IPL 2022 QUALIFIER 2 VIRAT KOHLI FLOP SHOW CONTINUES AND THESE STATS SHOE HOW HE FAIL IN KNOCK OUT MATCHES SRD
Virat Kohli : కోహ్లి నిజంగా పెద్ద మ్యాచ్ ఆటగాడేనా? ఈ గణాంకాలు అసలు కథను చెబుతున్నాయి..
Virat Kohli
Virat Kohli : విరాట్ కోహ్లీకి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. గత రెండున్నరేళ్లుగా ఒక్క అంతర్జాతీయ సెంచరీ చేయలేకపోయిన కోహ్లీ.. లేటెస్ట్ గా క్వాలిఫయర్ -2 మ్యాచులో కూడా నిరాశపర్చాడు.
ఇండియన్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒక సంచలనం. టీమిండియా (Team India)లోకి వచ్చీ రావడంతోనే సెంచరీల మీద సెంచరీలతో కదంతొక్కిన ఘనుడు. రన్ మిషీన్ గా పేరు గాంచిన కోహ్లీ.. సచిన్ రికార్డులను బద్దలు కోట్టే సత్తా గల క్రికెటర్ అంటూ అందరి చేత మన్నలను అందుకున్నాడు. అయితే కాలం మారింది. గత రెండున్నరేళ్లుగా ఒక్క అంతర్జాతీయ సెంచరీ చేయలేకపోయిన కోహ్లీ.. ఇప్పుడు పరుగులు చేసేందుకు కూడా ఆపసోపాలు పడుతున్నాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ (IPL 2022)లో కోహ్లీ లోనే అత్యంత చెత్త ప్రదర్శన చేస్తున్నాడు. ఇక, లేటెస్ట్ గా నాకౌట్ మ్యాచులో కూడా తన చెత్త ప్రదర్శనతో ఫ్యాన్స్ ను నిరుత్సాహపర్చాడు. రాజస్థాన్ రాయల్స్ (RCB vs RR)తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 8 బంతుల్లో 7 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఈ సీజన్లో ఐపీఎల్లో 16 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 22.73 సగటుతో 115.98 స్ట్రైక్ రేట్‌తో 2 అర్ధసెంచరీలతో సహా 341 పరుగులు చేశాడు. 73 పరుగులు అతని అత్యధిక స్కోరు. ఐపీఎల్ తొలి సీజన్ నుంచి విరాట్ కోహ్లి ఆర్సీబీ తరఫున ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 11 ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్‌లు ఆడాడు, అందులో ఒక్కసారి మాత్రమే హాఫ్ సెంచరీ చేయగలిగాడు.
IPL 2011 మొదటి క్వాలిఫైయింగ్ ఫైనల్లో విరాట్ 70 పరుగులు చేశాడు. అప్పట్నుంచి నాకౌట్ వంటి ముఖ్యమైన మ్యాచ్‌లలో కోహ్లీ చేతుల్తేశాడు. 11 ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్‌ల్లో విరాట్ కేవలం 212 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో.. కీలక మ్యాచుల్లో కోహ్లీ ఎంత చెత్తగా ఆడతాడో ఈ గణంకాలు చూస్తేనే అర్ధమవుతోంది.
ఐపీఎల్ నాకౌట్ మ్యాచుల్లో విరాట్ ప్రదర్శన
IPL 2009 సెమీ ఫైనల్ - 24 నాటౌట్
IPL 2010 సెమీ ఫైనల్ - 9 పరుగులు
IPL 2011 మొదటి క్వాలిఫైయింగ్ ఫైనల్ - 70 నాటౌట్
IPL 2011 రెండవ క్వాలిఫైయింగ్ ఫైనల్ - 8 పరుగులు
IPL 2015 ఎలిమినేటర్ - 12 పరుగులు
IPL 2015 రెండవ క్వాలిఫైయర్ - 12 పరుగులు
IPL 2016 మొదటి క్వాలిఫైయర్ - 0 పరుగులు
IPL 2020 ఎలిమినేటర్ - 6 పరుగులు
IPL 2021 ఎలిమినేటర్ - 39 పరుగులు
IPL 2022 ఎలిమినేటర్ - 25 పరుగులు
IPL 2022 క్వాలిఫయర్ 2 - 7 పరుగులు
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.