Home /News /sports /

IPL 2022 RAJASTHAN ROYALS FAST BOWLING COACH LASITH MALINGA FEELS MUMBAI INDIANS INDIA SHOULD COME BACK STRONG IN LATER STAGE OF THIS SEASON SRD

IPL 2022 - Mumbai Indians : ముంబై చెత్త ప్రదర్శన తర్వాత కూడా ఆ జట్టుపై ప్రత్యర్థి టీం కోచ్ కు ఇంత నమ్మకమా..!

Mumbai Indians

Mumbai Indians

IPL 2022 - Mumbai Indians : ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ కి బ్యాడ్ టైం నడుస్తోంది. సీజన్ లో అత్యంత దారుణంగా తయారైంది ముంబై పరిస్థితి. గెలుపు కోసం ముఖం వాచిపోయేలా ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది.

    ఐపీఎల్ 2022 సీజన్ (IPL 2022) లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) పరిస్థితి మ్యాచ్ మ్యాచుకీ దారుణంగా మారుతోంది. ఆ జట్టు గెలవడమే గగనంగా మారిపోయింది. లేటెస్ట్ గా ముంబై ఇండియ‌న్స్‌పై ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ 18 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. దీంతో, త‌మ ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే ఎన్న‌డూ లేని విధంగా ఒక్క మ్యాచ్ కూడా గెల‌వ‌కుండా వ‌రుస‌గా ఆరో ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. ఈ సీజన్‌లో ఇంకా బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్‌ ఒక్క విజయం సాధించడం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంది. ఐదుసార్లు ఐపీఎల్‌లో చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్సేనా ఇప్పుడు ఆడుతుంది అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 2015 ఐపీఎల్‌ సీజన్‌లో వరుసగా ఐదు పరాజయాలు నమోదు చేసినప్పటికి.. ఆరో మ్యాచ్‌లో విజయం సాధించి.. ఆ తర్వాత చాంపియన్‌గా నిలిచింది. కానీ ఈసారి సీన్‌ రివర్స్‌ అయింది.

    అయితే, ముంబై కమ్ బ్యాక్ ఇస్తుందని ప్రత్యర్థి జట్టు కోచ్ ఆశాభవం వ్యక్తం చేస్తున్నాడు. టోర్నీలో ముంబై ఇండియన్స్ తిరిగి సత్తా చాటుతోందని రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగా విశ్వాసం వ్యక్తం చేశాడు. మలింగా తన ఐపీఎల్ కెరీర్ మొత్తం ముంబై తరపున ఆడాడు. ముంబైకి అత్యంత విజయవంతమైన బౌలర్. ముంబై ఇండియన్స్‌పై పూర్తి అవగాహన ఉన్న మలింగా.. తన పాత జట్టుపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు.

    లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయిన తర్వాత మలింగ ఈ ట్వీట్ చేశాడు. 'ముంబై జట్టు కమ్ బ్యాక్ ఇవ్వడంలో స్పెషలిస్ట్. ఆ జట్టులోని ఆటగాళ్లు, కోచ్, సహాయక బృందం అస్సలు వెనక్కి తగ్గరు. ఈ సీజన్ లో ఆ జట్టు ప్లే ఆఫ్ చేరుతుంతో లేదో తెలియదు కానీ.. టోర్నీ ముగిసేసమయానికి ముంబై మాత్రం సత్తా చాటుతుందని చెప్పగలను ' అంటూ ట్వీట్ చేశాడు మలింగా.


    అయితే,  మలింగా చెప్పినట్టు ఇప్పుడున్న పరిస్థితిలో ఇక ముంబై ఇండియన్స్‌ కోలుకోవడం కష్టమే అనిపిస్తుంది. ఇక, ఈ ఓటమితో ఐపీఎల్‌ చరిత్రలోనే చెత్త రికార్డు మూట గట్టుకుంది. ఒక సీజన్‌లో వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడిన మూడో జట్టుగా ముంబై ఇండియన్స్‌ నిలిచింది. ఇంతకముందు 2013లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, 2019లో ఆర్‌సీబీ తమ తొలి ఆరు మ్యాచ్‌లు వరుసగా ఓడిపోయాయి. అంతేకాదు ఈ జట్లు ఆయా సీజన్లను చివరి స్థానంతో ముగించాయి. ఇప్పుడు ముంబై కూడా అదే తరహాలో పయనిస్తోంది. ముంబై ఆటతీరు చూస్తుంటే సీజన్‌ను ఆఖరి స్థానంతో ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.

    గత సీజన్‌ వరకు ముంబై జట్టు సమతూకంగా ఉండేది. బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లతో దుర్భేద్యంగా ఉండేది. అయితే ఈసారి మాత్రం యువ క్రికెటర్లు ఉండటం, సీనియర్లు ఫామ్‌లో లేకపోవడం కలవరపెడుతోంది. ఇషాన్‌, సూర్యకుమార్, తిలక్, బ్రెవిస్‌ వంటి వారు ఆడుతున్నా.. వ్యక్తిగతంగా రోహిత్ భారీగా పరుగులు చేయడం లేదు. ఇక హార్డ్‌ హిట్టర్‌ కీరన్ పొలార్డ్‌ పరిస్థితి మరీ దారుణం. ఆల్‌రౌండర్‌ పాత్రను పోషించడంలో తీవ్రంగా విఫలమయ్యాడు. ఇక బుమ్రాకు బౌలింగ్‌లో సహకారం లేదు. ఈ లోపాల్ని సరిదిద్దుకోకపోతే.. ముంబై ఈ సీజన్ లో అత్యంత చెత్త రికార్డులను ఖాతాలో వేసుకోవాల్సి వస్తుంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, IPL 2022, Jasprit Bumrah, Mumbai Indians, Rohit sharma

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు