ఇండియన్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒక సంచలనం. టీమిండియా (Team India)లోకి వచ్చీ రావడంతోనే సెంచరీల మీద సెంచరీలతో కదంతొక్కిన ఘనుడు. రన్ మిషీన్ గా పేరు గాంచిన కోహ్లీ.. సచిన్ రికార్డులను బద్దలు కోట్టే సత్తా గల క్రికెటర్ అంటూ అందరి చేత మన్నలను అందుకున్నాడు. అనతి కాలంలోనే మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) వారసుడిగా టీమిండియాకు అన్ని ఫార్మాట్లలోనూ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఇక హెడ్ కోచ్ గా రవిశాస్త్రి ఉన్నంత కాలం తాను ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు కోహ్లీ హవా నడిచింది. అయితే కాలం మారింది. గత రెండున్నరేళ్లుగా ఒక్క అంతర్జాతీయ సెంచరీ చేయలేకపోయిన కోహ్లీ.. ఇప్పుడు పరుగులు చేసేందుకు కూడా ఆపసోపాలు పడుతున్నాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ (IPL 2022)లో కోహ్లీ లోనే అత్యంత చెత్త ప్రదర్శన చేస్తున్నాడు.
ఇక, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ విరాట్(14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 20) మళ్లీ దురదృష్టవశాత్తు ఔటయ్యాడు. 2 ఫోర్లు, ఓ భారీ సిక్సర్‌తో దూకుడుగా ఆడిన విరాట్..చివరకు విధిరాతకు బలయ్యాడు. కగిసో రబడా వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో ఏమాత్రం ఊహించని రీతిలో పెవిలియన్ చేరాడు. ఆ ఓవర్ రెండో బంతిని కగిసో రబడా షార్ట్ పిచ్‌గా వేయగా.. విరాట్ ఫుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే ఆ స్లోయర్ బంతిని అంచనా వేయడంలో విరాట్ విఫలమయ్యాడు.
Never seen him like this 🥺💔 @imVkohli pic.twitter.com/cikv9lFZnH
— Hemanth Teju (@HemanthTeju17) May 13, 2022
దీంతో బంతి అతని డొక్కలో తాకి గాల్లోకి లేచి షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్న రాహుల్ చాహర్ చేతిలో పడింది. దీంతో.. పంజాబ్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు. విరాట్ మాత్రం ఔట్ కాదని, డొక్కలో తాకిందని సైగ చేస్తూ కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడు. కానీ రిప్లేలో బంతి బ్యాట్‌ను మిస్సై అతని గ్లోవ్స్‌ను ముద్దాడినట్లు కనిపించింది. స్నీకో మీటర్‌లో గీత రావడంతో థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఇక ఇలా ఔటవ్వడంపై విరాట్ కోహ్లీ మరో సారి తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఆకాశం వైపు చూస్తూ ఆ దేవుడికి తన బాధను వ్యక్తం చేశాడు. 'ఓ విధాత.. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది.. ' అనేలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మైదానం వీడాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. విరాట్ కోహ్లీ అభిమానులు బాధను వ్యక్తం చేస్తున్నారు.
Have some mercy god
Have some mercy 💔#ViratKohli𓃵 #RCBvsPBKS pic.twitter.com/BONlcBqVXx
— Shrasti ~ Proud Shipper ❤ (@_Itzz_shraa) May 13, 2022
ఇక, ఈ వీడియోను చూసి ఫ్యాన్స్ కోహ్లీని ఇలా చూడటం కష్టమే భయ్యా అని కామెంట్లు చేస్తున్నారు. ఓ దేవుడా కోహ్లీపై నీకస్సలు దయ లేదా అంటూ ఆ దేవుణ్ని నిందిస్తున్నారు.ఈ సీజన్ లో మూడు పర్యాయాలు గోల్డెన్ డక్ గా అవుటై.. మరో రెండు సార్లు రనౌట్ రూపంలో పెవిలియన్ కు చేరుకున్నాడు. అర్ధ సెంచరీ చేసినా వన్డే తరహా ఇన్నింగ్స్ అంటూ సొంత అభిమానుల నుంచే విమర్శలు ఎదుర్కొన్నాడు.విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 13 మ్యాచ్‌లు ఆడి కేవలం 236 పరుగులే చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IPL 2022, Punjab kings, Royal Challengers Bangalore, Virat kohli