IPL 2022 RAJASTHAN ROYALS PLAYERS JOS BUTTLER AND RIYAN PARAG TAKES STUNNING TAG TEAM CATCH NEAR BOUNDARY LINE AGAINST LSG SJN
Jos Buttler : నువ్వు తోపు సామీ.. క్యాచ్ విషయంలో బట్లర్ సమయస్ఫూర్తికి ఫ్యాన్స్ ఫిదా..
బట్లర్ క్యాచ్ (PC : TWITTER)
Jos Buttler : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) ప్లేయర్ జాస్ బట్లర్ (Jos Buttler) అదరగొడుతున్నాడు. ఇప్పటికే మూడు భారీ శతకాలతో 627 పరుగులు చేసిన బట్లర్ ఆరెంజ్ క్యాప్ జాబితాలో ఎవరీకి అందనంత ఎత్తులో నిలిచాడు.
Jos Buttler : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) ప్లేయర్ జాస్ బట్లర్ (Jos Buttler) అదరగొడుతున్నాడు. ఇప్పటికే మూడు భారీ శతకాలతో 627 పరుగులు చేసిన బట్లర్ ఆరెంజ్ క్యాప్ జాబితాలో ఎవరీకి అందనంత ఎత్తులో నిలిచాడు. అయితే గత మూడు మ్యాచ్ ల్లోనూ బట్లర్ తన దైన శైలిలో బ్యాట్ కు పని చెప్పలేకపోతున్నాడు. అయితేనేం ఫీల్డింగ్ లో మెరుస్తూ కీలక సమయాల్లో జట్టుకు వికెట్లను అందిచండంలో భాగం అవుతున్నాడు. ఇక ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints), రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ 24 పరుగుల తేడాతో లక్నోపై గెలిచి ప్లే ఆఫ్స్ కు మరింత చేరువైంది.
ఛేజింగ్ లో లక్నో బ్యాటింగ్ చేస్తోండగా.. రవిచంద్రన్ అశ్విన్ వేసిన 13వ ఓవర్ తొలి బంతిని కృనాల్ పాండ్యా లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. గాల్లోకి లేచిన బంతి వేగాన్ని చూస్తూ సిక్సర్ వెళ్లేలా కనిపించింది. అయితే బౌండరీ లైన్ దగ్గర ఉన్న బట్లర్.. గాల్లోకి ఎగురుతూ సిక్సర్ వెళ్లే బంతిని ఒడిసి పట్టేసుకున్నాడు. అయితే బౌండరీ లైన్ దగ్గర ఉండటంతో అతడు నియంత్రణ కొల్పోయి బౌండరీని టచ్ అయ్యేలా కన్పించాడు. అయితే సమయస్ఫూర్తితో వ్యవహరించిన బట్లర్.. తనకు ఎదురుగా ఉన్న రియాన్ పరాగ్ కు బంతిని పాస్ చేస్తూ తాను బౌండరీ లైన్ ను తొక్కాడు. గాల్లోకి లేచిన బంతిని రియాన్ పరాగ్ క్యాచ్ అందుకున్నాడు. బట్లర్, పరాగ్ టీం ఎఫెక్ట్ తో కృనాల్ పాండ్యా పెవిలియన్ కు చేరాల్సి ఉచ్చింది. పాండ్యా ఆ సమయంలో 25 పరగులు చేసి ఉన్నాడు. ఈ క్యాచ్ కు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Brilliant catch from Jos Buttler and Riyan parag 👏👏
— Cricket Apna l Indian cricket (@cricketapna1) May 15, 2022
ఈ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ 24 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో రాజస్తాన్ రాయల్స్ 16 పాయింట్లతో గ్రూప్ లో రెండో స్థానానికి ఎగబాకింది. వరుసగా రెండో మ్యాచ్ లో ఓడిన లక్నో జట్టు 16 పాయింట్లతో ఉన్నా ఒక స్థానం కిందికి పడి మూడో స్థానంల ోనిలిచింది. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్ లో గెలవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి. ఎందుకంటే ఆ రెండు జట్లు తమ తదుపరి అన్ని మ్యాచ్ ల్లోనూ గెలిచినా 14 పాయింట్లు మాత్రమే సాధించగలవు. కానీ, లక్నో, రాజస్తాన్ రాయల్స్ జట్లకు ఇప్పటికే 16 పాయింట్లు ఉండగా.. ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు మాత్రమే 16 పాయింట్లు సాధించే అవకాశం ఉంది. దాంతో హైదరాబాద్, కేకేఆర్ నాకౌట్ ఆశలు ఈసారికి గల్లంతయినట్లే లెక్క.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.