హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - RCB : ఏప్రిల్ 23 అంటేనే వణికిపోతున్న ఆర్సీబీ.. కారణం ఇదే!

IPL 2022 - RCB : ఏప్రిల్ 23 అంటేనే వణికిపోతున్న ఆర్సీబీ.. కారణం ఇదే!

RCB (IPL Twitter)

RCB (IPL Twitter)

IPL 2022 - RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ఒక జట్టును ప్రత్యర్థులే కాదు ఒక తేదీ కూడా హడలెత్తిస్తోంది. ఆ తేదీని తలుచుకుంటే చాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) గడగడలాడిపోతుంది. అవును.. ఇది విడ్డూరంగా ఉన్నా నిజం.

ఇంకా చదవండి ...

IPL 2022 - RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ఒక జట్టును ప్రత్యర్థులే కాదు ఒక తేదీ కూడా హడలెత్తిస్తోంది. ఆ తేదీని తలుచుకుంటే చాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) గడగడలాడిపోతుంది. అవును.. ఇది విడ్డూరంగా ఉన్నా నిజం. ఎందుకంటే ఆ రోజున ఆర్సీబీ అత్యంత చెత్త ప్రదర్శనను ఒకసారి కాదు ఏకంగా రెండు సార్లు నమోదు చేసింది. జట్టులో  ధనాధన్ బ్యాటర్లు.. గొప్ప బౌలర్లు ఉన్నా సరే.. ఆ రోజున మ్యాచ్ ఆడితే చాలు చెత్త ప్రదర్శన చేయాల్సిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును అంతగా భయపెడుతోన్న ఈ తేదీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి : సన్ రైజర్స్ ను చూసి తీన్ మార్ ఆడుతోన్న కావ్య .. ఫోటోలు వైరల్

ఏప్రిల్ 23న మ్యాచ్ జరుగుతుందంటే.. ఆర్సీబీకి చెమటలు పడుతున్నాయి. ఎంతటి గొప్ప ఫామ్ లో ఉన్నా.. ఎంతటి భీకర ప్లేయర్స్ జట్టులో ఉన్నా ఆ రోజు మ్యాచ్ ఆడితే మాత్రం ఆర్సీబీ చెత్త ప్రదర్శన చేయడం ఖాయం అనే భావనలోకి ఆ జట్టు అభిమానులు వెళ్లిపోయారు. శనివారం (ఏప్రిల్ 23న) సన్ రైజర్స్ హైదరాబాద్ తో బెంగళూరు జట్టు తలపడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో బెంగళూరు జట్టు 9 వికెట్లతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. టోర్నీలో బెంగళూరు జట్టు ఆట మరీ అంత తీసికట్టుగా ఏం లేదు. కేవలం విరాట్ కోహ్లీ ఫామ్ మాత్రమే కాస్త ఆందోళన కలిగిస్తోంది. సీజన్ లోనే మోస్ట్ సెటిల్డ్ టీంగా ఆర్సీబీ ఉంది. అయితేనేం హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఘోర ప్రదర్శనను చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 16.1 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ మరోసారి గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. సరిగ్గా ఐదేళ్ల క్రితం 2017లోనూ ఏప్రిల్ 23న కోల్ కతా నైట్ రైడర్స్ తో బెంగళూరు జట్టు మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ లో కేకేఆర్ విసిరిన 131 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 49 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ లో ఇప్పటి వరకు కూడా ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా ఆర్సీబీ కేవలం 68 పరుగులు మాత్రమే చేసి ఘోర ఓటమిని ఎదుర్కొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే 2013 ఏప్రిల్ 23న పుణే వారియర్స్ తో ఆర్సీబీ మ్యాచ్ ఆడగా అందులో గేల్ విశ్వరూపం చూపించాడు. 175 పరగులతో అజేయంగా నిలిచాడు. దాంతో బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 263 పరుగులు చేసింది. ఐపీఎల్ లో అత్యధిక పరుగుల రికార్డు, అత్యల్ప పరుగుల రికార్డును ఆర్సీబీనే కలిగి ఉండటం.. అది కూడా ఒకే రోజు (ఏప్రిల్ 23న) చేయడం విశేషం.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Faf duplessis, Glenn Maxwell, IPL, IPL 2022, Royal Challengers Bangalore, Sachin Tendulkar, Sunrisers Hyderabad, Virat kohli

ఉత్తమ కథలు