Home /News /sports /

IPL 2022 RAJASTHAN ROYALS TEAM NEWS YUZVENDRA CHAHAL RECALLS HOW A DRUNK MUMBAI INDIANS TEAMMATE ALMOST KILLED HIM IN 2013 SJN

IPL 2022: తాగిన మైకంలో నన్ను చంపబోయాడు... ముంబై ఇండియన్స్ ప్లేయర్ పై యుజువేంద్ర చహల్ సంచలన కామెంట్స్

చహల్ (PC: Rajasthan Royals)

చహల్ (PC: Rajasthan Royals)

IPL 2022: రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) స్టార్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ (yuzvendra chahal) తన జీవితంలో ఎదురైన ఒక చేదు సంఘటను గుర్తు చేసుకున్నాడు. తాను ఏ విధంగా ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నానో వివరించాడు.

IPL 2022: రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) స్టార్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ (yuzvendra chahal) తన జీవితంలో ఎదురైన ఒక చేదు సంఘటను గుర్తు చేసుకున్నాడు. తాను ఏ విధంగా ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నానో వివరించాడు. చహల్ మీదకు దోపిడీ దొంగలో లేక రౌడీలో దాడి చేయలేదు. సొంత ఐపీఎల్ (IPL) జట్టు సభ్యుడే ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించాడు. సరదాగా ఆరంభమైనది కాస్తా చహల్ ప్రాణం మీదకు తెచ్చింది. నాటి సంఘటనపై చహల్ తాజాగా పెదవి విప్పాడు. ప్రస్తుతం చహల్ రాజస్తాన్ రాయల్స్ జట్టు తరఫున 2022 ఐపీఎల్ సీజన్ లో ఆడుతున్నాడు. ఈ క్రమంలో రాజస్తాన్ జట్టు ఏర్పాటు చేసిన కమ్ బ్యాక్ టేల్స్ కార్యక్రమంలో చహల్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా గతంలో తనకు జరిగిన ఓ చేదు సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా రవిచంద్రన్  అశ్విన్ వ్యవహరించాడు.

చహల్ జీవితంలో ఆ చేదు సంఘటన 2013లో చోటు చేసుకుంది. ’2013లో ఆ ఘటన చోటు చేసుకుంది. అప్పుడు నేను ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టుకు ఆడుతున్నాను. మేం బెంగళూరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ ఆడాం. దాని తర్వాత టీం సభ్యులమంతా కూడా ఒక రూంలో గెట్ టు గెదర్ అయ్యాం. అప్పుడు ముంబై ఇండియన్స్ లోని ఓ సభ్యుడు (పేరు చెప్పడానికి చహల్ ఇష్టపడలేదు) ఫుల్ గా తాగి నా వద్దకు వచ్చాడు. అనంతరం నన్ను అమాంతం పైకెత్తి... బాల్కనీ నుంచి కిందకి వేలాడదీశాడు. నేను అతడి మెడను పట్టుకుని గట్టిగా అరుస్తున్నా. అతడి మెడ నుంచి నా చేతులు జారిపోతే... నేను 15వ ఫ్లోర్ నుంచి కింద పడిపోయే అవకాశం ఉంది. అలా అరుస్తూ ఉండగా... ఇతర టీం సభ్యులు వెంటనే వచ్చి నన్ను కాపాడారు. ఆ షాక్ లో నేను స్పృహ కోల్పోయాను. అదో దారుణమైన సంఘటన‘ అంటూ తన ప్రాణం మీదకు తెచ్చిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు.



2011లో కూడా చహల్ ఇటువంటి ప్రమాదాన్నే ఎదుర్కొన్నాడు. అప్పుడు బాగా తాగిన ఆసీస్ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్, న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ చహల్ కాళ్లు చేతులు కట్టేశారు. అలానే అతడిని రూంలో వదిలి వెళ్లిపోయారు. ఉదయం రూం క్లీనింగ్ చేసే ఆమె వచ్చి చహల్ కాళ్లు చేతులకు ఉన్న తాడును విప్పింది.



ఈ కార్యక్రమంలో కరుణ్ నాయర్ కూడా పాల్గొన్నాడు. అతడు కూడా తన జీవితంలో ఎదురైన భయంకర సంఘటన గురించి వివరించాడు. మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళ్తూ తాను ఏ విధంగా పడవ ప్రమాదంలో చిక్కుకుపోయాడో వివరించాడు. రాజస్తాన్ రాయల్స్ టోర్నీలో దూకుడు మీదు ఉంది. అటు బ్యాటింగ్ ,ఇటు బౌలింగ్ లో బలంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: IPL, IPL 2022, Mumbai Indians, Rajasthan Royals, Ravichandran Ashwin, Royal Challengers Bangalore

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు