Ravichandran Ashwin : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా మంగళవారం గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్ల మధ్య క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ లో తొలి సీజన్ ఆడుతోన్న గుజరాత్ టైటాన్స్ ఒత్తిడిని అధిగమించి 7 వికెట్లతో నెగ్గిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఫైనల్ కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తిక సంఘటన చోటు చేసుకుంది. రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఆఖరి ఓవర్ వేసిన యశ్ ధయాల్.. చివరి బంతిని నో బాల్ గా వేశాడు. వాస్తవానికి అదే ఆఖరి బంతి అనుకున్న బట్లర్ లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. అయితే థర్డ్ అంపైర్ అది నోబాల్ గా తేల్చడంతో రాజస్తాన్ రాయల్స్ కు అదనంగా మరో బంతి లభించింది. బట్లర్ అవుట్ అవ్వడంతో అశ్విన్ క్రీజులోకి వచ్చాడు.
ఫ్రీ హిట్ బంతిని దయాల్ వైడ్ గా వేశాడు. బంతి కీపర్ చేతిలోకి వెళ్లగా.. నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న రియాన్ పరాగ్ పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న అశ్విన్ వద్దంటూ వారించినా.. పరాగ్ మాత్రం పిచ్ మధ్య వరకు వెళ్లి రనౌట్ అయ్యాడు. దాంతో అశ్విన్ వైపు చూస్తూ ఏంటిది అన్నట్లు ఎక్స్ ప్రెషన్ పెట్టాడు. దానికి అశ్విన్ ’నిన్ను ఎవడు రమ్మన్నాడు‘ అన్నట్లు కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన రనౌట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరేమో పరాగ్ తిక్క కుదిరిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీజన్ లో పరాగ్ తన ఆటతో కంటే కూడా ఓవరాక్షన్ తో పాపులర్ అయ్యాడు. మరికొందరేమో డెత్ ఓవర్స్ లో పరుగుల కోసం ప్రయత్నించాలంటూ అశ్విన్ ను తప్పు బడుతున్నారు.
Riyan Parag gets runout pic.twitter.com/k8rzf0SjZI
— StumpMic Cricket (@stumpmic_) May 24, 2022
Ashwin humiliated Riyan Parag in the middle of the pitch 😭😭 pic.twitter.com/daBoH71heb
— ` (@FourOverthrows) May 24, 2022
189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ను డేవిడ్ మిల్లర్ (38 బంతుల్లో 68 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) సూపర్ షోతో అలరించాడు. ఆఖరి ఓవర్లలో రాజస్తాన్ విజయానికి 16 పరుగులు కావాల్సిన తరుణంలో.. ప్రసిధ్ వేసిన చివరి ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టిన డేవిడ్ మిల్లర్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ ను ఫైనల్స్ లో నిలిపాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (27 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు) మరోసారి మంచి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. జాస్ బట్లర్ (53 బంతుల్లో 86; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోయాడు. కెప్టెన్ సంజూ సామ్సన్ (26 బంతుల్లో 47; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), పడిక్కల్ (28) కూడా రాణించడంతో రాజస్తాన్ భారీ స్కోరును అందుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dinesh Karthik, Faf duplessis, Glenn Maxwell, Gujarat Titans, Hardik Pandya, IPL, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, Mohammed Shami, Rajasthan Royals, Rashid Khan, Ravichandran Ashwin, Royal Challengers Bangalore, Sanju Samson, Virat kohli