IPL 2022 RAJASTAN ROYALS CHEAP STUNTS TO GAIN FANS ATTENTION AHEAD OF IPL 2022 SEASON SJN
IPL 2022: అటెన్షన్ కోసం మరీ ఇంతకి దిగజారుతారా? రాజస్తాన్ రాయల్స్ ను ఛీ.. ఛీ అంటోన్న అభిమానులు
రాజస్తాన్ రాయల్స్ (ఫైల్ ఫోటో)
IPL 2022: సంజూ సామ్సన్ నాయకత్వంలో అయినా మళ్లీ ఐపీఎల్ చాంపియన్ గా నిలవాలని చూస్తోంది. అందుకు తగ్గట్టే జట్టును రెడీ చేస్తోంది. అయితే ఐపీఎల్ లో ఇతర జట్లతో పోలీస్తే రాజస్తాన్ రాయల్స్ కు పాపులారిటీ కొంచెం తక్కువ. దానికి కారణం జట్టులో క్రౌడ్ పుల్లర్ లేకపోవడమే. దాంతో అభిమానుల అటెన్షన్ ను పొందడానికి రాజస్తాన్ రాయల్స్ బరితెగింపు చర్యలకు దిగింది.
IPL 2022: క్రికెట్ ప్రియులను అలరించడానికి మెగా టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మరికొన్ని గంటల్లో మనముందుకు రానుంది. నేటి రాత్రి గం. 7.30 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) మధ్య జరిగే తొలి పోరుతో ఐపీఎల్ 15వ సీజన్ కు తెరలేవనుంది. ఈ రెండు జట్లు ఇప్పటికే ముంబై చేరుకొని తమ సన్నాహకాలతో బిజీగా ఉంటే... మిగిలిన ఎనిమిది జట్లు కూడా తమ ఆరంభ మ్యాచ్ ల కోసం రెడీ అవుతున్నాయి. అయితే ఒక జట్టు మాత్రం అభిమానుల అటెన్షన్ కోసం దిగజారుడు పనులతో బిజీగా ఉంది. ఆ జట్టే... రాజస్తాన్ రాయల్స్ (Rajastan Royals). 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్ లో ఎవరూ ఊహించని విధంగా చాంపియన్ గా నిలిచిన ఆ జట్టు మళ్లీ ఆ తరహా ప్రదర్శనను రిపీట్ చేయలేకపోయింది.
తాజాగా సంజూ సామ్సన్ నాయకత్వంలో అయినా మళ్లీ ఐపీఎల్ చాంపియన్ గా నిలవాలని చూస్తోంది. అందుకు తగ్గట్టే జట్టును రెడీ చేస్తోంది. అయితే ఐపీఎల్ లో ఇతర జట్లతో పోలీస్తే రాజస్తాన్ రాయల్స్ కు పాపులారిటీ కొంచెం తక్కువ. దానికి కారణం జట్టులో క్రౌడ్ పుల్లర్ లేకపోవడమే. దాంతో అభిమానుల అటెన్షన్ ను పొందడానికి రాజస్తాన్ రాయల్స్ బరితెగింపు చర్యలకు దిగింది. దీనికి సోషల్ మీడియా అయిన ట్విట్టర్ ను వేదికగా చేసుకుంది. వారం రోజుల క్రితం జట్టు అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఐపీఎల్ 15వ సీజన్ కెప్టెన్ యుజువేంద్ర చహల్ అనే ట్వీట్ ప్రత్యక్షమైంది. కెప్టెన్సీ నుంచి సామ్సన్ ను తొలగించారా? అంటూ అభిమానులు రీట్వీట్స్ చేశారు. కాసేపటికి అకౌంట్ ను తాను హ్యాక్ చేసి ఆ విధంగా ట్వీట్ పెట్టినట్లు చహల్ పేర్కొన్నాడు.
తాజాగా ఆ జట్టు మరో చెత్త పబ్లిసిటీ స్టంట్ తో అభిమానుల ముందుకు వచ్చింది. శుక్రవారం నాడు సంజా సామ్సన్ ను ట్రోల్ చేస్తూ ఓ ఫోటోను ట్వీట్టర్ లో పెట్టింది. దీనిపై సంజూ సామ్సన్ ఘాటుగా స్పందించాడు. ప్రొఫెషనల్ గా ఉండాలంటూ రాజస్తాన్ సోషల్ మీడియా టీంకు హితవు పలికాడు. ఇక వెంటనే రంగంలోకి దిగిన రాజస్తాన్ టీం... సోషల్ మీడియా టీంను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా జోస్ బట్లర్, రవిచంద్రన్ అశ్విన్, కుమార సంగక్కారలు సోషల్ మీడియా టీంకు వార్నింగ్ ఇచ్చే వీడియోను కూడా పోస్ట్ చేసింది.
Sanju Samson is totally right. he's captain of an IPL team and you are posting such cheap snap photos of him. have you ever seen such photo of virat, Rohit,Dhoni ?? Majak ki bhi ek limit Hoti hai !! pic.twitter.com/NIEHWm3Fwk
శనివారం ఉదయం మాత్రం ఇదంతా ప్రాంక్ అంటూ రాజస్తాన్ రాయల్స్ టీం బాంబు పేల్చింది. సోషల్ మీడియా టీంను మేం తొలగించలేదంటూ... సామ్సన్ పై ట్వీట్ నుంచి సోషల్ మీడియా టీంకు వార్నింగ్ ఇవ్వడం... వారిని తొలగించడం ఇవన్ని జస్ట్ అటెన్షన్ కోసం చేసినట్లు పేర్కొంది. దాంతో ఆగ్రహించిన అభిమానులు... పబ్లిసిటీ కోసం ఇంతకు దిగజారుతారా అంటూ ట్వీట్స్ పెడుతున్నారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.