Home /News /sports /

IPL 2022 RAJASTHAN ROYALS NEWS RAJASTHAN PLAYERS JOS BUTTLER AND YUZVENDRA CHAHAL DANCE VIDEO GOES VIRAL SJN

IPL 2022 : వారెవ్వా బట్లర్ నీలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా..! చహల్ తో కలిసి..

బట్లర్, చహల్ (PC : TWITTER)

బట్లర్, చహల్ (PC : TWITTER)

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తాజా సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) ఓపెనర్ జాస్ బట్లర్ (Jos Buttler)భీకర ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. సీజన్ ఆరంభం నుంచి అద్భుత ఆటతీరుతో దూసుకెళ్తోన్న బట్లర్ ఆరెంజ్ క్యాప్ లిస్ట్ లో తొలి స్థానంలో ఉన్నాడు.

ఇంకా చదవండి ...
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తాజా సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) ఓపెనర్ జాస్ బట్లర్ (Jos Buttler)భీకర ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. సీజన్ ఆరంభం నుంచి అద్భుత ఆటతీరుతో దూసుకెళ్తోన్న బట్లర్ ఆరెంజ్ క్యాప్ లిస్ట్ లో తొలి స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు 10 మ్యాచ్ లు ఆడిన అతడు 588 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ లో 10 మ్యాచ్ ల్లో 19 వికెట్లు తీసిన ఆ జట్టు లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ (yuzvendra chahal) పర్పుల్ క్యాప్ రేసులో ముందున్నాడు. మరోవైపు అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో పటిష్టంగా ఉన్న రాజస్తాన్ రాయల్స్ కూడా ప్లే ఆఫ్స్ పై కన్నేసింది. అయితే గత రెండు మ్యాచ్ ల్లోనూ ఆ జట్టుకు ఊహించని రీతిలో పరాజయాలు ఎదురయ్యాయి.

ఇది కూడా చదవండి : తన వక్ర బుద్ధిని మరోసారి బయటపెట్టిన అఫ్రిది.. భారత్ పై అనుచిత వ్యాఖ్యలు..

అయితే తాజాగా జాస్ బట్లర్ చేత ఆ జట్టు లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ అదిరిపోయే స్టెప్పులు వేయించాడు. ఈ ఇద్దరు కలిసి ’డ్యాన్సింగ్ టు బల్లే ని బల్లే‘ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. బట్లర్‌ స్లో మూమెంట్స్‌తో క్యూట్‌గా చేయగా.. చహల్‌ మాత్రం​ మాస్‌ డ్యాన్స్‌ చూపించాడు. దీనికి సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ తమ ట్విట్టర్ ఖాతాలో పెట్టింది. ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ బట్లర్ గ్రేస్ కు ఫిదా అవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం బట్లర్ స్టెప్పులను మీరు కూడా చూసేయండి మరీ.



ఇక ఈ పాటకు కొరియోగాఫ్రర్‌ ఎవరో తెలుసా.. చహల్‌ భార్య.. యూట్యూబర్‌ ధనశ్రీ వర్మ. ‘నా మోస్ట్ ఫెవరెట్ రీల్... మై ఫెవరెట్స్... లవ్’ అంటూ ధనశ్రీ కామెంట్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే 10 మ్యాచుల్లో 6 విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్, మిగిలిన 4 మ్యాచుల్లో రెండింట్లో గెలిస్తే... ఇతర జట్ల జయాపజయాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశం ఉంటుంది. లేదంటే రాజస్తాన్ కథ కూడా అస్సామే.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: IPL, IPL 2022, Jasprit Bumrah, Mumbai Indians, Rajasthan Royals, Ravichandran Ashwin, Rohit sharma, Sanju Samson

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు