హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL Qualifier 1 : కోల్ కతా లో భారీ వర్షం.. క్వాలిఫయర్ 1 జరిగేది అనుమానమే? అలా జరిగితే ఏ జట్టు ఫైనల్ చేరుతుందంటే..

IPL Qualifier 1 : కోల్ కతా లో భారీ వర్షం.. క్వాలిఫయర్ 1 జరిగేది అనుమానమే? అలా జరిగితే ఏ జట్టు ఫైనల్ చేరుతుందంటే..

కోల్ కతా వాతావరణం (PC : TWITTER)

కోల్ కతా వాతావరణం (PC : TWITTER)

IPL Qualifier 1 : మరికొద్ది సేపట్లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) మధ్య క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. కోల్ కతాలోని విఖ్యాత ఈడెన్ గార్డెన్ మైదానంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది.

IPL Qualifier 1 : మరికొద్ది సేపట్లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) మధ్య క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. కోల్ కతాలోని విఖ్యాత ఈడెన్ గార్డెన్ మైదానంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ కు వరణుడు అడ్డుగా నిలిచే అవకాశం ఉంది. మూడు గంటల క్రితం కోల్ కతాలో భారీ వర్షం కురిసింది. అంతే కాకుండా కోల్ కతా మొత్తం దట్టమైన మేఘాలు అలుముకొని ఉన్నాయి. ఇక స్టేడియంలోని పిచ్ ను అయితే పూర్తిగా కవర్స్ తో కప్పి ఉంచారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం నేడు రేపు కోల్ కతా మొత్తం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి : శిఖర్ ధావన్ పై వేటు విషయంలో ద్రవిడ్, రాహుల్ పాత్ర.. అందుకే సెలెక్ట్ చేయలేదా?

మూడు రోజుల క్రితం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి మైదానంలోని గ్యాలరీలు ధ్వంసం అయ్యాయి. అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అయితే వెంటనే రంగంలోకి దిగిన బెంగాల్ క్రికెట్ సంఘం హుటాహుటిన మరమ్మత్తుల చేసి క్వాలిఫయర్ నాటికి గ్రౌండ్ ను సిద్ధం చేసింది. ఇందుకోసం పిచ్ క్యూరేటర్ తో పాటు గ్రౌండ్ స్టాఫ్ తీవ్రంగా శ్రమించారు. అయితే వీరి శ్రమ తాజా వర్షంతో వృధా అయ్యే అవకాశం ఉంది. కోల్ కతా లోని క్రికెట్ అభిమానులు ప్రస్తుతం అక్కడి వాతావరణ పరిస్థితిని ట్విట్టర్ లో షేర్ చేస్తున్నారు.

నిబంధనల ప్రకారం మ్యాచ్ ను అర్ధ రాత్రి 12.50 నిమిషాలలోపు ముగించాలి. వర్షంతో మ్యాచ్ ఆగిపోతే.. కనీసం ఇన్నింగ్స్ కు 5 ఓవర్ల చొప్పున జరిపేందుకు అంపైర్లు చూస్తారు. అది సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. సూపర్ ఓవర్ కూడా సాధ్యం కాకపోతే లీగ్ దశలో పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో నిలిచిన జట్టు ఫైనల్ కు చేరుకుంటుంది. అలా జరిగితే గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కు చేరుకుంటుంది. రెండో స్థానంలో నిలిచిన జట్టు అహ్మదాబాద్ వేదికగా జరిగే క్వాలిఫయర్ 2 ఆడనుంది.

First published:

Tags: Gujarat Titans, Hardik Pandya, IPL, IPL 2022, Kolkata, Mohammed Shami, Rajasthan Royals, Rashid Khan, Ravichandran Ashwin, Sanju Samson

ఉత్తమ కథలు