హోమ్ /వార్తలు /క్రీడలు /

Dinesh Karthik : కేజీయఫ్ 3లో దినేశ్ కార్తీక్.? రాకీ భాయ్ కు పోటీగా దినేశ్ భాయ్.! అసలు కథేంది..

Dinesh Karthik : కేజీయఫ్ 3లో దినేశ్ కార్తీక్.? రాకీ భాయ్ కు పోటీగా దినేశ్ భాయ్.! అసలు కథేంది..

దినేశ్ కార్తీక్ (PC : INSTAGRAM)

దినేశ్ కార్తీక్ (PC : INSTAGRAM)

Dinesh Karthik : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మొత్తం కూడా ప్రస్తుతం దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) చుట్టే నడుస్తుంది. 2008 నుంచి ఐపీఎల్ లో ఆడుతున్నా.. కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) జట్టుకు సారథిగా వ్యవహరించినా రానీ క్రేజ్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)కు మారగానే వచ్చేసింది.

ఇంకా చదవండి ...

Dinesh Karthik : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మొత్తం కూడా ప్రస్తుతం దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) చుట్టే నడుస్తుంది. 2008 నుంచి ఐపీఎల్ లో ఆడుతున్నా.. కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) జట్టుకు సారథిగా వ్యవహరించినా రానీ క్రేజ్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)కు మారగానే వచ్చేసింది. మహేంద్ర సింగ్ ధోని (Ms Dhoni), విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)ల కంటే కూడా ఈ సీజన్ లో దినేశ్ కార్తీక్ పాపులారిటీని సాధించాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో చివరగా వస్తూ ఆర్సీబీకి ఫినిషర్ గా మారిపోయాడు. అదిరిపోయే షాట్లతో జట్టుకు అనేక సార్లు ఒంటి చేత్తో విజయాలను అందించాడు.

ఇది కూడా చదవండి  : కార్తీక్ కాకతో వచ్చిన చిక్కల్లా అదే.. అదొక్కటి వదిలేస్తే అతడిని ఆపడం ఎవరి తరం కాదు

దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో సినిమా అంటే కూడా అంతే ఇష్టం. అందుకే చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తమ అభిమానులకు మరింతగా చేరువ కావడానికి సినిమాను మాధ్యమంగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు మహేశ్ బాబు, వవన్ కల్యాన్ సినిమా పోస్టర్లలో తమ ఆటగాళ్లను పెట్టి ప్రచారం చేసుకుంది. తాజాగా ఇదే దారిలో బెంగళూరు జట్టు కూడా ఒక పోస్టర్ ను విడుదల చేసింది. సూపర్ హిట్ కేజీయఫ్ 2 పోస్టర్ తో తమ ఫ్యాన్స్ కు స్పెషల్ కానుక ఇచ్చింది. అయితే ఈ పోస్టర్ లో యశ్ ను కాకుండా దినేశ్ కార్తీక్ ను ఉంచి రిలీజ్ చేసింది. యశ్ ఫేస్ ను దినేశ్ కార్తీక్ తో మార్ఫింగ్ చేసిన ఆర్సీబీ టీం.. కార్తీక్ కు స్మాషింగ్ స్టార్ అనే బిరుదును కూడా ఇచ్చేసింది. సినిమా టైటిల్ DK కాగా.. ’ది చాప్టర్ కంటిన్యూస్‘ అనే కాప్షన్ ను ఇచ్చింది.


యశ్ లుక్ లో ఉన్న దినేశ్ కార్తీక్ లుక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు 54 పరుగులతో ఓటమి పాలైంది. దాంతో 14 పాయింట్లతో లీగ్ టేబుల్లో 4వ స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఈ నెల 19న గుజరాత్ తో జరిగే మ్యాచ్ లో ఆర్సీబీ తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఆఖరి మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు ఏ విధంగా ఆడుతుందో చూడాలి.

First published:

Tags: Dinesh Karthik, IPL, IPL 2022, KGF, KGF Chapter 2, MS Dhoni, RCB, Rohit sharma, Royal Challengers Bangalore, Sun risers hyderabad, Virat kohli, Yash

ఉత్తమ కథలు