Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli) చెత్త ఫామ్ తో అందరి చేత విమర్శలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ పరుగుల కోసం నానా కష్టాలు పడుతున్నాడు. ఐపీఎల్ తొలి ఎడిషన్ 2008లో కేవలం 165 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ.. 2009లో 246 పరుగులు చేశాడు. ఇక అప్పటి నుంచి ప్రతి సీజన్ లోనూ 300లకు పైగానే పరుగులు చేస్తూ వచ్చాడు. కానీ, 2022 సీజన్ లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 13 మ్యాచ్ ల్లో కేవలం 236 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో మూడు గోల్డెన్ డకౌట్స్ ఉండటం విశేషం. ఫలితంగా ఇంటా బయటా కోహ్లీ విపరీతమైన ట్రోల్స్, విమర్శలను ఎదుర్కొంటున్నాడు.
తాజాగా విరాట్ కోహ్లీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆర్సీబీ ఇన్ సైడర్ పేరిట మిస్టర్ నాగ్ చేసే ఫన్నీ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ కాసేపు చిల్ అయ్యాడు. ఈ క్రమంలో నాగ్ విరాట్ కోహ్లీ పూర్ ఫామ్ పై సెటైర్లు కూడా వేశాడు. ఒక ప్రశ్నకు సమాధానంగా కోహ్లీ తనకు పెట్స్ అంటే ఇష్టమని పేర్కొన్నాడు. దాంతో కోహ్లీ వద్ద ఎన్ని పెట్స్ ఉన్నాయంటూ నాగ్ ప్రశ్నించాడు. దానికి సమాధానంగా కోహ్లీ ’ ప్రస్తుతానికి తన వద్ద ఎటువంటి పెట్స్ లేవు‘ అన్నాడు. దీనికి నాగ్ ఇచ్చిన కౌంటర్ కోహ్లీని పగలబడి నవ్వేలా చేసింది. ’లేదు మీ దగ్గర మూడు పెట్స్ ఉన్నాయి. మీకు డక్స్ అంటే ఇష్టమనకుంటా‘అంటూ కోహ్లీ డకౌట్స్ పై సెటైర్ పేల్చాడు. అయితే దీన్ని హూందాగా తీసుకున్న కోహ్లీ.. జీవితంలో తొలిసారి ఇటువంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నానంటూ రిప్లే ఇచ్చాడు.
ఆ తర్వాత ఫ్రీడమ్ గురించి డ్రా చేయాలంటూ కోహ్లీని నాగ్ కోరాడు. దాంతో కోహ్లీ కోండల మధ్య ఒక ఇంటిని, ముగ్గురు వ్యక్తులను డ్రా చేశాడు. భార్య అనుష్క శర్మ. కూతురుతో కలిసి కొండల మధ్య ఒక ఇల్లు కట్టుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడపడమే తనకు స్వేచ్ఛ లాంటిదని కోహ్లీ తెలిపాడు. ఫామ్ కోల్పోయిన కోహ్లీ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు ఈ డ్రాయింగ్ ను చూస్తే అర్థం అవుతుంది. ప్రస్తుతం తనకు క్రికెట్ నుంచి బ్రేక్ కావలనే ఉద్దేశాన్ని కూడా కోహ్లీ తన డ్రాయింగ్ ద్వారా పేర్కొన్నాడని పలువురు అభిమానులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ యూ ట్యూబ్ లో వైరల్ అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Faf duplessis, Glenn Maxwell, IPL, IPL 2022, Kolkata Knight Riders, RCB, Rohit sharma, Royal Challengers Bangalore, Shreyas Iyer, Sunrisers Hyderabad, Team India, Virat kohli