హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - Ravichandran Ashwin : అశ్విన్ వాడకం అంటే ఇలానే ఉంటుంది.. ఐపీఎల్ చరిత్రలో తొలి క్రికెటర్ మనోడే..

IPL 2022 - Ravichandran Ashwin : అశ్విన్ వాడకం అంటే ఇలానే ఉంటుంది.. ఐపీఎల్ చరిత్రలో తొలి క్రికెటర్ మనోడే..

Ravichandran Ashwin ( IPL Twitter)

Ravichandran Ashwin ( IPL Twitter)

IPL 2022 - Ravichandran Ashwin : ఇంకొందరు మాత్రం క్రికెట్ బుక్‌లో ఉన్న రూల్స్ అన్నిటినీ అశ్విన్ వాడుతున్నాడని సెటైర్లు పేలుస్తున్నారు. గతంలో మన్కడింగ్ చేయడాన్ని ఉద్దేశిస్తూ ఇలాంటి కామెంట్లు చేశారు.

  ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) మరో సూపర్ విక్టరీ సొంతం చేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) తో ఆదివారం చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 3 పరుగుల తేడాతో గెలిచింది. చివరి ఓవర్‌లో లక్నో టీమ్ విజయానికి 14 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో డేంజరస్ మార్కస్ స్టోయినిస్(17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 38 నాటౌట్) ఉన్నాడు. పైగా ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 19వ ఓవర్‌లో అతను రెండు భారీ సిక్సర్లతో పాటు బౌండరీ బాది 19 పరుగులు పిండుకున్నాడు. పైగా ఆఖరి ఓవర్‌ను అంతగా అనుభవం లేని కుల్దీప్ సేన్‌కు సంజూ శాంసన్ ఇవ్వడంతో లక్నో విజయం ఖాయమని అంతా అనుకున్నారు.కానీ కుల్దీప్ సేన్ ఇక్కడ అద్భుతం చేశాడు. వరుసగా మూడు బంతులను డాట్స్ చేసి రాజస్థాన్‌కు చిరస్మరణీ విజయాన్నందించాడు. తొలి బంతికి ఆవేశ్ ఖాన్‌ సింగిల్ తీయగా.. మార్కస్ స్టోయినీస్ స్ట్రైకింగ్‌లోకి వచ్చాడు. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌తో కుల్దీప్ సేన్ మూడు డాట్ బాల్స్ వేసాడు. ఇక స్టోయినీస్ ఐదో బంతికి ఫోర్, చివరి బంతికి సిక్స్ కొట్టినా ఫలితం లేకపోయింది.

  అయితే, ఈ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుత ప్రదర్శన కనబర్చిన అశ్విన్ అనూహ్యంగా రిటైర్డ్ ఔటయ్యాడు. రిటైర్డ్ ఔట్ అంటే బ్యాట్స్‌మన్ తనంతట తాను ఔట్ ప్రకటించుకొని పెవిలియన్ చేరడం. ఐపీఎల్ చరిత్రలో ఇలా రిటైర్డ్ ఔటవ్వడం ఇదే తొలిసారి. రియాన్‌ పరాగ్‌కు బ్యాటింగ్ అవకాశం ఇవ్వడం కోసమే అశ్విన్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడని, టీ20 క్రికెట్‌లో ఇదో ట్రిక్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

  రిటైర్డ్‌ ఔట్‌ అయితే తిరిగి బ్యాటింగ్‌ చేసే అవకాశం మాత్రం ఉండదు. అదే రిటైర్డ్‌ హర్ట్‌(గాయపడినప్పు మైదానం వీడటం) అయితే సదరు బ్యాట్స్‌మన్‌ మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా చివరి బ్యాట్స్‌మన్‌గా క్రీజులోకి రావడానికి మాత్రమే చాన్స్ ఉంటుంది. రిటైర్డ్‌ ఔట్‌ అయితే మాత్రం మళ్లీ బ్యాటింగ్‌ చేసే అవకాశం రాదు. ఈ రెండింటి మధ్య ఇదే ప్రధాన వ్యత్యాసం.

  అయితే అశ్విన్‌ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థం కాలేదు. ఎందుకంటే తాను రిటైర్‌ ఔట్‌ అయ్యే సమయానికి మంచి బ్యాటింగ్‌ కొనసాగిస్తున్నాడు. 23 బంతుల్లో 2 సిక్స్‌లతో 28 పరుగులు చేశాడు. హెట్‌మైర్‌తో కలిసి 66 పరుగులు జోడించాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ రెండో బంతికి సింగిల్ తీసి అశ్విన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. అశ్విన్‌ చేసిన ఈ పనిని కొందరు వ్యతిరేకిస్తే.. మరికొందరు సమర్థిస్తున్నారు. మరికొందరు మాత్రం అతనికి బ్యాటింగ్ చేయడం అసౌకర్యంగా అనిపించిందేమోనని, టాయిలెట్‌కు వెళ్లాల్సి వచ్చిందేమోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

  ఇంకొందరు మాత్రం క్రికెట్ బుక్‌లో ఉన్న రూల్స్ అన్నిటినీ అశ్విన్ వాడుతున్నాడని సెటైర్లు పేలుస్తున్నారు. గతంలో మన్కడింగ్ చేయడాన్ని ఉద్దేశిస్తూ ఇలాంటి కామెంట్లు చేశారు. ఇక టీ20 క్రికెట్‌లో రిటైర్డ్‌ ఔట్‌ అయిన నాలుగో బ్యాటర్‌గా అశ్విన్‌ నిలిచాడు. ఇంతకముందు పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది, బూటాన్‌కు చెందిన ఎస్‌ తోగ్బే, కుమిల్లా వారియర్స్‌కు చెందిన సంజాముల్‌ ఇస్లామ్‌లు రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగారు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, IPL 2022, Lucknow Super Giants, Rajasthan Royals, Ravichandran Ashwin, Shahid Afridi

  ఉత్తమ కథలు