ఆ ప్రియుడు. ఆ తర్వాత చిరునవ్వుతో ప్రేమ ప్రతిపాదనను అంగీకరించి చేయి చాచాడు. అమ్మాయి తన కోరికను కోరుకున్నట్లుగా పొందుతుంది.

ఆమె తర్వాత తన ప్రేమికుడికి ఉంగరాన్ని పొడిగింది. దీని తర్వాత అబ్బాయి ప్రియురాలిని కౌగిలించుకున్నాడు. ఆసక్తికరమైన క్షణం చూసిన వారంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఇప్పుడూ ఈ ఘ‌ట‌న సంబంధించిన వీడియో నెట్టింట్లో వైర‌ల్ గా మారింది. అనేక మంది క్రికెట్ అభిమానులు ఆ జంట‌కు అభినంద‌లు తెలుపుతూ.. ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై భారత మాజీ బ్యాటర్ వసీం జాఫర్ కూడా త‌న‌దైన శైలిలో కామెంట్ చేశారు. RCBకి విధేయుడిగా ఉండగలిగితే, అతను నిస్సందేహంగా తన ప్రేయసికి విధేయుడిగా ఉంటాడని జాఫర్ వ్యాఖ్యానించడం విశేషం.

ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పోరులో ఆర్సీబీ రెచ్చిపోయింది. పుణె స్టేడియం వేదికగా చెన్నై తో జరిగిన పోరులో బెంగళూరు 13 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేసింది. ఈ విక్టరీతో ఆర్సీబీ 12 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది. అయితే, ఈ ఓటమితో చెన్నై అవకాశాలు మరింత సన్నగిల్లాయ్. చెన్నై బ్యాటర్లలో డేవాన్ కాన్వే (37 బంతుల్లో 56 పరుగులు ; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మొయిన్ అలీ ( 27 బంతుల్లో 34 పరుగులు ; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లతో దుమ్మురేపగా.. గ్లెన్ మ్యాక్స్ వెల్ రెండు వికెట్లతో సత్తా చాటాడు.

First published:

Tags: Chennai Super Kings, Cricket, IPL 2022, Love story, Royal Challengers Bangalore, VIRAL NEWS

ఉత్తమ కథలు