హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022: రవీంద్ర జడేజా కీలక నిర్ణయం.. MS ధోనీకి CSK బాధ్యతలు..

IPL 2022: రవీంద్ర జడేజా కీలక నిర్ణయం.. MS ధోనీకి CSK బాధ్యతలు..

ధోని,రవీంద్ర జడేజా

ధోని,రవీంద్ర జడేజా

IPL 2022: MS ధోనీకి CSK కెప్టెన్సీని తిరిగి అప్పగించిన రవీంద్ర జడేజా అప్పగిస్తు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

IPL 2022: ఐపీఎల్ 2022 లో కీలక పరిణామం చోటు చేసుకుంది.  జార్ఖండ్ డైనమెట్  MS ధోనీకి CSK కెప్టెన్సీని తిరిగి అప్పగిస్తు రవీంద్ర జడేజా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. జడేజా తన ఆటపై మరింత దృష్టి కేంద్రీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్‌లో రవీంద్ర జడేజా అంతగా రాణించ లేకపోయారు. చాలా మ్యాచ్ లలో పేలవమైన ప్రదర్శనను కనబర్చాడు. దీంతో కెప్టెన్సీ నుంచి వైదోలగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


ఇక మీదట చెన్నై సూపర్ కింగ్స్‌కు మళ్లీ నాయకత్వం వహించమని MS ధోనీని, రవీంద్ర జడేజా అభ్యర్థించాడు. జడేజా తన ఆటపై మరింత దృష్టి కేంద్రీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక రవీంద్ర జడేజా అభ్యర్థన పట్ల ఎంఎస్ ధోని సానుకూలంగా స్పందించాడు. మరోసారి CSK బాధ్యతలు చేపట్టాడటానికి అంగీకరించాడు. 2021 ఛాంపియన్లు ఏప్రిల్ 12న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై తమ మొదటి విజయాన్ని సాధించడానికి ముందు వరుసగా వారి మొదటి నాలుగు గేమ్‌లను కోల్పోయిన కారణంగా ఒక సీజన్‌లో వారి చెత్త ప్రారంభానికి గురయ్యారు. జడేజా, CSK తమ తదుపరి మూడు గేమ్‌లలో మరో రెండు మ్యాచ్‌లను కోల్పోయి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచారు. దీంతో తదుపరి అన్ని CSK మ్యాచ్ లకు ధోనినే కెప్టెన్ గా ఉంటారని యజమాన్యం ప్రకటించింది.

IPL 2022 : దక్షిణాఫ్రికా క్రికెటర్ క్వింటన్ డికాక్ (quinton de kock) ఇతర క్రికెటర్లకు మార్గదర్శిగా నిలిచాడు.

పంజాబ్ కింగ్స్ (Punjab KIngs)తో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) ఓపెనర్ క్వింటన్ డికాక్ చేసిన ఒక పని అతడిని అందరూ శభాష్ అనేలా చేస్తోంది. క్రికెట్ ను ఎందుకు జెంటిల్ మెన్ గేమ్ అంటారో మరోసారి క్వింటన్ డికాక్ ప్రపంచానికి చాటాడు. క్రికెట్ లో DRS అందుబాటులోకి రావడంతో అవుట్ విషయంలో ఇంతకుముందులా టీమ్స్ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక వేళ అవుట్ ను ఆన్ ఫీల్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించినా..  ప్రత్యర్థి టీం DRSకి వెళ్లి ఖచ్చితమైన నిర్ణయాన్ని సాధించే అవకాశం ఉంది.

వుటైనా జట్టును నడిపించాడు. 46 పరుగులు చేసి అర్ధ సెంచరీ వైపు సాగాడు. అయితే ఇన్నింగ్స్ 13వ ఓవర్ ను సందీప్ శర్మ వేయడానికి వచ్చాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని డికాక్ కట్ షాట్ ఆడబోయాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్ ను తాకుతూ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దాంతో సందీప్ శర్మతో పాటు టీం మొత్తం అవుట్ కోసం అప్పీల్ చేసింది. అయితే ఆన్ ఫీల్డ్ అంపైర్ దానిని నాటౌట్ గా ప్రకటించాడు. కానీ, క్వింటన్ డికాక్ మాత్రం అంపైర్ నిర్ణయాన్ని పట్టించుకోకుండా తనకు తానుగా పెవిలియన్ వైపు నడిచాడు. డికాక్ నిజాయితీకి అక్కడే ఉన్న సందీప్ శర్మ కూడా మెచ్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను మీరూ చూడండి.

First published:

Tags: Csk, IPL 2022, MS Dhoni

ఉత్తమ కథలు