ఐపీఎల్ 2022 సీజన్ (IPL 2022) ఆఖరి ఘట్టానికి చేరుకుంది. తొలి క్వాలిఫయర్‌లోలో రాజస్థాన్‌పై గుజరాత్ (Gujarat Titans) గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక, ఎలిమినేటర్ మ్యాచులో గెలిచి క్వాలిఫైయర్- 2 లో అడుగుపెట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore). ఇక, డూ ఆర్ డై ఫైట్ క్వాలిఫయర్ -2 లో రాజస్థాన్ రాయల్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది ఆర్సీబీ (RCB). ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్లనుంది. ఓడిన జట్టు ఇక లగేజీ సర్దుకోవడమే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు రెండు కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. దీంతో రెండు జట్ల మధ్య జరిగే క్వాలిఫయర్ -2 మ్యాచ్ రసవత్తరంగా జరగనుంది. శుక్రవారం అహ్మద్ బాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో హెడ్ టు హెడ్ రికార్డులు, తుది జట్ల అంచనాపై ఓ లుక్కేద్దాం
ఈసాలా కప్ నమదే.. నినాదంతో ఆర్సీబీ ప్రతి సీజన్‌కు రావడం.. ఆ తర్వాత బొక్కబొర్లాపడటం మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుత సీజన్‌లోనూ లీగ్ దశకే పరిమితమై ఇంటిముఖం పడుతుందని భావించినా ఆఖరికి ఢిల్లీపై ముంబై విజయంతో బెంగళూరు ఊపిరి పీల్చుకుని ప్లేఆఫ్స్‌లోకి అడుగు పెట్టింది. ఇక, క్వాలిఫయర్ -2 లో పటిష్ట లక్నోను చిత్తు చేసింది. జట్టు పేపర్ మీద చాలా స్ట్రాంగ్ గా కన్పిస్తోంది. కానీ మైదానంలో తేలిపోతుండటమే అసలు సమస్య. కానీ, ఎలిమినేటర్ లో యంగ్ బ్యాటర్ రజత్ పాటిదార్ సూపర్ సెంచరీతో దుమ్మురేపాడు. ఈ యంగ్ గన్ ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే ఆర్సీబీకి తిరుగుండదు.
ఇక, ఈ సీజన్ ఆరంభంలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అదరగొట్టాడు. తర్వాత నుంచి తన స్థాయి ఆటను ఆడలేకపోయాడు. ఎలిమినేటర్ లో డకౌటయ్యాడు. కీలక మ్యాచులో సత్తా చాటాల్సి ఉంది. ఇక మ్యాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిదేమో. ఒకటి అరా మ్యాచుల్లో తప్ప పెద్దగా రాణించిందేమీ లేదు. అయితే బ్యాటింగ్‌లో మిడిల్, లోయర్‌ఆర్డర్‌ను సమన్వయం చేసుకుంటూ దినేశ్ కార్తిక్ రెచ్చిపోయాడు. 15మ్యాచుల్లో 187.28 స్ట్రైక్‌రేట్‌తో 324 పరుగులు సాధించాడు.
అయితే కార్తిక్ మాత్రమే కాకుండా మిగతా బ్యాటర్లూ లక్నోతో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాణించాల్సిందే. లేకపోతే గెలవడం అంత సులువేం కాదు. బౌలింగ్‌లో బెంగళూరు పరిస్థితి ఫర్వాలేదు. వాహిందు హసరంగ (25) మోస్ట్ వికెట్స్ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. హర్షల్ పటేల్ (19), జోష్ హేజిల్‌వుడ్ (18) కీలక పాత్ర పోషిస్తున్నారు. మహమ్మద్ సిరాజ్ (9) ఈసారి పెద్దగా ఆకట్టుకోలేదు. షాబాజ్ నదీమ్ ఆల్‌రౌండ్ పాత్రను సమర్థంగా పోషించాలి.
ఇది కూడా చదవండి : గబ్బర్ ని చితకబాదిన అభిమాని..పక్కన పోలీస్ ఉన్నా లెక్క చేయలేదు.. పాపం శిఖర్..
ఇక రాజస్థాన్ జట్టుకు జోస్ బట్లర్ కీ ప్లేయర్ అని కచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 15 మ్యాచ్ లు ఆడిన బట్లర్ 718 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతానికి బట్లర్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కూడా ఉన్నాడు. ఇక యశస్వీ జైశ్వాల్, కెప్టెన్ సంజూ సాంసన్, దేవదత్ పడిక్కల్, హెట్ మెయిర్, రియాన్ పరాగ్ లతో రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ ఫుల్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది.
అటు బౌలింగ్ విభాగంలో రాజస్థాన్ అదరగొడుతోంది. రాజస్థాన్ బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ ఆరంభ ఓవర్లలో వికెట్లను తీసి ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నారు. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (26) సీజన్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. స్పిన్నర్ అదరగొడుతున్నాడు. 15 మ్యాచులు ఆడిన చాహల్ 26 వికెట్లు తీసి ప్రస్తుతానికి పర్పుల్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు. మిడిల్ ఓవర్లలో అశ్విన్ పరుగులు నియంత్రిస్తూ ప్రత్యర్ధుల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాడు.
హెడ్ టు హెడ్ రికార్డులు :
ముఖాముఖి పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుదే పై చేయి. ఆడిన 24 మ్యాచుల్లో ఆర్సీబీ 13 గేమ్స్ లో విక్టరీ సాధించింది. ఇక, రాజస్థాన్ 11 మ్యాచుల్లో విజయకేతనం ఎగురవేసింది.
తుది జట్లు అంచనా :
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫాప్ డుప్లెసిస్ (కేప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రార్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్
రాజస్తాన్ రాయల్స్ : జాస్ బట్లర్, యశస్వీ జైస్వాల్, సంజూ సామ్సన్ (కెప్టెన్), పడిక్కల్, షిమ్రన్ హెట్ మైర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజువేంద్ర చహల్, ప్రసిధ్, ఒబెడ్ మెకాయ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Faf duplessis, IPL 2022, Rajasthan Royals, Ravichandran Ashwin, Royal Challengers Bangalore, Sanju Samson, Virat kohli