హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022: సూపర్ బిష్ణోయ్ నీ తెలివికి హ్యాట్సాఫ్... ట్రాప్ చేసి మరీ వార్నర్ ను...

IPL 2022: సూపర్ బిష్ణోయ్ నీ తెలివికి హ్యాట్సాఫ్... ట్రాప్ చేసి మరీ వార్నర్ ను...

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ (ravi bishnoi) అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో నాలుగు వికెట్లు తీశాడు.

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ (ravi bishnoi) అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో నాలుగు వికెట్లు తీశాడు. వికెట్లు తక్కువే తీసినా పొదుపుగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి భారీ స్కోరు సాధించకుండా తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. సీజన్ లో రవి బిష్ణోయ్ ఎకానమీ రేటు 6.81గా ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)తో జరిగిన మ్యాచ్ లో రవి బిష్ణోయ్ అద్బుత బంతితో వార్నర్ (David Warner) ను అవుట్ చేశాడు. వార్నర్ ను అవుట్ చేయడం కంటే కూడా అతడే వికెట్ ను సమర్పించుకునేలా చేశాడు అంటే కరెక్ట్ గా ఉంటుందేమో.

లక్నో తో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు పృథ్వీ షా శుభారంభం చేశాడు. అతడి దూకుడు వల్ల ఢిల్లీ భారీ స్కోరు చేసేలా కనిపించింది. పృథ్వీ షా దూకుడుగా ఆడుతుండటంతో మరో ఎండ్ లో ఉన్న వార్నర్... అతడికి స్ట్రయిక్ ఇవ్వడానికే ప్రాధాన్యం ఇచ్చాడు. అయితే 61 పరుగుల వద్ద పృథ్వీ షా అవుటయ్యాడు. ఇక వార్నర్ తన బ్యాట్ కు పనిచెప్పాల్సిన సమయంలో... బౌలింగ్ కు వచ్చిన బిష్ణోయ్ వార్నర్ ను ట్రాప్ చేసి మరీ వికెట్ సమర్పించుకునేలా చేశాడు. 9వ ఓవర్ వేయడానికి బిష్ణోయ్ బౌలింగ్ కు వచ్చాడు. మూడో బంతిని వేయబోతుండగా... వార్నర్ స్విచ్ హిట్ కోసం ప్రయత్నించినట్లు కనిపించాడు. దాంతో క్షణాల్లో తన వ్యూహాన్ని మార్చిన బిష్ణోయ్ లెగ్ స్టంప్ కు దూరంగా బంతిని వేశాడు. దాంతో వార్నర్ స్విచ్ హిట్ సాధ్యపడలేదు. అదే సమయంలో షాట్ కొట్టాలనే ప్రయత్నంలో డేవిడ్ వార్నర్ బ్యాలెన్స్ తప్పి దూరంగా వెళ్తున్న బంతిని వేటాడు. బంతి బ్యాట్ కు తగిలి బ్యాక్ వర్డ్ పాయింట్ లో ఉన్న బదోని చేతిలో వెళ్లి పడింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయాయి. బదోని క్యాచ్ అందుకోగానే... అయ్యో అంటూ వార్నర్ నిరాశగా పెవిలియన్ కు చేరాడు. వార్నర్ మ్యాచ్ లో 12 బంతులు ఆడి 4 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ తర్వాత గూగ్లీ తో రోవ్ మన్ పావెల్ (3) వికెట్ ను కూడా బిష్ణోయ్ తీశాడు.

ఈ మ్యాచ్ లో లక్నో జట్టు 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 149 పరుగులు చేసింది. అనంతరం క్వింటన్ డికాక్ 80 పరుగులతో చెలరేగడంతో లక్నో జట్టు 19.4 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి టార్గెట్ ను ఛేదించేసింది.

First published:

Tags: David Warner, Delhi Capitals, IPL, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, Rishabh Pant

ఉత్తమ కథలు