హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 Qualifier 2 : రాజస్తాన్ బీ అలర్ట్.. ఈ ఇద్దరు ఆర్సీబీ బౌలర్లకు బెదురుతున్న శాంసన్..

IPL 2022 Qualifier 2 : రాజస్తాన్ బీ అలర్ట్.. ఈ ఇద్దరు ఆర్సీబీ బౌలర్లకు బెదురుతున్న శాంసన్..

Sanju Samson

Sanju Samson

IPL 2022 Qualifier 2 : డూ ఆర్ డై ఫైట్ క్వాలిఫయర్ -2 లో రాజస్థాన్ రాయల్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది ఆర్సీబీ (RCB). ఈ మ్యాచ్‌ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌ కు వెళ్లనుంది.

ఐపీఎల్ 2022 సీజన్‌ (IPL 2022) ఆఖరి ఘట్టానికి చేరుకుంది. తొలి క్వాలిఫయర్‌లోలో రాజస్థాన్‌పై గుజరాత్‌ (Gujarat Titans) గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక, ఎలిమినేటర్ మ్యాచులో గెలిచి క్వాలిఫైయర్- 2 లో అడుగుపెట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore). ఇక, డూ ఆర్ డై ఫైట్ క్వాలిఫయర్ -2 లో రాజస్థాన్ రాయల్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది ఆర్సీబీ (RCB). ఈ మ్యాచ్‌ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌ కు వెళ్లనుంది. ఓడిన జట్టు ఇక లగేజీ సర్దుకోవడమే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు రెండు కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. దీంతో రెండు జట్ల మధ్య జరిగే క్వాలిఫయర్‌ -2 మ్యాచ్‌ రసవత్తరంగా జరగనుంది.

ఇక, ఈ ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. జోస్ బట్లర్ (718) తర్వాత రాజస్థాన్‌ నుంచి అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు సంజూనే. ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లాడి 2 అర్ధసెంచరీలతో సహా 421 పరుగులు చేశాడు. కానీ, శాంసన్‌ను అడ్డుకునేందుకు బెంగళూరు వద్ద ఒకటి కాదు రెండు ఆయుధాలు ఉన్నాయి.

RCB నుంచి మొదటి ఆయుధం వానిందు హసరంగ. శ్రీలంక లెగ్ స్పిన్నర్ శాంసన్‌ను ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. హసరంగ 6 టీ20 ఇన్నింగ్స్‌ల్లో శాంసన్‌ను ఐదుసార్లు అవుట్ చేశాడు. రాజస్థాన్ కెప్టెన్ హసరంగ బౌలింగ్ లో 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. అందుకే ఈ మ్యాచ్‌లో హసరంగతో జర జాగ్రత్తగా ఉండాల్సిందే.

ఇక, ఆర్సీబీ స్పీడ్ గన్ మహ్మద్ సిరాజ్ కూడా సంజూపై అద్భుతమైన రికార్డు ఉంది. సిరాజ్‌ బౌలింగ్ లో శాంసన్ 20 బంతుల్లో 21 పరుగులు చేసి రెండుసార్లు ఔట్ అయ్యాడు. దీంతో.. హసరంగ, సిరాజ్ బౌలింగ్ లో జాగ్రత్తగా ఆడకపోతే ఇక అంతే సంగతులు.

ఇది కూడా చదవండి :  జార్ఖండ్ పంచాయితీ ఎన్నికల విధుల్లో ధోని.. వైరల్ గా మారిన ఫోటో.. అసలు మ్యాటర్ ఇదే..!

ఇక, పర్పుల్ క్యాప్ రేసులో హసరంగ, చాహల్ పోటీపడుతున్నారు. హసరంగ ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు ఆడి 16.16 సగటుతో 25 వికెట్లు తీశాడు. చాహల్ 26 వికెట్లతో అతని కంటే ముందున్నాడు. అందువల్ల, పర్పుల్ క్యాప్ ఎవరదన్నది తేలడానికి ఈ ఇద్దరు బౌలర్లకు ఈ మ్యాచ్ చాలా కీలకమైంది.

తుది జట్లు అంచనా :

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫాప్ డుప్లెసిస్ (కేప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రార్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్

రాజస్తాన్ రాయల్స్ : జాస్ బట్లర్, యశస్వీ జైస్వాల్, సంజూ సామ్సన్ (కెప్టెన్), పడిక్కల్, షిమ్రన్ హెట్ మైర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజువేంద్ర చహల్, ప్రసిధ్, ఒబెడ్ మెకాయ్.

First published:

Tags: Faf duplessis, IPL 2022, Mohammed Siraj, Rajasthan Royals, Royal Challengers Bangalore, Sanju Samson, Virat kohli

ఉత్తమ కథలు