Home /News /sports /

IPL 2022 RAVICHANDRAN ASHWIN CHEST BUMP CELEBRATION GOES VIRAL AFTER DEFEATING CHENNAI SUPER KINGS SJN

IPL 2022 : వామ్మో నీలో ఇంత ఆవేశం ఉందా సామీ.. అలా బాదుకుంటే ఎలా? అశ్విన్ వెరైటీ సెలబ్రేషన్

అశ్విన్ (PC : IPL)

అశ్విన్ (PC : IPL)

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) బ్యాట్ తో రాణిస్తున్నాడు.

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) బ్యాట్ తో రాణిస్తున్నాడు. మొన్నటి వరకు స్పిన్నర్ గా మాత్రమే అలరించిన అతడు.. ఈసారి ఐపీఎల్ లో మాత్రం బ్యాట్ తోనూ అదరగొడుతున్నాడు. మొన్నటి వరకు బౌలర్ గా మాత్రమే ఉన్న అతడు.. ఐపీఎల్ 2022తో ఆల్ రౌండర్ గా కూడా మారిపోయాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో జరిగిన మ్యాచ్ లో 23 బంతుల్లో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టుకు అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు. అంతేకాకుండా రాజస్తాన్ కు లీగ్ టేబుల్ లో రెండో స్థానాన్ని కట్టబెట్టాడు.

ఇది కూడా చదవండి : అప్పుడు కోహ్లీ భార్య విషయంలో.. ఇప్పుడు హెట్ మైర్ సతీమణి విషయంలో.. మళ్లీ నోరు జారిన గావస్కర్

పిచ్ బౌలింగ్ కు సహకరించడంతో చెన్నైలాగే రాజస్తాన్ రాయల్స్ కూడా తడబడింది. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కీ బ్యాటర్స్ పెవలియన్ కు చేరారు. అయితే జట్టుకు అవసరమైన చోట క్రీజులోకి వచ్చిన అశ్విన్.. మంచి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఒత్తిడి సమయంలో బ్యాక్ వర్డ్ పాయింట్ దిశగా  షాట్ కొట్టి బౌండరీ సాధించిన అశ్విన్.. అనంతరం  చేసుకున్న సెలబ్రేషన్ ఇప్పుడు వైరల్ గా మారింది. తన పడికిలితో గుండెను బాదుకుంటూ.. ఎన్నడూ లేని విధంగా అశ్విన్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. వామ్మో అశ్విన్ ల ో ఇంత ఆవేశం ఉంటుందా అని ఫ్యాన్స్ అనుకోవడం విశేషం.





రాజస్తాన్ విజయం సాధించిన తర్వాత కూడా కమాన్ కమాన్ అంటూ అశ్విన్ రెచ్చిపోయాడు. ఈ విజయంతో రాజస్తాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ మూడో స్థానంలో నిలిచింది. ఇక నాలుగో స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ జట్లు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతానికి అయితే ఆర్సీబీ 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. అయితే నేడు ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ తో ఆడనుంది. ఇందులో గనుక ఢిల్లీ క్యాపిటల్స్ నెగ్గితే ఆర్సీబీ ఇంటి దారి పట్టడం ఖాయం. ఇక టాప్ 2లో నిలిచిన రెండు జట్లకు ఫైనల్ చేరేందుకు రెండు అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలో గుజరాత్, రాజస్తాన్ రాయల్స్ కు తుది పోరుకు చేరుకునేందుకు రెండు అవకాశాలు ఉంటాయి.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, IPL, MS Dhoni, Rajasthan Royals, Ravichandran Ashwin, Sanju Samson

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు