హోమ్ /వార్తలు /క్రీడలు /

RCB : ఆర్సీబీ కోసం ప్రాణం పెడుతోన్న ప్లేయర్స్.. ఆ బౌలర్ అయితే ఏకంగా కుట్లతోనే బౌలింగ్..

RCB : ఆర్సీబీ కోసం ప్రాణం పెడుతోన్న ప్లేయర్స్.. ఆ బౌలర్ అయితే ఏకంగా కుట్లతోనే బౌలింగ్..

హర్షల్ పటేల్ (PC : TWITTER)

హర్షల్ పటేల్ (PC : TWITTER)

RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆరంభమై ఇప్పటికే 14 సీజన్లను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 15వ సీజన్ జరుగుతోంది. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) 5 సార్లు, చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) 4 సార్లు చాంపియన్ గా నిలువగా.. కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) రెండు సార్లు కప్పును సొంతం చేసుకుంది.

ఇంకా చదవండి ...

RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆరంభమై ఇప్పటికే 14 సీజన్లను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 15వ సీజన్ జరుగుతోంది. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) 5 సార్లు, చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) 4 సార్లు చాంపియన్ గా నిలువగా.. కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) రెండు సార్లు కప్పును సొంతం చేసుకుంది. ఇక డెక్కన్ చార్జర్స్, రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఒక్కోసారి టైటిల్ ను నెగ్గాయి. అయితే హేమా హేమీలతో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)కు మాత్రం ప్రతి సీజన్ లోనూ నిరాశే ఎదురైంది. 2016లో ఫైనల్ వరకు చేరినా.. చివరి మెట్టుపై బోల్తా పడింది. ఇక తాజా సీజన్ లో మాత్రం ఆర్సీబీ అద్భుత ఆటతీరును కనబరుస్తోంది. కప్పు గెలవాలనే కసి ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి  : కోహ్లీ కోసం వచ్చాడు.. అడ్డంగా బుక్ అయ్యాడు.. తమదైన స్టైల్ లో బుద్ది చెప్పిన పోలీసులు

గత కొన్ని సీజన్లుగా ఆర్సీబీకి విరాట్ కోహ్లీ వెన్నెముకగా ఉన్నాడు. అయితే ఈ సీజన్ లో మాత్రం పెద్దగా రాణించలేదు. అయినప్పటికీ అద్భుత ఆటతీరుతో క్వాలిఫయర్ 2 వరకు చేరుకుంది. ఇందుకు కారణం జట్టులోని ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా ఆడుతుండటంతోనే. కోల్ కతా వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన పోరులో ఆర్సీబీ అద్బుత విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్ లో రజత్ పటిదార్ సూపర్ సెంచరీకి బౌలింగ్ లో హర్షల్ పటేల్ మ్యాజిక్ పనిచేయడంతో లక్నోను ఓడించిన ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ కు రెండడుగుల దూరంలో నిలిచింది. మ్యాచ్ అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూంలో సంబరాలు చేసుకోగా.. హర్షల్ పటేల్ నమ్మలేని నిజాన్ని బయటపెట్టాడు. ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్ లో హర్షల్ పటేల్ కుడి చేతికి గాయం అయ్యింది. దాంతో అతడి చేతికి కుట్లు కూడా వేశారు. దాంతో హర్షల్ మిగిలిన మ్యాచ్ లకు దూరమయ్యాడని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా అతడు ఎలిమినేటర్ మ్యాచ్ కు సిద్ధం అయ్యాడు. మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన అతడు కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. మ్యాచ్ అనంతరం తన గాయం గురించి హర్షల్ పటేల్ వివరించాడు. కుట్లతోనే బౌలింగ్ చేసినట్లు పేర్కొన్నాడు. లక్కీగా చేతికి ఉన్న కుట్లు ఊడిరాలేదని పేర్కొన్నాడు.


ఎలిమినేటర్ మ్యాచ్ లో విజయం సాధించిన ఆర్సీబీ జట్టు క్వాలిఫయర్ 2కు అర్హత సాధించింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన రాజస్తాన్ రాయల్స్ తో ఆర్సీబీ తలపడనుంది. నేడు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్ లో గుజరాత్ టైటాన్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది.

First published:

Tags: Faf duplessis, Gautam Gambhir, Glenn Maxwell, IPL, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, Rajasthan Royals, Ravichandran Ashwin, RCB, Royal Challengers Bangalore, Sanju Samson, Virat kohli

ఉత్తమ కథలు