Home /News /sports /

IPL 2022 RAJASTHAN ROYALS STAR PLAYER SHIMRON HETMYER TRAVEL BACK TO GUYANA FOR THE IMMINENT BIRTH OF HIS FIRST CHILD SRD

Rajasthan Royals : రాజస్థాన్ కు భారీ షాక్.. బుడగ దాటిన రూ. 8.50 కోట్ల స్టార్ ఆటగాడు.. రీజన్ ఇదే..

రాజస్తాన్ రాయల్స్ (IPL twitter)

రాజస్తాన్ రాయల్స్ (IPL twitter)

Rajasthan Royals : ఈ సీజన్ లో 11 మ్యాచ్‌లాడిన రాజస్థాన్ (Rajasthan Royals) టీమ్.. ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్ ఇంకా మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ సమయంలో కీలక ఆటగాడు దూరమవ్వడం ఆ జట్టుకు పెద్ద లోటే అని చెప్పాలి.

ఇంకా చదవండి ...
    ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్‌లో ప్లే ఆఫ్ రేస్ ఉత్కంఠ స్థాయికి చేరుకుంది. టాప్ -4 లో ప్లేస్ దక్కించుకోవడానికి ఒక ముంబై (Mumbai Indians) తప్ప మిగతా జట్లన్నీ హోరాహోరీగా పోరాడుతున్నాయ్. ఇక, ఈ సీజన్ లో 11 మ్యాచ్‌లాడిన రాజస్థాన్ (Rajasthan Royals) టీమ్.. ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. మే 22న టోర్నీ లీగ్ దశ మ్యాచ్‌లు ముగియనుండగా.. రాజస్థాన్ ఇంకా లీ దశలో 3 మ్యాచ్‌లు ఆడనుంది. ఇలాంటి కీలకం సమయంలో ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. రాజస్థాన్ రాయల్స్ స్టార్ హిట్టర్ షిమ్రాన్ హెట్‌మయర్(Shimron Hetmyer) తన తొలి బిడ్డ బర్త్ కోసం ఐపీఎల్ నుంచి తాత్కాలికంగా వైదొలిగాడు. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. వెస్టిండీస్‌లోని గయానాకు తిరిగి వెళ్లనున్న హెట్‌మయర్ అతని బిడ్డ పుట్టాక తిరిగి ఇండియాకు వచ్చి జట్టులో చేరుతాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్ సంచలన విజయాల్లో హెట్‌మెయర్ కీలక పాత్ర పోషించాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ.. జట్టు గెలుపు కోసం చివర్లో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.

    'షిమ్రాన్ హెట్‌మయర్ తన మొదటి బిడ్డ బర్త్ కోసం ఈరోజు తెల్లవారుజామున గయానాకు వెళ్లాడు. ఈ శుభసందర్భంలో మేము అతనికి మా అభినందనలు తెలుపుతున్నాం. అతనికి మరియు అతని భార్య నిర్వాణికి మా శుభాకాంక్షలు. బిడ్డ బర్త్ అనంతరం షిమ్రాన్ ముంబైకి తిరిగి రావాలని, మళ్లీ జట్టులో చేరి రాయల్స్ బ్యాటింగ్‌ను తన బ్యాటింగ్‌తో దుర్భేద్యం చేయాలని కోరుకుంటున్నాము. అతని రాక కోసం మేము ఎదురుచూస్తుంటాం. ఆల్ ది బెస్ట్, హెటీ. ఈసారి తండ్రిగా మిమ్మల్ని తిరిగి చూడబోతున్నాం' అంటూ రాజస్థాన్ రాయల్స్ తన ప్రకటనలో పేర్కొంది.


    ఈ సీజన్‌లో హెట్‌మయర్ ఇప్పటివరకు 11 మ్యాచ్‌లలో 291 పరుగులు చేశాడు. అతని సగటు 70కాగా, స్ట్రైక్ రేట్ 160గా ఉంది. ఒక ప్లేయర్‌గా హెట్‌మయర్ ఎంత సమర్థుడో ఈ గణాంకాలు చెబుతాయి. ఇక ఐపీఎల్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో హెట్‌మయర్ తాత్కాలికంగా జట్టుకు దూరం కావడం కాస్త లోటే అని చెప్పాలి. ఆర్ఆర్ మరో విజయం సాధిస్తే దాదాపు ప్లేఆఫ్ రేసుకు చేరుకుంటుంది. ఇంకా ఆర్ఆర్‌కు మూడు మ్యాచ్‌లు ఉన్నాయి.

    అతను లోయర్ ఆర్డర్‌లో ఉండడం జట్టు బ్యాటింగ్ లైనప్‌ స్ట్రాంగ్ గా ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ తో జరిగిన పోరులో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 16 బంతుల్లో అజేయంగా 31పరుగులు చేశాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్.. పంజాబ్ కింగ్స్‌ను శనివారం ఆరు వికెట్ల తేడాతో ఓడించగలిగింది. ఐపీఎల్ వేలంలో ఈ పవర్ ఫుల్ హిట్టర్ ని రూ.8.50 కోట్లకు కొనుగోలు చేసింది రాజస్థాన్. అందుకు తగ్గట్టుగానే తన సూపర్ బ్యాటింగ్ తో రాజస్థాన్ అంచనాల్ని నిలబెడుతున్నాడు హెట్‌మయర్.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, IPL 2022, Rajasthan Royals, Sanju Samson, West Indies

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు